వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా రైతులు పూసా కృషి మేళా తో ప్రయోజనం పొందుతున్నారు


మేళా లో పాల్గొన్న సుమారు 12000 మంది రైతులు: రెండవ రోజున 1100 క్వింటాల్స్ కు పైగా పూసా విత్తనాల కొనుగోలు

నాలుగు సాంకేతిక సదస్సులలో స్మార్ట్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, అధిక ఉత్పాదకత , వ్యవసాయ ఎగుమతుల గురించి రైతులకు సమాచారం

Posted On: 10 MAR 2022 6:26PM by PIB Hyderabad

భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నిర్వహించిన కృషి విజ్ఞాన మేళా రెండో రోజు దేశం నలుమూలల నుంచి వేలాది మంది రైతులు హాజరై మేళా ను సద్వినియోగం చేసుకున్నారు. "సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన కలిగిన రైతు" అనే ప్రధాన ఇతివత్తంతో ఈ మేళా ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 12000 మంది రైతులు మేళా కు హాజరై 1100 క్వింటాల్స్ పైగా పూసా విత్తనాలను కొనుగోలు చేశారు. మేళా రెండవ రోజున నాలుగు సాంకేతిక సదస్సులు జరిగాయి. నాలుగు సాంకేతిక సమావేశాల్లో, స్మార్ట్ వ్యవసాయం ;ప్రకృతి వ్యవసాయం; అధిక ఉత్పాదకత కోసం హైడ్రోపోనిక్ ,ఏరోపోనిక్ అగ్రికల్చర్; సౌభాగ్యం కోసం వ్యవసాయ ఎగుమతులు గురించి రైతులకు సమాచారం అందించారు.

 

బాస్మతి బియ్యం మూడు రకాల విత్తనాలు; పూసా బాస్మతి 1847, పూస బాస్మతి 1885, పూస బాస్మతి 1886 లను రైతులు ఉత్పత్తి చేయడానికి వీలుగా  వాటిని కూడా  కూడా మేళా లో  రైతులకు పంపిణీ చేస్తున్నారు. కొత్త పంట రకాల ప్రత్యక్ష ప్రదర్శన, కూరగాయలు, పువ్వుల సురక్షిత సాగు ప్రదర్శన,  సంస్థలు ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యవసాయ పరికరాల ప్రదర్శన -అమ్మకం పట్ల రైతులు ఆసక్తి చూపించారు. అమ్మకానికి పెట్టిన  మెరుగైన రకాల విత్తనాలు , మొక్కలు పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.  దీనితో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రసాయనాల ప్రదర్శన అమ్మకం, సృజనాత్మక రైతులు అభివృద్ధి చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు కూడా సందర్శకులను ఆకట్టుకున్నాయి.

 

 

100కు పైగా ఐసిఎఆర్ ఇనిస్టిట్యూట్ లు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు , ఇతర సంస్థలు 225 స్టాల్స్ ద్వారా అధునాతన టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నాయి. మొదటి రోజున  దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12000-15000 మంది రైతులు మేళాలో పాల్గొని న్యూఢిల్లీలోని వివిధ విభాగాలు అభివృద్ధి చేసిన రకాలు, సాంకేతికతల గురించి తెలుసుకున్నారు, అలాగే ప్రత్యక్ష ప్రదర్శన, విభిన్న వ్యవసాయ నమూనాలు , రైతు సలహా సేవలను పొందారు.

 

ఈ మేళా ప్రధాన ఆకర్షణలు: స్మార్ట్/డిజిటల్ అగ్రికల్చర్, అగ్రి స్టార్టప్స్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ పివో), ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్, ప్రొటెక్టెడ్ ఫార్మింగ్/హైడ్రోపోనిక్/ఏరోపోనిక్/వర్టికల్ ఫార్మింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించే సలహాలు. ఈ మేళా లో సంస్థ అభివృద్ధి చేసిన కొత్త రకాల తో పాటు  సోలార్ పవర్డ్ 'పూసా-ఫార్మ్ సన్ ఫ్రిజ్' పూసా డీకంపోజర్, పూసా కంప్లీట్ బయో ఫెర్టిలైజర్ (నైట్రోజన్, ఫాస్ఫరస్,  పొటాషియం అందించే ప్రత్యేక లిక్విడ్ ఫార్ములేషన్) వంటి ఐఎఆర్ఐ కి చెందిన ఇతర సృజనాత్మక సాంకేతికతల ను కూడా ప్రదర్శిస్తున్నారు.

 

మేళా lరెండవ రోజున, మొదటి సెషన్ "డిజిటల్ స్మార్ట్ అగ్రికల్చర్" పై జరిగింది, దీనికి డాక్టర్ ఎస్.కె. చౌదరి.డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (నేచురల్ రిసోర్స్ మేనేజ్ మెంట్) ఐసిఎఆర్ అధ్యక్షత వహించారు. ఈ సెషన్ లో, శ్రీ ఆశిష్ జంగాలే, (ప్రెసిషన్ ఫార్మింగ్ ఛైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్) "ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్" పై ప్రసంగించారు. శ్రీ అభిషేక్ బర్మన్ (సిఇఒ, జనరల్ ఏరోనాటిక్స్ ప్రయివేట్ లిమిటెడ్) "మెరుగైన పంట ఆరోగ్యం కోసం డ్రోన్ టెక్నాలజీ"పై మాట్లాడారు శ్రీమతి రాశి వర్మ (అగ్స్మార్టిక్ ప్రైవేట్ లిమిటెడ్) "స్మార్ట్ ఇరిగేషన్ కోసం ఐఒటిలు" అనే అంశంపై వివరణాత్మక సమాచారాన్ని పంచుకున్నారు.

 

రెండవ సెషన్ "రక్షిత,వర్టికల్ , హైడ్రోపోనిక్ ,అధిక ఉత్పాదకత ,ఆదాయం కోసం ఏరోపోనిక్ వ్యవసాయం" పై జరిగింది, దీనికి డిడిజి (హార్టికల్చర్ సైన్స్), ఐసిఎఆర్, డాక్టర్ ఎ.కె. సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సెషన్ లో పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మ సింగ్, మాజీ ఓఎస్ డీ (హార్టికల్చర్), రాష్ట్రపతి భవన్, ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ (ఇంజినీరింగ్) డాక్టర్ పీతం చంద్ర కూడా పాల్గొన్నారు. ఈ సెషన్ లో శ్రీ శివేంద్ర సింగ్ (సిఇఒ, బార్టన్ & బ్రీజ్, గురుగ్రామ్) "వర్టికల్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్" గురించి చర్చించారు. దీనితో పాటు, ఇద్దరు అభ్యుదయ రైతులు శ్రీ గౌరవ్ కుమార్ , శ్రీ అంకిత్ శర్మ "రక్షిత వ్యవసాయ సంస్థలు- హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ బిజినెస్ మోడల్" పై తమ అనుభవాన్ని పంచుకున్నారు.

 

మూడవ సెషన్ "సమృద్ధి కోసం వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహం" పై జరిగింది, దీనికి ఎపిఇడిఎ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ బజాజ్ అధ్యక్షత వహించారు. ఈ సెషన్ లో, శ్రీ నదీమ్ సిద్ధిఖీ (ఎగుమతి, అమ్రోహా, ఉత్తరప్రదేశ్) "మామిడి ఎగుమతి: అవకాశాలు -సవాళ్లు" అనే అంశంపై మాట్లాడారు. శ్రీ విపిన్ గుప్తా (ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ఛైర్మన్, కర్నాల్) "భారతదేశం నుండి పాడి ఎగుమతుల సామర్థ్యాన్ని గ్రహించడం" పై తన అంతర్దృష్టిని ఆవిష్కరించారు. శ్రీ వినోద్ కౌల్ (ఆల్ ఇండియా రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) "ప్రాస్పెక్ట్స్ ఇన్ ఎక్స్ పోర్ట్ ఆఫ్ బాస్మతి రైస్ ఫ్రమ్ ఇండియా" అనే అంశంపై సమాచారాన్ని పంచుకున్నారు . డాక్టర్ రితేష్ శర్మ (బాస్మతి ఎగుమతిలో సవాళ్లు -అవకాశాలు" గురించి చర్చించారు

 

నాల్గవ సెషన్ "సేంద్రియ ,సహజ వ్యవసాయం" పై జరిగింది, దీనికి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కమిషనర్ (వ్యవసాయ  విస్తరణ & ఐఎన్ఎం) డాక్టర్ వై.ఆర్. మీనా.అధ్యక్షత వహించారు, ఈ సెషన్ లో శ్రీ అశోక్ కుమార్ యాదవ్ (నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఘజియాబాద్) 'పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్ (పిజిఎస్) ద్వారా సేంద్రియ వ్యవసాయం సర్టిఫికేషన్'పై తన అనుభవాన్ని పంచుకున్నారు.  డాక్టర్ రిబా అబ్రహం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎపిఇడిఎ, న్యూఢిల్లీ) 'ఆర్గానిక్ ఫార్మింగ్ లో తృతీయపక్ష సర్టిఫికేషన్' గురించి చర్చించారు. ఈ సెషన్ లో పద్మశ్రీ భరత్ భూషణ్ త్యాగి, అభ్యుదయ రైతు, బులంద్ షహర్ (యుపి) , శ్రీ శ్యామ్ బిహారీ గుప్తా, అభ్యుదయ రైతు, ఝాన్సీ( యు.పి.) తమ అనుభవాలను రైతులు , శాస్త్రవేత్తలతో పంచుకున్నారు.

 

*****



(Release ID: 1805002) Visitor Counter : 203