వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కృషి విజ్ఞాన కేంద్రాలు
Posted On:
15 MAR 2022 4:22PM by PIB Hyderabad
38 కృషి విజ్ఞాన కేంద్రాలు రాష్ట్రప్రభుత్వాల ఆధీనంలో ఉండగా, 66 కేంద్రాలు ఐసిఎఆర్ ఇన్ స్టిట్యూట్ లకింద, 103 ఎన్‌జిఒలకింద, 506 వ్యవసాయ విశ్వవిద్యాలయాల కింద, 3 కేంద్ర విశ్వవిద్యాలయాల కింద, 3 ప్రభుత్వ రంగ సంస్థలకింద, 7 డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాల కింద, 5 ఇతర విద్యా సంస్థల కింద ఉన్నాయి.
ఐసిఎఆర్ నిర్వహించిన పరిశోధన ద్వారా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కెవికెలు రైతు క్షేత్రాలకు తీసుకువెళ్లి వాటిని అంచనా వేయడం జరుగుతుంది. వివిధ వ్యవసాయ పద్ధతులలో ఆయా ప్రాంతాలకు సంబంధించి వాటి పనితీరును పరిశీలించడం జరుగుతుంది. రైతు క్షేత్రాలలో కెవికె లు వివిధ సాంకేతిక పరిజ్క్షానాలకు సంబంధించి రైతులు వాటిని తమ తమ పొలాలలో వాడే విధంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రైతు క్షేత్రాలలో కెవికెలు ఇప్పటివరకు 1.12 లక్షల మేరకు సాంకేతిక పరిజ్క్షాన ప్రయోగాలను నిర్వహించాయి. ఆయా పంటలు, పశుగణాభివృద్ధి, పంట యంత్రాలు, ఇతర ఎంటర్ ప్రైజ్‌లకు సంబంధించి గత మూడు సంవత్సరాలలో 7.35 లక్షల ప్రదర్శనలను నిర్వహించడం జరిగింది.
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం వారీగా కెవికెలు
-----------------------------------------------------------
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం మొత్తం
--------------------------------------------------------
అండమాన్ నికోబార్ దీవులు 3
ఆంధ్రప్రదేశ్ 24
అరుణాచల్ ప్రదేశ్ 17
అస్సాం 26
బీహార్ 44
ఛత్తీస్‌ఘడ్ 28
ఢిల్లీ 01
గోవా 02
గుజరాత్ 30
హర్యానా 18
హిమాచల్ ప్రదేశ్ 13
జమ్ముకాశ్మీర్ 20
జార్ఖండ్ 24
కర్ణాటక 33
కేరళ 14
లద్దాక్ 04
లక్షద్వీప్ 01
మధ్యప్రదేశ్ 54
మహారాష్ట్ర 50
మణిపూర్ 09
మేఘాలయ 07
మిజోరం 08
నాగాలాండ్ 11
ఒడిషా 33
పుదుచ్చేరి 03
పంజాబ్ 22
రాజస్థాన్ 47
సిక్కిం 04
తమిళనాడు 32
తెలంగాణ 16
త్రిపుర 08
ఉత్తరప్రదేశ్ 89
ఉత్తరాఖండ్ 13
పశ్చిమబెంగాల్ 23
-------------------------------------------------------------------
మొత్తం 731
----------------------------------------------------------------
ఈ సమాచారాన్ని కేంద్ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1806567)
Visitor Counter : 194