కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

బ్రిక్స్ మరియు గ్లోబల్ సౌత్‌లో పని చేస్తున్న గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించి కొత్త ఉపాధి మార్గాలపై అంతర్జాతీయ వెబ్‌నార్


Posted On: 10 MAR 2022 4:59PM by PIB Hyderabad

"BRICS మరియు గ్లోబల్ సౌత్‌లో గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కింగ్‌కు సంబంధించి కొత్త ఉపాధి రూపాలు" అనే అంశంపై కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వెబ్‌నార్‌ను నిర్వహించింది. VV గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్, నోయిడా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), BRICS నెట్‌వర్క్, లేబర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు ILO యొక్క ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ITC) సహకారంతో దీనిని నిన్న నిర్వహించారు. 

 
ఈ అంతర్జాతీయ వెబ్‌నార్ లక్ష్యం ఏంటంటే – రెండు నిర్దిష్ట రంగాలకు సంబంధించిన వివిధ రకాల కొత్త ఉపాధుల గురించి చర్చించడం. అలాగే ఈ కొత్త రకాల ఉపాధులని ప్రోత్సహించడానికి గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కింగ్, అలాగే పాలసీ ఎన్విరాన్‌మెంట్ ముందు గల అవకాశాలు మరియు సవాళ్లు గురించి కూడా చర్చిస్తారు. ఈ రెండు ముఖ్యమైన సమస్యలపై క్రాస్ కంట్రీ దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వెబ్‌నార్ నిర్వహించారు.
 
వెబినార్‌ను కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్ ప్రారంభించారు.  శ్రీ బార్త్వాల్ తన ప్రారంభ ప్రసంగంలో, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కింగ్ వంటి కొత్త రకాల పని కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలిగాయి, అయితే అదే సమయంలో సేవా పరిస్థితులు, సామాజిక భద్రతా ప్రయోజనాల సంపూర్ణత విషయంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నారు. ఈ వివాదాల పరిష్కారానికి తగిన ఫోరమ్ మొదలైనవాటి ద్వారా ఈ ఉద్భవిస్తున్న సమస్యలను దేశాలవారీగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తద్వారా అన్ని వాటాదారులకు విజయం-విజయం పరిస్థితి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ILO DWT దక్షిణ ఆసియా డైరెక్టర్ Ms డాగ్మార్ వాల్టర్ తన ప్రత్యేక ప్రసంగంలో ఉద్యోగులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల మధ్య సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయని మరియు గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ పనికి సంబంధించి దేశాల మధ్య సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.
 
'కొత్త రకాల ఉపాధిని ప్రోత్సహించడానికి పాలసీ పర్యావరణం' అనే అంశంపై ప్యానెల్ చర్చకు అధ్యక్షత వహించిన సందర్భంగా, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయెల్, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కింగ్, దేశాలతో సహా మార్కెట్ శక్తులు ఈ కొత్త ఉపాధి రూపాలను రూపొందిస్తున్నాయని అన్నారు. సామాజిక భద్రతకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. డాక్టర్ ఉమా రాణి, సీనియర్ ఎకనామిస్ట్, ILO 'గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కింగ్ యొక్క సవాళ్లు మరియు అవకాశాలు' అనే అంశంపై ప్యానెల్ చర్చకు అధ్యక్షత వహించారు. అలాగే ఈ కొత్త రకాల పని తీరులు, సవాళ్లు మరియు అవకాశాల గురించి చర్చించారు.

****
 (Release ID: 1804973) Visitor Counter : 154