పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండోర్‌-గోండియా- హైద‌రాబాద్ మార్గంలో ఆర్ సిఎస్ ఉడాన్ కింద రోజువారి విమాన స‌ర్వీసులు ప్రారంభం


తొలిసారిగా విమాన మార్గంతో అనుసంధాన‌మైన గోండియా

ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గరాల‌కు విమాన అనుసంధాన‌తను బ‌లోపేతం చేసేందుకు చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ప‌థ‌కం రానుంది : శ్రీ సింధియా

Posted On: 13 MAR 2022 7:35PM by PIB Hyderabad

 

ఇండోర్ -గోండియా- హైద‌రాబాద్ మార్గంలో ఆర్ సిఎస్‌- ఉడాన్ ప‌థ‌కం కింద రోజు వారి విమానాల‌ను ఈరోజు ప్రారంభించారు.ఉడాన్ ఆర్‌సిఎస్‌-4.0 బిడ్డింగ్ ప్ర‌క్రియ‌లో ఫ్లైబిగ్‌కు దీనిని కేటాయించారు. దీనితో ఉడాన్ -ఆర్‌సిఎస్ ప‌థ‌కం కింద 409 మార్గాలు కార్య‌రూపంలోకి వస్తాయి.

ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా , మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ (వ‌ర్చువ‌ల్ గా) ,మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్ శ్రీమతి సుమిత్రా మ‌హాజ‌న్‌,ఇండోర్ పార్ల‌మెంట్ స‌భ్యుడు శ్రీ శంక‌ర్ లాల్‌వాని, ఎం.ఒ.సి.ఎ జాయింట్ సెక్ర‌ట‌రి శ్రీ‌మ‌తి ఉషా ప‌ధే,  మ‌రికొంద‌రు ముఖ్యులు  ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. గోండియా పార్ల‌మెంట్ స‌భ్యులు శ్రీ సునీల్ మెంధే, గ‌డ్చిరోలి పార్ల‌మెంట్ స‌భ్యులు శ్రీ అశోక్ నేటే, బాలాఘాట్  పార్ల‌మెంట్ స‌భ్యులు శ్రీ ధాల్ సింగ్ బైసెన్ త‌దిత‌రులు కూడా ఈ స‌మావేశానికి వ‌ర్చువ‌ల్‌ హాజ‌ర‌య్యారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ, ఉడాన్ ప‌థ‌కం ప్ర‌ధాన‌మంత్రి క‌ల‌ల ప్రాజెక్టు అయిన , సామాన్యుడికి విమాన‌యాన స‌ర్వీసులు క‌ల్పించాల‌న్న ఉడాన్ ప‌థ‌కాన్ని సాకారం చేయ‌డంలొ భాగ‌మే ఇది అని ఆయ‌న అన్నారు. ఉడాన్ కింద 405 మార్గాల‌లో ఇప్ప‌టికే విమాన‌యాన స‌ర్వీసులు న‌డుస్తున్నాయ‌న్నారు. ఇండోర్‌- గోండియా- హైద‌రాబాద్ రూట్ ఇండోర్‌ను మ‌హారాష్ట్ర , తెలంగాణాల‌తో క‌లుపుతుంద‌ని ఆయ‌న అన్నారు.
 గ‌త ఏడాది కాలంలో , ఎయిర్ క్రాఫ్ట్ కార్య‌క‌ల‌పాలు ఇండోర్‌నుంచి రెట్టింపు కాగా, భోపాల్ లో 40 శాతం పెరిగింది. ద్వితీయ‌, తృతీయ శ్రేణిన‌గ‌రాల‌ల‌లో 100 విమానాశ్ర‌యాల‌ను కట్ట‌నున్న‌ట్టు శ్రీ సింధియా తెలిపారు. ఇది చివ‌రి గ‌మ్య‌స్థానం వ‌ర‌కు అనుసంధాన‌త క‌ల్పించేందుకు వీలు క‌ల్పిస్తుంది.  కేంద్ర ప్ర‌భుత్వం చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ల ప‌థకాన్ని తీసుకురానున్న‌ద‌ని, ఇది ద్వితీయ , తృతీయ శ్రేణి న‌గ‌రాల‌ అనుసంధాన‌త‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని అన్నారు.
ఈ ఎయిర్ లైన్ ప్ర‌తి రోజూ ఓక విమానాన్ని న‌డుపుతుంద‌ని, ఎటిఆర్ 72 ను ఇందుకు ఉప‌యోగిస్తుంద‌ని అన్నారు. 78 సీట్లు క‌లిగిన ట‌ర్బో ప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్‌ను తక్కువ దూర ప్ర‌యాణాల‌కు అనుగుణంగా రూప‌క‌ల్ప‌న చేశారు. దీనితో గోండియా ఉడాన్ గ‌మ్య‌స్థానాల‌లో 14వ దిగా చేరింది. షెడ్యూల్డ్ వాణిజ్య విమానంతో గోండియాను ఇత‌ర మెట్రోల‌తో అనుసంధానం చేసిన తొలి ఎయిర్ లైన్‌గా ఫ్లై బిగ్ నిలుస్తుంది. గోండియా ఇంత‌కుముందు దేశంలోని ఏ విమానాశ్ర‌యంతోనూ అనుసంధానం కాలేదు. ఇలా అనుసంధానం కావ‌డం ఇదే మొద‌టిసారి.
గొండియాలోని బిర్సి విమానాశ్ర‌యాన్ని డొమెస్టిక్ విమానాశ్ర‌యంగా నెల‌కొల్పారు. దీనిని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వ‌హిస్తోంది. ఇది మ‌హారాష్ట్ర‌లోని గొండియాకు ఈశాన్యంగా 12 కిలోమీట‌ర్ల దూరంలోని బిర్సి గ్రామంవ‌ద్ద ఉంది. పౌర విమాన‌యాన మంత్రిత్వ‌శౄఖ దీని ర‌న్ వే రీ కార్పెటింగ్ కు, ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ ఫైర్ టెండ‌ర్ల‌కు ,విమానాశ్ర‌యాన్ని ప‌నిచేయించేందుకు అవ‌స‌రమైన ఇతర స‌దుపాయాల కోసం 21 కోట్ల రూపాయ‌ల‌ను దీనిపై ఖ‌ర్చు చేసింది.
ఈ కొత్త విమాన మార్గంతో గోండియా ప్ర‌జ‌లు , దాని ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌లు నేరుగా ఇండోర్‌, గోండియా, హైద‌రాబాద్‌ల మ‌ధ్య విమాన ప్ర‌యాణ అనుసంధాన‌త‌ను పొందుతారు. ఇది ఇండోర్‌, గోండియా, హైద‌రాబాద్ ల‌మ‌ధ్య ప్ర‌యాణికుల నిరంత‌రాయ రాక‌పోక‌ల‌కు ఉడాన్ కింద వీలుక‌ల్పిస్తుంది. ఉడాన్ కింద ఈ నూత‌న విమానాల‌తో సామాన్య ప్ర‌జ‌లు ఈ ప్రాంతాల మ‌ధ్య ప్ర‌యాణానికి ప‌లు ప్ర‌త్యామ్నాయాల‌ను క‌లిగి ఉంటారు. ఇది ఈ ప్రాంతంలో ప‌ర్యాట‌కం, ఆర్థిక కార్య‌క‌లాపాలు మరింత ముందుకు పోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది.
విమాన షెడ్యూలు కింది విధంగా ఉంది.

:

క్ర‌మ
సంఖ్య‌

బ‌య‌లుదేరే స‌మ‌యం

చేరే స‌మ‌యం

క్ర‌మ
సంఖ్య‌

ఫ్రీక్వెన్సి

బ‌య‌లుదేరే
స‌మ‌యం

గ‌మ్య‌స్థానం
చేరే స‌మ‌యం

ఎయిర్‌క్రాఫ్ట్‌

1

హైద‌రాబాద్‌

గోండియా

ఫ్లై బిగ్‌

రోజూ

0620

0815

ATR 72

2

గోండియా

  ఇండోర్‌  ఫ్లై బిగ్‌

రోజూ

0835

1000

ATR 72

3

ఇండోర్‌

 గోండియా

 ఫ్లై బిగ్‌

రోజూ

1020

1145

ATR 72

4

గోండియా

హైద‌రాబాద్‌

 ఫ్లై బిగ్‌

రోజూ

1205

1350

ATR 72

 

***


(Release ID: 1806572) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Hindi , Tamil