వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తదుపరి టెక్స్‌టైల్ రంగపు దిగ్గజ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి రావాలని శ్రీ పీయూష్ గోయల్ ఆకాంక్ష



ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ- దేశంలోని అత్యుత్తమ ఫైబర్స్, టెక్స్‌టైల్ సాంకేతిక విభాగం – ఆపై విశిష్ట పూర్వ విద్యార్థులను కలిగి ఉంది: శ్రీ గోయల్


"భారతదేశం ఆత్మనిర్భర్ పునరుజ్జీవనోద్యమంలో దూసుకుపోతోంది"


"మేము ఆవిష్కరణలో గొప్ప పురోగతిని సాధిస్తున్నాము, దేశాన్ని కొత్త యుగంలోకి అభివృద్ధి చేయడానికి పరిశోధన- అభివృద్ధి ముఖ్యమైన అంశంగా గుర్తించింది": శ్రీ గోయల్


పెరుగుతున్న మార్పుతో ఎవరూ సంతృప్తి చెందలేరు, మనమందరం మన ప్రపంచంలో మనం జీవించే విధానంలో అనూహ్య మార్పులను చూస్తున్నాము: శ్రీ గోయల్

Posted On: 13 MAR 2022 8:33PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ,  టెక్స్‌టైల్స్ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు మాట్లాడుతూ, తదుపరి వస్త్ర వ్యాపార  రంగ దిగ్గజ సంస్థ  ICT సంస్థ నుంచి రావాలని అన్నారు. ఆత్మనిర్భర్ పునరుజ్జీవనంపై ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇ-సమ్మిట్ 2022లో ప్రసంగిస్తూ, టెక్స్-ప్రెన్యూర్‌షిప్, టెక్స్‌టైల్స్ రంగం  వ్యవస్థాపన లో నాయకత్వం వహించాలని ఆయన ICT విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ICT దేశంలోనే అత్యుత్తమ ఫైబర్స్,  టెక్స్‌టైల్ టెక్నాలజీ విభాగాల్లో ఒకటని శ్రీ గోయల్ అన్నారు. ICTలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముఖేష్ అంబానీ, కాడిలా ఫార్మాస్యూటికల్స్‌ కు చెందిన ఇంద్రవదన్ మోడీ, ఏషియన్ పెయింట్స్‌ నీలేష్ గుప్తా, లుపిన్ లిమిటెడ్‌కు చెందిన అశ్విన్ డానీ వంటి ప్రముఖ పూర్వ విద్యార్థులు ఉన్నారు.

“భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా చేయడంలో, ముఖ్యంగా కెమికల్స్, ఫార్మా రంగాలలో వారు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఒక సంస్థ మొత్తం రంగాన్ని ఎలా తీర్చిదిద్దుతుందనేది నమ్మశక్యం కాని అంశం. వాస్తవానికి, ఒక కోణంలో, అత్యంత ప్రసిద్ధ ఐవీ లీగ్ కళాశాలలు సాంకేతిక ప్రపంచానికి, దేశాలలోని నిర్వహణ ప్రపంచానికి ఎలాగో ICT అనేది భారత  రసాయనాల పరిశ్రమకు అటువంటిది. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ ప్రతి విద్యార్థిపై ఉందని నేను నమ్ముతున్నాను! అని శ్రీ గోయల్ వీడియో సమావేశం  ద్వారా ప్రసంగించారు.

జాన్ ఎఫ్ కెన్నెడీని ఉటంకిస్తూ, "ఒక్క వ్యక్తి మార్పు తేగలుగుతాడు, ఆ  ఒక్క వ్యక్తిగా మారడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి", అని శ్రీ గోయల్ మాట్లాడుతూ అన్నారు. వ్యవస్థాపకులు జాతి నిర్మాతలు, ఇంకా  మార్పు కారకులు  అని ఉత్తమంగా నిర్వచించారు.

టెక్నికల్ టెక్స్‌టైల్స్‌ లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడానికి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహకాలతో పాటు, 7 మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు, నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ (NTTM)ని ప్రారంభించడం వంటి టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పరివర్తనాత్మక కార్యక్రమాలను చేపట్టిందని శ్రీ గోయల్ చెప్పారు. 31 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతి లభించింది.

భారతదేశం ఆత్మనిర్భర్ పునరుజ్జీవనోద్యమంలో పయనిస్తోందని శ్రీ గోయల్ అన్నారు.

“మనం ఆవిష్కరణలో గొప్ప పురోగతిని సాధిస్తున్నాము, పరిశోధన, అభివృద్ధి అనేవి  చివరకు దేశాన్ని కొత్త యుగంలోకి అభివృద్ధి చేయడానికి ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించారు . పెరుగుతున్న మార్పు, ఇంక్రిమెంటల్ పెరుగుదల తో ఈ రోజు ఎవరూ సంతృప్తి చెందలేదని నేను భావిస్తున్నాను; మనమందరం మన ప్రపంచంలో జీవించే విధానంలో అనూహ్య మార్పును చూస్తున్నాము, ”అని వారు అన్నారు.

ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్-UPI ప్రారంభించిన 5 సంవత్సరాలలో భారతదేశం డిజిటల్ లావాదేవీలలో గ్లోబల్ లీడర్‌గా మారిందని శ్రీ గోయల్ అన్నారు. మనం  నేడు 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల  వ్యవస్థను కలిగి ఉన్నాము, ఐదేళ్లలో 65,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు నమోదు అయ్యాయి, ఈ స్టార్టప్‌ సంస్థల ద్వారా 90 దిగ్గజ సంస్థలలో  లక్షల ఉద్యోగాలు సృష్టి జరిగింది.

ప్రస్తుత దశాబ్దం భారతదేశం  ‘టెక్-ఏడ్’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారని, ఈ దశాబ్దంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ మన ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మలుస్తాయని శ్రీ గోయల్ అన్నారు.

“స్టార్టప్‌ల యువత శక్తిపై ప్రధాని మోదీ స్వయంగా చాలా నమ్మకంగా ఉన్నారు. ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి, మన కొత్త తరానికి  అవకాశాలను అందించడానికి, ప్రక్రియలను సులభతరం చేయడానికి, వారి ప్రయాణంలో వారిని నిలబెట్టడానికి, అవసరమైన చోట నిధుల మద్దతును అందించడానికి లేదా స్టార్టప్‌ల చుట్టూ ఉన్న నియంత్రణ అవసరాలను సరళీకృతం చేయడానికి, ఇంక్యుబేషన్ సెంటర్‌లను రూపొందించడానికి వ్యవస్థపై దృష్టి సారించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అటువంటి ప్రయోగాలలో ఒకటి, ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది, పరిశ్రమ-పరిశోధనల  భాగస్వామ్యం రేపటి భారతదేశాన్ని నిర్వచించబోతోందని నేను నమ్ముతున్నాను, ”అని ఆయన అన్నారు.

శ్రీ గోయల్ మాట్లాడుతూ, దేశం 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని జరుపుకుంటున్న వేళ, భారతదేశం,  అమృత్ కాల్  గమ్యం యువత చేతుల్లో ఉంది.

“ఆత్మనిర్భర్ పునరుజ్జీవనోద్యమానికి సంబంధించిన ముసాయిదాను మీరే వ్రాస్తారు, మీ వ్యవస్థాపక ప్రయాణంలో ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేక్ ఇన్ ఇండియా’ స్వయం సమృద్ధిగల ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తుంది” అని ఆయన అన్నారు.

ICT  సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించిన భారతరత్న ఎం విశ్వేశరయ్యను ఉటంకిస్తూ, “గుర్తుంచుకోండి, మీ పని కేవలం రైల్వే క్రాసింగ్‌ను ఊడ్చడం మాత్రమే కావచ్చు, కానీ దానిని శుభ్రంగా ఉంచడం మీ కర్తవ్యం, ప్రపంచంలోని మరే క్రాసింగ్ కూడా మీదాని అంత శుభ్రంగా ఉండదు.”అని గుర్తు చేశారు, శ్రీ గోయల్ మాట్లాడుతూ, వ్యాపారాలు తమ ఉత్పత్తి చక్రాలను మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న పరిష్కారాలను ఆవిష్కరించడానికి వ్యాపార ప్రక్రియ రీ-ఇంజనీరింగ్‌పై నిరంతరం దృష్టి కేంద్రీకరిస్తాయి.

“ఈ రోజు, భారతదేశం నమ్మకంగా ఉంది అయినప్పటికీ  అసంతృప్తిగా ఉంది! అసంతృప్తి చెందడం మంచి విషయం, ఎందుకంటే సంతృప్తి చెందిన వ్యక్తి ఎప్పటికీ పరివర్తన తీసుకురాలేడు, మార్పును తీసుకురాలేడు. మనకు ఆకలి కావాలి, ఏదో ఒకటి చేయగలిగేలా, అసాధారణమైన విజయాన్ని సాధించగలగడానికి కడుపులో ఆకాంక్ష రగలాలి” అని మంత్రి చెప్పారు .

 

***


(Release ID: 1805675) Visitor Counter : 193


Read this release in: English , Urdu , Marathi , Hindi