నీతి ఆయోగ్
అటల్ ఆవిష్కరణ మిషన్- AIM ద్వారా నీతి ఆయోగ్, కిడ్‌ఎక్స్ కంపెనీ సంయుక్తంగా కల్పన, పారిశ్రామిక తత్వాన్ని ప్రోత్సహించడానికి సిద్ధం
Posted On:
10 MAR 2022 5:47PM by PIB Hyderabad
కిడ్ ఎక్స్ కంపెనీ వద్ద ఇప్పటికే ఉన్న టెక్నాలజీ వేదిక "ఇకిగాయ్"ని ఉపయోగించుకుని "థింకర్‌ప్రెన్యూర్", "అటల్ టింకరింగ్ లాబ్ మారథాన్" ఇతర సారూప్య ATL సంబంధిత కార్యక్రమాలను అటల్ ఆవిష్కరణ మిషన్ కింద నిర్వహించడానికి నీతి ఆయోగ్ ఈరోజు కిడ్ ఎక్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా అటల్ ఆవిష్కరణ మిషన్ నెట్‌వర్క్ లో 1 కోటికి పైబడిన పాఠశాల విద్యార్థులకు కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లు అటల్ టింకరింగ్ లాబ్ పాఠశాలల నెట్‌వర్క్ తో అనుబంధించిన ప్రతి విద్యార్థికి డిజిటల్, అనుకూలమైన పద్ధతిలో జీరో ఖర్చుతో అందుబాటులో ఉంటాయి.
రెండు సంవత్సరాల కాల వ్యవధిలో, అటల్ ఆవిష్కరణ, మిషన్ – కిడ్ ఎక్స్ కనీసం 10 లక్షల మంది యువ అభ్యాసకులకు చేరువ అవుతుంది. ఆవిష్కరణ వ్యవస్తాపకతపై అటల్ ఆవిష్కరణ, మిషన్ కార్యక్రమాలను అమలు చేయడానికి వారిని అనుమతిస్తుంది. కిడ్ ఎక్స్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ గత సంవత్సర కాలంగా అన్ని పరీక్షలకు తట్టుకుని సిద్ధంగా ఉంది, ఈ సమయంలో 1,500పైబడిన పాఠశాలల నుండి 1 లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ వేదికను ఉపయోగించారు, ఇది సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉందని అభిప్రాయ పడ్డారు, ఫలితంగా నికర ప్రమోటర్ స్కోరు 85%+ గా నమోదు అయ్యింది.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ATL) కింద కిడ్ ఎక్స్ కంపెనీ - 100 పాఠశాలలను దత్తత తీసుకుంటుంది. \ఈ 100 పాఠశాలలకు జాతీయ విద్యా విధానం (NEP) 2020 అమలు కోసం కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల కోసం ఉచిత లైసెన్స్ లను అందిస్తోంది. 2020లో ప్రారంభించబడిన, కిడ్ ఎక్స్ -ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం, పిల్లల సహజ సామర్థ్యాల్ని కనుగొనడం ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది.
తన అభిప్రాయాలను పంచుకోడానికి అటల్ ఆవిష్కరణ మిషన్ డైరెక్టర్, NITI ఆయోగ్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ, “ఆవిష్కరణ, వ్యవస్థాపకత సంస్కృతిని పెంపొందించడానికి మా అత్యాధునిక అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల నెట్‌వర్క్ ను విద్యార్థులు ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పారు. కిడ్ ఎక్స్తో ఈ భాగస్వామ్యం ఆవిష్కర్తలు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఇలాంటి చురుకైన, సహజమైన సాంకేతిక పరిష్కారాలు కలిగి ఉండటం ATLల కోసం ఆవిష్కరణ అనుభవాన్ని పెంపొందిస్తుంది.
భాగస్వామ్యం మొదటి కార్యక్రమంగా 9600+ పాఠశాలల విద్యార్థుల కోసం AIM బూట్ క్యాంప్ , ATL టింకర్ ప్రెన్యూర్ తో 1 మే 2022న ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ ఈవెంట్ 21వ శతాబ్దపు డిజిటల్ వ్యవస్థాపక నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి 9 వారాల వర్చువల్ బూట్‌క్యాంప్ గా ఉంది. ఈకార్యక్రమం VI-XII తరగతులలోని ATL నెట్‌వర్క్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
కిడ్‌ఎక్స్ ప్రధాన కార్యనిర్వహణాధికారి కపీష్ సరాఫ్ మాట్లాడుతూ, “నీతి ఆయోగ్‌తో సహకరించడం మాకు గౌరవంగా ఉంది. భారతదేశంలో 15లక్షలకు పైగా పాఠశాలలు ఉన్నాయి - ప్రతి పాఠశాల ప్రతి సంవత్సరం ఒక వ్యవస్థాపకుడిని ఉత్పత్తి చేస్తే, ఆ వ్యవస్థాపకులలో 0.1% మంది యునికార్న్ ( వందకోట్ల అంకురా సంస్థ ) ను నిర్మిస్తే, భారతదేశం ప్రతి సంవత్సరం 1,500 కొత్త యునికార్న్ సంస్థలను చూస్తుంది. మేము నిర్మించిన సాంకేతిక పరిష్కారం త్వరలో ఈ కలను సాకారం చేయడం మా లక్ష్యం; భారతదేశంలో నూతన సృష్టి , వ్యవస్థాపకత సంస్కృతి సృష్టించడం అటల్ ఆవిష్కరణ మిషన్ లక్ష్యం, మేము మా లక్ష్యాలు చాలా దగ్గరగా ప్రతిధ్వనిస్తున్నాయి అని అన్నారు.
కిడ్ ఎక్స్ గురించి - కిడ్ ఎక్స్ అనేది IIT ఖరగ్‌పూర్, IIM కలకత్తా పూర్వ విద్యార్థులు ప్రారంభించిన ఒక స్టార్టప్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ, ఇది పాఠ్యేతర, నిజ జీవిత నైపుణ్య అభ్యాస కార్యక్రమం ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధిని మెరుగుపరచడంలో పని చేస్తుంది. "నేషనల్ ఆల్ రౌండర్ ఛాంపియన్‌షిప్" "వయస్సుకు తగిన హోలిస్టిక్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ కార్డ్" ఈ కంపెనీకి చెందిన ముఖ్యమైన కార్యక్రమాలు.
AIM గురించి - అటల్ ఆవిష్కరణ, మిషన్ (AIM) అనేది మన దేశం అంతటా ఆవిష్కరణ, వ్యవస్థాపకత సంస్కృతి సృష్టించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం. ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలలో ఆవిష్కరణలను పెంపొందించడానికి కొత్త కార్యక్రమాలు, విధానాలు అభివృద్ధి చేయడం, వివిధ వాటాదారులకు వేదికలు సహకార అవకాశాలను అందించడం దేశంలోని ఆవిష్కరణ వ్యవస్థాపకత వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక పరిరక్షణ నిర్మాణాన్ని రూపొందించడం అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్ష్యం.
***
(Release ID: 1804961)
Visitor Counter : 290