జౌళి మంత్రిత్వ శాఖ

భారత రాయబార కార్యాలయం, పారిస్, దుస్తుల ఎగుమతుల ప్రచార మండలి -AEPC సంయుక్తంగా ‘ఇండియా-ఫ్రాన్స్: మార్కెట్ అవకాశాలు, స్థిరమైన వస్త్ర ఫ్యాషన్ కోసం సహకారం’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించాయి.


Posted On: 10 MAR 2022 3:17PM by PIB Hyderabad

ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయం, అపెరల్ ఎక్స్‌ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (AEPC) సహకారంతో 'ఇండియా-ఫ్రాన్స్: మార్కెట్ అవకాశాలు మరియు స్థిరమైన వస్త్ర, ఫ్యాషన్ కోసం సహకారం' అనే అంశంపై నిన్న వెబ్‌నార్‌ను నిర్వహించింది. పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం డీసీఎం డాక్టర్ ప్రఫుల్లచంద్రశర్మ ప్రారంభోపన్యాసం చేశారు. భారత వస్త్ర పరిశ్రమ సుస్థిరతకు సంబంధించిన పాలసీ,  సుస్థిరత లక్ష్యాలు,ఆశయాలపై టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ వాణిజ్య సలహాదారు శ్రీమతి శుభ్రా మాట్లాడారు. ఉత్పాదకతను మెరుగుపరచడానికి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం విభిన్న విధానాలను అవలంబిస్తున్న వాస్తవాన్ని వాణిజ్య సలహాదారు నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులను నెలకొల్పుతున్న PM-MITRA వంటి కార్యక్రమాలు వాల్యూ చైన్‌లో సుస్థిరతను పొందుపరచడానికి వీలు కల్పించడం తో పాటు పరిశ్రమ భవిష్యత్తును ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ స్థితికి చేర్చేలా చేస్తుంది” అని సలహాదారు చెప్పారు.

భారతీయ దుస్తులు ఎగుమతిదారుల ప్రస్తుత స్థితి, దృక్పథం పై  AEPC చైర్మన్, శ్రీ నరేంద్ర గోయెంకా మాట్లాడుతూ, “స్థిరమైన సరఫరా గొలుసు లేకుండా, ఫ్యాషన్ పరిశ్రమ తక్కువ ఆచరణీయంగా  మారుతుందనే కఠిన వాస్తవం గురించి భారతీయ దుస్తుల పరిశ్రమకు బాగా తెలుసు. సుస్థిరత ఇప్పుడు దుస్తులు ఎగుమతి వ్యాపారం ప్రధాన స్తంభాలలో ఒకటిగా, వృద్ధి సాధనంగా పరిగణనలో ఉంది” అన్నారు

"భారతదేశం వ్యవసాయం నుండి ఫ్యాషన్ వరకు పూర్తి విలువ గొలుసుల పరిష్కారాన్ని ప్రపంచానికి అందిస్తోంది, ఆర్థిక, సామాజిక, పర్యావరణ అనే మూడు స్థిరత్వ స్తంభాలను కలిగి ఉన్న ట్రిపుల్ బాటమ్ లైన్ (TBL) విధానం ద్వారా సరఫరా గొలుసు అంతటా సుస్థిరతను సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించడం పట్ల మాకు పోటీతత్వాన్ని అందిస్తుంది. , " ఆయన అన్నారు.

భారతదేశం ఇటీవల ప్రాజెక్ట్ “SU.RE” ని ప్రారంభించింది, ఇది 'సస్టైనబుల్ రిజల్యూషన్' అనే స్థిర ప్రతిపాదన - స్వచ్ఛమైన వాతావరణానికి దోహదపడే ఫ్యాషన్ వైపు వెళ్లడానికి పరిశ్రమ నుంచి దృఢ నిబద్ధత. భారతీయ బ్రాండ్‌లు 2025 నాటికి స్థిరమైన ముడి పదార్థాలు, ప్రక్రియలను ఉపయోగించి తమ మొత్తం వినియోగంలో గణనీయమైన భాగాన్ని వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

వెబ్‌నార్  లో - నీటి వినియోగం, శక్తి వినియోగం, రసాయన భారం, వాయు ఉద్గారాలు, కార్బన్ ఉద్గారాలు, ఘన వ్యర్థాలు,  పల్లపు వంటి పర్యావరణ సుస్థిరత నుండి కలుపుకోవడం, నైపుణ్యం, కార్మిక సంస్కరణలు, మహిళా సాధికారత వంటి సర్క్యులారిటీ నుంచి సామాజిక స్థిరత్వం వరకు  వివిధ అంశాలపై చర్చ జరిగింది. బ్లాక్‌చెయిన్, ట్రేస్‌బిలిటీ ప్రాముఖ్యత కూడా చర్చకు  వచ్చింది.

లూయిస్ విట్టన్,  ఫ్యాషన్ గ్రీన్ హబ్, డెకాథ్లాన్, జామిని ,  ఇంటెల్‌క్యాప్ నుండి కీలకమైన వక్తల తో  వెబ్‌నార్-  తయారీదారులు, రిటైలర్లు, డిజైనర్లు, విధాన రూపకర్తలు, స్టార్టప్‌లు, స్థిరమైన ఫ్యాషన్, టెక్స్‌టైల్ పరిశ్రమలలో నూతన ఆవిష్కర్తలతో సహా  50 మందికి పైగా పాల్గొనడంతో భారీ స్పందన పొందింది. కన్సల్టెంట్లు, ఎగుమతి మండళ్లు,  ప్రభుత్వ సంస్థలు కూడా  ఈ చర్చలో చురుగ్గా  పాల్గొన్నాయి.

 

     ****



(Release ID: 1804964) Visitor Counter : 159