మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్యా మంత్రిత్వ శాఖ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) 2020-21పై సమగ్ర నివేదిక విడుదల


Posted On: 09 MAR 2022 7:25PM by PIB Hyderabad

విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు భారతదేశంలోని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) 2020-21 నివేదికను విడుదల చేసింది.

 పాఠశాలల నుంచి ఆన్‌లైన్ డేటా సేకరణ  UDISE+ వ్యవస్థను పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం 2018-19 సంవత్సరంలో వెనకటి పద్దతి అయిన  పేపర్ మీద మాన్యువల్ డేటాను పూరించడం ద్వారా, 2012-13 నుంచి UDISE డేటా సేకరణ వ్యవస్థలో బ్లాకు లేదా డిస్ట్రిక్ట్‌ స్థాయి లో కంప్యూటర్‌లో తదుపరి సమాచార నమోదుకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి అభివృద్ధి చేసింది.

UDISE+ సిస్టమ్‌లో, ముఖ్యంగా డేటా క్యాప్చర్, డేటా మ్యాపింగ్, డేటా వెరిఫికేషన్‌కు సంబంధించిన రంగాల్లో మెరుగుదలలు సంభవించాయి. ప్రస్తుత ప్రచురణ ప్రస్తావన 2020-21 సంవత్సరానికి సంబంధించిన UDISE+ డేటా.

 పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు:

 2020-21లో ప్రాధమిక విద్య  నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యలో చేరిన మొత్తం విద్యార్థులు 25.38 కోట్లు. 2019-20లో 25.10 కోట్ల నమోదుతో పోలిస్తే 28.32 లక్షల ఎన్‌రోల్‌మెంట్లు పెరిగాయి.

2019-20తో పోలిస్తే పాఠశాల విద్యలోని అన్ని స్థాయిలలో 2020-21లో పాల్గొనే సాధారణ స్థాయిని కొలిచే స్థూల నమోదు నిష్పత్తి (GER) మెరుగుపడింది. 2019-20తో పోల్చితే 2020-21లో స్థాయి వారీగా GER: అప్పర్ ప్రైమరీలో 89.7% నుంచి 92.2%, ఎలిమెంటరీలో 97.8% నుంచి 99.1%, సెకండరీలో 77.9% నుంచి 79.8% , హయ్యర్ సెకండరీ  లో 51.4% నుంచి వరుసగా 53.8% పెరుగుదల కన్పించింది.

2020-21లో 96.96 లక్షల మంది ఉపాధ్యాయులు పాఠశాల విద్యలో నిమగ్నమై ఉన్నారు. 2019-20లో పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సంఖ్యతో పోల్చితే ఇది దాదాపు 8800 మంది ఎక్కువ.

2020-21లో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి (PTR) ప్రైమరీకి 26, అప్పర్ ప్రైమరీకి 19, సెకండరీకి 18 మరియు హయ్యర్ సెకండరీకి 26గా ఉంది, ఇది 2018-19 నుంచి మెరుగుదలను చూపుతోంది. 2018-19లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ ,  హయ్యర్ సెకండరీకి విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి వరుసగా 28, 20, 21 ,30.

2020-21లో 12.2 కోట్ల మంది బాలికలు ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీకి చేరారు, 2019-20లో బాలికల నమోదుతో పోలిస్తే 11.8 లక్షల మంది బాలికలు పెరిగారు.

నాన్ టీచింగ్ స్టాఫ్

బోధనేతర సిబ్బంది సంఖ్య కూడా సంవత్సరాలుగా మెరుగుపడింది. 2018-19లో 12.37 లక్షలతో పోలిస్తే 2020-21లో మొత్తం బోధనేతర సిబ్బంది 15.8 లక్షలకు చేరుకున్నారు. బోధనేతర సిబ్బంది, అకౌంటెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, లేబొరేటరీ అసిస్టెంట్లు, హెడ్ క్లర్కులు, ఎల్‌డిసి/యుడిసి సిబ్బంది సంఖ్య 2018-19 నుంచి 2020-21 వరకు 2.05 లక్షలకు చేర్చడం ద్వారా 5.79 లక్షల నుంచి 7.8 లక్షలకు పెరిగింది.

పాఠశాల మౌలిక సదుపాయాలు:

ఎలక్ట్రిసిటీ ఉన్న పాఠశాలలు 2020-21లో 57,799 పాఠశాలలకు అదనంగా విద్యుత్ అందించడంతో అద్భుతమైన పురోగతిని సాధించాయి. 2018-19లో 73.85%తో పోలిస్తే ఇప్పుడు మొత్తం పాఠశాలల్లో 84% ఫంక్షనల్ విద్యుత్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి, ఈ కాలంలో 10.15% గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నాయి.

  త్రాగు నీరు ఉన్న పాఠశాలల శాతం 2019-20లో 93.7% నుంచి 2020-21లో 95.2%కి పెరిగింది.

బాలికల మరుగుదొడ్ల సౌకర్యం ఉన్న పాఠశాల శాతం 2020-21లో 93.91%కి పెరిగింది, ఇది 2019-20లో 93.2%తో పోలిస్తే సంవత్సరంలో అదనంగా 11,933 పాఠశాలల్లో సౌకర్యాన్ని జోడించడం ద్వారా ఇది సాధ్యమైంది.

2020-21లో చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యాలు ఉన్న పాఠశాలల శాతం కూడా మెరుగుపడింది. 2019-20లో 90.2%తో పోలిస్తే ఇప్పుడు 91.9%కి చేరుకుంది.

కంప్యూటర్లను కలిగి ఉన్న పాఠశాలల సంఖ్య 2019-20లో 5.5 లక్షల నుంచి 2020-21లో 6 లక్షలకు పెరిగింది, ఇది 3% పెరిగింది. ఇప్పుడు, 40% పాఠశాలల్లో క్రియాశీల కంప్యూటర్లు ఉన్నాయి.

ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2019-20లో 3.36 లక్షల నుంచి 2.6% పెరుగుదలతో 2020-21లో 3.7 లక్షలకు పెరిగింది.

భారతదేశంలోని 85.6% కంటే ఎక్కువ పాఠశాలలు 2020-21లో లైబ్రరీ/రీడింగ్ రూం/ రీడింగ్ కార్నర్‌ను కలిగి ఉన్నాయి, గత సంవత్సరం కంటే 1.6% స్వల్పంగా మెరుగుపడింది.

నమోదుపై COVID-19 మహమ్మారి ప్రభావం:

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం అధికంగా  ఉన్నప్పటికీ, ప్రీ-ప్రైమరీ, క్లాస్ 1,ప్రత్యేకావసరాలు ఉన్న పిల్లలు  (CWSN) నమోదులో COVID-19 ప్రభావం క్రింది విధంగా ఉంది.

2020-21లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యలో విద్యార్థుల నమోదు సుమారు 25.4 కోట్లు. 2019-20లో విద్యార్థుల నమోదుతో పోలిస్తే ఇది 28.3 లక్షలు ఎక్కువ. అయితే, 2019-20తో పోలిస్తే 2020-21లో ప్రీ-ప్రైమరీ స్థాయి మరియు క్లాస్ 1లో విద్యార్థుల నమోదు వరుసగా 29.1 లక్షలు,18.8 లక్షలు తగ్గింది. మహమ్మారి సమయంలో చిన్న పిల్లల పాఠశాల అడ్మిషన్లను వాయిదా వేయడం కూడా దీనికి కారణం కావచ్చు.

 2019-20తో పోలిస్తే 2020-21లో 3.56% తగ్గుదలని చూపిస్తూ 2019-20లో 22.49 లక్షలతో పోలిస్తే 2020-21లో CWSN విద్యార్థుల మొత్తం నమోదు 21.69 లక్షలుగా ఉంది.

 2020-21లో 39.7 లక్షల మంది ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారారు.

 వివరాల కోసం, దిగువ లింక్‌ను చూడండి.

 https://www.education.gov.in/hi/statistics-new?shs%20term%20node%20tid%20depth%20=394&Apply=Apply

 



(Release ID: 1804649) Visitor Counter : 233


Read this release in: English , Urdu , Hindi , Manipuri