కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
స్థూల జాతీయోత్పత్తి వృద్ధి-ఉపాధి కల్పన
Posted On:
14 MAR 2022 3:59PM by PIB Hyderabad
COVID-19 మహమ్మారి సమయంలో పట్టణ రంగానికి సంబంధించిన త్రైమాసిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే (PLFS) నివేదిక ప్రకారం (మార్చి 2021 వరకు అందుబాటులో ఉంటుంది) గణాంకాలు-ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం పట్టణ రంగంలో నిరుద్యోగం రేటు 20.8%కి పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి కూడా 2020-21 మొదటి త్రైమాసికంలో - 23.8%కి (స్థిరమైన ధరల వద్ద) క్షీణతకు లోనయ్యింది. 2020-21 తరువాతి త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో, నిరుద్యోగం రేటు 9.3% కి మెరుగుదలని చూపించింది, 2020-21 చివరి త్రైమాసికంలో GDP 1.6%కి (స్థిరమైన ధరల వద్ద) కోలుకుంది.
ఇంకా త్రైమాసిక PLFS నివేదిక ప్రకారం, 2020-21 మొదటి త్రైమాసికంలో 36.4% కి పడిపోయిన కార్మిక జనాభా నిష్పత్తి (WPR) కూడా 2020-21 చివరి త్రైమాసికంలో 43.1%కి కోలుకుంది.
ఉపాధి కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత అంశం. దీని ప్రకారం, దేశంలో ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వ్యాపారానికి ఉద్దీపన అందించడానికి, కోవిడ్ 19 ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రభుత్వం రూ. ఇరవై ఏడు లక్షల కోట్లు కంటే ఎక్కువ ఆర్థిక ఉద్దీపనలు అందిస్తోంది. ఈ ప్యాకేజీ దేశాన్ని స్వావలంబన గా మార్చడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి వివిధ దీర్ఘకాలిక పథకాలు/ కార్యక్రమాలు/ విధానాలను కలిగి ఉంటుంది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో సామాజిక భద్రతా ప్రయోజనాలు, ఉపాధి నష్టాన్ని పునరుద్ధరించడం తో పాటు కొత్త ఉపాధి కల్పన కోసం యజమానులను ప్రోత్సహించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0లో భాగంగా 1 అక్టోబర్, 2020 నుండి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ABRY) ప్రారంభమయ్యింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా అమలు అయిన ఈ పథకం యజమానుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, మరింత మంది కార్మికులను నియమించుకునే వారిని ప్రోత్సహిస్తుంది. లబ్ధిదారుల నమోదు కోసం చివరి తేదీని 30.06.2021 నుంచి 31.03.2022 వరకు పొడిగించారు. 28.02.2022 వరకు 1.33 లక్షల సంస్థల ద్వారా 50.81 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించారు.
స్వయం ఉపాధిని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY)ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, పూచీకత్తు రహిత రుణాలు రూ. 10 లక్షలు చొప్పున, సూక్ష్మ/చిన్న వ్యాపార సంస్థలకు వ్యక్తులు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు లేదా విస్తరించేందుకు వీలుగా 04.03.2022 వరకు వారికి అందిస్తారు. పథకం కింద 33.91 కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి.
మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్- 6 రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన 116 జిల్లాల్లో, తిరిగి వచ్చిన వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతతో సహా ఈ విధంగా బాధిత వ్యక్తులకు ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పెంచడానికి ప్రభుత్వం 125 రోజుల గరీబ్ కళ్యాణ్ రోజ్‌గర్ అభియాన్ (GKRA)ని 2020 జూన్ 20న ప్రారంభించింది. అభియాన్ మొత్తం వ్యయం 39,293 కోట్ల లో రూ. 50.78 కోట్లతో ఉపాధి కల్పనను సాధించింది.
ప్రధానమంత్రి గతిశక్తి అనేది ఆర్థిక వృద్ధికి, స్థిరమైన పరివర్తనాత్మక విధానం. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, మాస్ ట్రాన్స్‌పోర్ట్, వాటర్‌వేస్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఏడు వాహకాల ద్వారా ఈ విధానం నడుస్తుంది. ఈ విధానం క్లీన్ ఎనర్జీ సబ్‌కా ప్రయాస్ ద్వారా అందిస్తున్నారు, ఇది అందరికీ భారీ ఉద్యోగ, వ్యవస్థాపక అవకాశాలను అందిస్తుంది.
రైల్వే, రోడ్డు, పట్టణ రవాణా, విద్యుత్, టెలికాం, టెక్స్ టైల్స్, గృహాలపై జాతీయ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ 2021-22 ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాలను2021-22 నుంచి 5 సంవత్సరాల కాలానికి ప్రారంభించింది. దీని వ్యయం రూ. 1.97 లక్షల కోట్లు. ఈ కార్యక్రమాలన్నీ సమిష్టిగా ఉపాధిని కల్పిస్తాయని గుణాత్మక ప్రభావం ద్వారా దీర్ఘకాలిక ఉత్పత్తి పెంచుతాయని భావిస్తున్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGS) వంటి పథకాలపై గణనీయమైన పెట్టుబడి ప్రభుత్వ వ్యయాలతో కూడిన వివిధ ప్రాజెక్టులను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY), గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యక్రమమైన దీన్ దయాల్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY-NULM) మొదలైనవి ఉన్నాయి.
ఈ కార్యక్రమాలతో పాటు, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, పునరుజ్జీవనం, పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్, అందరికీ గృహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు వంటి వివిధ ప్రధాన కార్యక్రమాలు కూడా ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా అమలులో ఉన్నాయి.
ఈ రోజు లోక్‌సభలో కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1806082)
Visitor Counter : 281