పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

స్వామిత్వ పథకం కింద తమ నియోజకవర్గంలో డ్రోన్ ఫ్లయింగ్ ప్రారంభం గురించి ఎంపీలు/ఎమ్మెల్యేలకు తెలియజేయడానికి SMS పంపే కార్యాచరణను ప్రారంభించిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమేయం పథకం అమలుపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

Posted On: 10 MAR 2022 7:15PM by PIB Hyderabad

కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ అభివృద్ధి చేసిన ఒక కొత్త కార్యాచరణను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా స్వామిత్వ పథకం కింద సర్వే చేయడానికి షెడ్యూల్ చేయబడిన వారి సంబంధిత నియోజక వర్గాల్లో డ్రోన్ ఎగరడం ఎప్పుడు ప్రారంభం అవుతుందో దాని గురించి ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు ఎస్.ఎం.ఎస్ పంపించడం జరుగుతుంది. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖ (DST), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA), సర్వే ఆఫ్ ఇండియా (SoI), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రతినిధుల సమక్షంలో 11 మార్చి, 2022న మంత్రి ఈ కార్యాచరణను ప్రారంభిస్తారు.
 
ఈ కొత్త కార్యాచరణ పథకం యొక్క విస్తృత విస్తరణ మరియు పారదర్శకతకు సహాయపడుతుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల (ER) ప్రమేయంతో ఇది పథకం అమలు గురించి ప్రజలలో విశ్వాసాన్ని కలిగిస్తుంది.
 
SVAMITVA, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ సెక్టార్ స్కీమ్, 9 రాష్ట్రాలలో పథకం యొక్క ప్రారంభ దశను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, 24 ఏప్రిల్ 2021న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయ స్థాయిలో ప్రారంభించారు. ఈ పథకం 'హక్కుల రికార్డు'ను అందించడంలో భాగంగా గ్రామీణ అబాది ప్రాంతాల్లోని గ్రామ గృహ యజమానులకు మరియు ఆస్తి కార్డుల జారీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ పథకం ఐదు సంవత్సరాల (2020-2025) వ్యవధిలో దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. చివరికి 2025 నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలను కవర్ చేస్తుంది. దేశవ్యాప్తంగా పథకాన్ని సంతృప్తిపరిచే ప్రయాణంలో ఈ పథకం విభిన్న మైలురాయిని సాధిస్తోంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 108 జిల్లాల్లో డ్రోన్ ఫ్లయింగ్ కార్యక్రమంగా సక్రమంగా జరిగింది. ఇంకా అనేకం పూర్తయ్యే దశలో ఉన్నాయి.
 
గ్రామీణ భారత అభివృద్ధిలో ఈ పథకం కీలకంగా మారిందని నిరూపితమైంది. SVAMITVA వ్యక్తులు వారి ఆస్తిపై హక్కుల రికార్డును అందిస్తుంది. రుణాలు, ఇతర ప్రయోజనాలను తీసుకోవడానికి ఆర్థిక ఆస్తిగా ఉపయోగించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో లక్షలాది మంది గ్రామీణ ఆస్తి యజమానులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకం అమలు జరుగుతోంది.

’’’’



(Release ID: 1804970) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Marathi , Hindi