వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడానికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) చర్చలను తిరిగి ప్రారంభించేందుకు భారతదేశం – కెనడా సిద్ధం


భారతదేశం - కెనడా మధ్యంతర ఒప్పందం లేదా ప్రారంభ ప్రగతి వాణిజ్య ఒప్పందాన్ని (EPTA) వస్తువులు, సేవలలో వాణిజ్యాన్ని పెంపుదలకు పరిగణన

భారతదేశం - కెనడా అనేక రంగాలలో ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతం చేసే మార్గాలపై చర్చ

Posted On: 11 MAR 2022 5:22PM by PIB Hyderabad

భారతదేశం, కెనడా మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై ఐదవ మంత్రివర్గ చర్చలు (MDTI) ఈరోజు ఇక్కడ జరిగాయి. వాణిజ్యం, పరిశ్రమలు,  వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, , ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, చిన్న వ్యాపారం,  ఎగుమతి ప్రమోషన్, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి శ్రీమతి మేరీ ఎన్‌జి,  కెనడా ప్రభుత్వం MDTIకి సహ-అధ్యక్షులుగా ఉన్నారు.
భారతదేశం-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కోసం చర్చలను అధికారికంగా పునఃప్రారంభించేందుకు మంత్రులు అంగీకరించారు, ఇరు దేశాలకు ముందస్తు వాణిజ్య లాభాలను తెచ్చే మధ్యంతర ఒప్పందం లేదా ప్రారంభ ప్రగతి వాణిజ్య ఒప్పందాన్ని (EPTA) కూడా పరిశీలించారు. మంత్రులు భారతదేశం, కెనడా మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య పరిపూరకాలను గుర్తించారు, అనేక  రంగాలలో సంభావ్యతను వెలికి తీయడం ద్వారా వస్తువులు, సేవలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడంతో వాణిజ్య ఒప్పందం సహాయపడుతుందని ఉద్ఘాటించారు. మధ్యంతర ఒప్పందంలో వస్తువులు,  సేవలు,  మూలం  నియమాలు,  శానిటరీ, ఫైటో సానిటరీ చర్యలు,  వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, వివాద పరిష్కారాలలో ఉన్నత స్థాయి కట్టుబాట్లు ఉంటాయి, పరస్పరం అంగీకరించిన ఇతర ప్రాంతాలను కూడా పరిశీలన చేయవచ్చు.
 
ఈ సమావేశంలో ఇతర ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి అంశాలపై చర్చించారు. పప్పు దినుసుల లో సస్యరక్షణ , మొక్కజొన్న రకాలైన స్వీట్ కార్న్,  బేబీ కార్న్, ఇంకా  అరటి వంటి భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌కు సంబంధించి కెనడా   విధానాన్ని గుర్తించడానికి సంబంధించిన పనులు చేపట్టేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. కెనడా కూడా భారతీయ సేంద్రియ ఎగుమతి ఉత్పత్తులను సులభతరం చేయడానికి APEDA (వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ)కి ధృవీకరణ సంస్థ (CVB) స్థితి అనుగుణ్యత కోసం అభ్యర్థనను త్వరితగతిన పరిశీలించడానికి అంగీకరించింది.
క్లిష్టమైన రంగాలలో స్థితిస్థాపక సరఫరా గొలుసులను ఏర్పాటు చేయడం  ప్రాముఖ్యతను మంత్రులు గుర్తించారు, ఈ ప్రాంతంలో సహకారంపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. ఫార్మాస్యూటికల్స్, క్రిటికల్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్‌ తో పాటు టూరిజం,  పట్టాన మౌలిక వసతులు ,  పునరుత్పాదక ఇంధన, గనుల వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని వారు నొక్కి చెప్పారు. ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులు,  విద్యార్థులు, వ్యాపార ప్రయాణీకుల కదలికతో సహా రెండు దేశాల మధ్య బలమైన వ్యక్తుల మధ్య సంబంధాల పాత్రను కూడా వారు గుర్తించారు.
భారతదేశం, కెనడా ల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాల  పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి అనుసంధానాలను నిర్మించడానికి, రంగాల అంతటా సహకారాన్ని బలోపేతం చేయడానికి స్థిరమైన వేగాన్ని అందించడానికి దగ్గరగా పని చేయడానికి మంత్రులు అంగీకరించారు.

 


*****



(Release ID: 1805256) Visitor Counter : 249