గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘జెండర్ సంవాద్’ను నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


3000 కంటే ఎక్కువ రాష్ట్ర సిబ్బంది, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆహారం, పోషకాహార భద్రత గురించి చర్చించడానికి సమావేశం అయిన మహిళా సమిష్టి బృందాలు , దీన్ దయాల్ అంత్యోదయ యోజన - జాతీయ జీవనోపాధి మిషన్ ద్వారా అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహణ

Posted On: 13 MAR 2022 6:05PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) మార్చి 11, 2022న నిర్వహించిన 'జెండర్ సంవాద్' మూడవ ఎడిషన్‌కు హాజరయ్యేందుకు 34 రాష్ట్రాల నుండి 3000 మంది రాష్ట్ర మిషన్ సిబ్బంది స్వయం సహాయక బృందం (SHG) సభ్యులు లాగిన్ అయ్యారు. ఇది దీనదయాళ్ అంత్యోదయ యోజన కింద జాతీయస్థాయిలో చేసిన వాస్తవకాల  (వర్చువల్) ప్రయత్నం , లింగ బేధాలకు అతీతంగా, దేశవ్యాప్తంగా మిషన్ కార్యక్రమాలపై మరింత అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఎడిషన్  ఇతివృత్తం  'మహిళల సమిష్టి బృందాల  ద్వారా ఆహారం, పోషకాహార భద్రతను ప్రోత్సహించడం'. ‘అమృత్ మహోత్సవ్’ కింద మంత్రిత్వ శాఖ ప్రత్యేక వారోత్సవ ఇతివృత్తం  ‘నయే భారత్ కి నారీ’లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమం జాతీయ  రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌లు (SRLM) స్వయం సహాయక బృందాల  మహిళల నుండి సమస్యలు, అనుభవాలు  వినడానికి, ఉత్తమ అభ్యాసాలు పంచుకోవడానికి, నేర్చుకోవడానికి వీలు కల్పించింది. ఆన్‌లైన్ సమావేశాన్ని ఉద్దేశించి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ  కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా, ప్రవర్తన మార్పు, సేవలప్రాప్యతకు మద్దతు ఇవ్వడానికి మహిళా సమిష్టి సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. "దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక బృంద  మహిళలు 5.5 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు COVID-19 పై అవగాహన పెంచడం లో ముఖ్యమైన పాత్ర పోషించారు" అని ఆయన చెప్పారు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త  కార్యదర్శి శ్రీమతి నీతా కేజ్రీవాల్ ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం, శుభ్రత  (FNHW) లపై మంత్రిత్వ శాఖ  దృక్పథం ప్రయత్నాలను పంచుకున్నారు. "DAY-NRLM కింద సహాయక బృందాలు  పోషకాహార లోపంతో పోరాడేందుకు గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, పోషకాలు అధికంగా ఉండే ఆహార పంటల వైవిధ్యం, మహిళా  సభ్యులలో సామాజిక, ప్రవర్తన, మార్పు కమ్యూనికేషన్ (ఎస్‌బిసిసి) వంటి అనేక కార్యక్రమాలపై పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు.

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్, జీవిత చక్రంలో నిర్దిష్ట లక్ష్య సమూహాలతో స్వయం సహాయ బృందాలు పని చేసే మార్గాలను ప్రస్తావిస్తూ, “ఎస్‌హెచ్‌జి మహిళల ప్రవర్తనలో అనుకూల మార్పును ప్రోత్సహించవచ్చు, తక్కువ బరువుతో జన్మించిన శిశువుల సంరక్షణ పై మహిళలకు సలహాలు ఇవ్వవచ్చు, బాలికల విద్యను ప్రోత్సహించవచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం, సూక్ష్మపోషకాల వినియోగం, సరైన వయసులో వివాహం, అలాగే గర్భాల మధ్య అంతరం, పోషకాహార లోపం, శిశువులు, చిన్నపిల్లల ఆహారం, సంరక్షణ పద్ధతులను కూడా  సమర్థవంతంగా వివరించారు.

స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంక సలహాదారు శ్రీ ధృజేష్ తివారీ మహిళలు, పిల్లల పోషణ కోసం మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడారు. శ్రీమతి జాతీయ మహిళా కమిషన్ సభ్య కార్యదర్శి మీటా రాజీవ్‌లోచన్ మహిళల పోషకాహార సమస్యలపై దృష్టి సారించారు. ఈ విషయంలో వారి హక్కులు  అర్హతలను గుర్తు చేశారు. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ కు చెందిన డాక్టర్ కళ్యాణి రఘునాథన్, IFPRI మహిళా సమిష్టి ద్వారా సంబంధిత ఆహారం, పోషకాహార ప్రభావంపై నిర్వహించిన అధ్యయనాల ఫలితాలను సమర్పించింది.

బీహార్, మహారాష్ట్ర , ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన జాతీయ జీవనోపాధిసంస్థ  SRLMకు చెందిన రాష్ట్ర మిషన్ డైరెక్టర్లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద స్వయం సహాయ సంఘాలు  చేపట్టిన సాధారణ కార్యక్రమం  ‘ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత’ లను ఎలా సమగ్రపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారనే దానిపై ప్రదర్శనలు చేశారు. బీహార్ SRLM ముఖ్య కార్య నిర్వహణాధికారి సామాజిక, ప్రవర్తన మార్పు ఆశించి జరిపే సంభాషణ  విధానాలు, ఇంటి వద్ద లభించే ఆహార సమూహాలను అనుబంధించడానికి, వైవిధ్య పరచడానికి పోషకాహార-సున్నితమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం గురించి పంచుకున్నారు. CEO, మహారాష్ట్ర SRLM న్యూట్రి-ఆధారిత సంస్థలు, న్యూట్రి-గార్డెన్స్‌ పై ప్రచారాల ద్వారా పోషకాహార భద్రతను ప్రోత్సహించడంపై తమ పనిని సమర్పించారు, అయితే CEO, ఛత్తీస్‌గఢ్ SRLM సమూహ సమావేశాలలో వారి అభ్యాసాలు, చర్చల అనుభవాన్ని పంచుకున్నారు. ప్రసూతి పోషణ ప్రయోజనాల కోసం మహిళలతో పాటు పురుష సభ్యులను భాగస్వామ్యం చేసారు.

*****



(Release ID: 1805672) Visitor Counter : 228