వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వినియోగదారుల వ్యవహారాల విభాగం 'వినియోగదారుల సాధికారత వారోత్సవాలు' మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ప్రారంభించింది


వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు 23 రాష్ట్రాలు/యూటీలలోని 85 కంటే ఎక్కువ గ్రామాలలో రూరల్ ఔట్రీచ్ కార్యక్రమాల నిర్వహణ

వినియోగదారుల హక్కులు మరియు శాఖ చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు MyGovలో క్విజ్ పోటీని ప్రారంభించారు

Posted On: 15 MAR 2022 6:53PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు దేశ  ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి మరియు విజయాలను పురస్కరించుకుని వాటిని స్మరించుకోవడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ 14 మార్చి 2022న “వినియోగదారుల సాధికారత వారోత్సవాన్ని” ప్రారంభించింది.


వినియోగదారుల హక్కులు, గరిష్ట చిల్లర ధర, తయారీ తేదీ, బిఐఎస్, హాల్‌మార్క్ మొదలైన వాటి గురించి గ్రామస్థులను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్‌ బంకురాలోని ఓండా హై స్కూల్ ప్రధానోపాధ్యాలు శ్రీ తుషార్ కాంతి బంద్యోపాధ్యాయ ప్రసంగించారు.

ఈ రకమైన మొదటి చొరవలో డిపార్ట్‌మెంట్ కింద ఉన్న సంస్థల ఫీల్డ్ యూనిట్లు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ (ఐఐఎల్ఎం) రాంచీ, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సిసిఎఫ్), నేషనల్ టెస్ట్ హౌస్ (ఎన్‌టీహెచ్) మరియు రీజనల్ రిఫరెన్స్ స్టాండర్డ్స్ లాబొరేటరీస్ (ఆర్ఆర్ఎస్ఎల్‌లు) ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, జార్ఖండ్‌ కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్‌లోని
85 కంటే ఎక్కువ గ్రామాలలో వినియోగదారుల అవగాహన మరియు గ్రామీణ ఔట్రీచ్ కార్యక్రమాలను నిర్వహించాయి. గ్రామీణ ప్రజల  భాగస్వామ్యంతో 23 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో గ్రామీణ ఔట్రీచ్ మరియు వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు జరిగాయి.


భటానే గ్రామం, వసాయ్, పాల్ఘర్, మహారాష్ట్రలో కార్యక్రమం. ఎన్‌టీహెచ్, డబ్లూ ఆర్ మరియు వాటర్ టెస్టింగ్ క్యాంప్ డైరెక్టర్ ప్రసంగం

ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు వినియోగదారుల రక్షణ చట్టం 2019, ఇండియన్ స్టాండర్డ్ మార్కులు, హాల్‌మార్క్ చేసిన ఆభరణాలు, సిఆర్ఎస్ గుర్తు, ప్యాక్ చేసిన వస్తువులపై చూడాల్సిన వివరాలు, సరైన తూనికలు మరియు కొలతల వినియోగం మరియు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 14404 లేదా 1800-11-4000లో వినియోగదారుల ఫిర్యాదును ఎలా నమోదు చేయాలనే దానిపై వినియోగదారులకు అవగాహన కల్పించాయి.


గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా పెద్దారి గ్రామంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  రాజ్‌కోట్ శాఖ కార్యాలయం చేపట్టిన రూరల్ ఔట్రీచ్ కార్యక్రమం.

వినియోగదారుల హక్కులు మరియు శాఖ చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు MyGovలో క్విజ్ పోటీని ప్రారంభించారు. క్విజ్ పోటీలో పాల్గొనేందుకు 13 ఏప్రిల్, 2022 వరకు అవకాశం ఉంటుంది. పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి, పాల్గొనేవారికి సర్టిఫికేట్లు / బహుమతులు అందజేయబడతాయి.

 


 

పైన పేర్కొన్న కార్యకలాపాలతో పాటు, నేషనల్ టెస్ట్ హౌస్ (ఎన్‌టీహెచ్) దాని వివిధ శాఖలలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ వస్తువులు మరియు మెటీరియల్ టెస్టింగ్ సౌకర్యాల గురించి అవగాహన పెంచడానికి సందర్శనలు మరియు ఓపెన్ హౌస్ సెషన్‌లను నిర్వహించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ (ఐఐఎల్ఎం) రాంచీ భారతదేశంలో లీగల్ మెట్రాలజీ వ్యవస్థ మరియు దాని ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఒక సెమినార్‌ను నిర్వహించింది. రీజినల్ రిఫరెన్స్ స్టాండర్డ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎస్ఎల్), అహ్మదాబాద్ వినియోగదారుల రక్షణ చట్టం, భద్రత మరియు నాణ్యత కోసం బిఐఎస్ చిహ్నాలు మరియు సరైన పరిమాణాన్ని నిర్ధారించడానికి బరువులు మరియు కొలతల కోసం లీగల్ మెట్రాలజీ అవసరాలపై అవగాహన కల్పించడం కోసం వ్యాపారులు మరియు మార్కెట్ అసోసియేషన్‌లతో సమావేశాన్ని నిర్వహించింది.  ప్యాక్ చేసిన వస్తువులపై అవగాహన కూడా చేపట్టబడింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, వెస్ట్రన్ రీజినల్ ఆఫీస్ లాబొరేటరీ, ముంబై..40 మంది విద్యార్థులకు ల్యాబ్ సిబ్బంది యొక్క వర్క్ ప్రొఫైల్ మరియు వివిధ ల్యాబ్‌లలో టెస్టింగ్ గురించి పరిచయం చేయడానికి ఎక్స్‌పోజర్ విజిట్‌ని నిర్వహించింది.
 


తమిళనాడులోని చెంగల్పట్టం వద్ద వెంగల్వాసి గ్రామంలో ఎన్‌టీహెచ్(ఎస్‌ఆర్), చెన్నై ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన కార్యక్రమం


 

***



(Release ID: 1806636) Visitor Counter : 157