యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మీట్ ది ఛాంపియన్స్’ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ పాఠశాలను సందర్శించి, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తోటి ఒలింపియన్లు, పారాలింపియన్లను ప్రశంసించిన - ప్రముఖ పారాలింపియన్ దేవేంద్ర ఝఝారియా
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2022 7:24PM by PIB Hyderabad
టోక్యో ఒలింపియన్లు, పారాలింపియన్ల కోసం 'మీట్ ది ఛాంపియన్స్' అనే ప్రధానమంత్రి మోడీ పాఠశాల సందర్శన ప్రచార కార్యక్రమంలో భాగంగా, భారత ప్రముఖ పారాలింపియన్, పారాలింపిక్ క్రీడా పోటీల్లో మూడుసార్లు పతక విజేత (2 స్వర్ణాలు, 1 రజతం), దేవేంద్ర ఝఝారియా, చురూ కు చెందిన పరాఖ్ రాజకీయ బాలికా ఉఛ్చా మాధ్యమిక విద్యాలయాన్ని సందర్శించారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ; కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న "మీట్-ది-ఛాంపియన్స్" కార్యక్రమం కింద, 'సంతులిత ఆహారం' - సమతుల్య ఆహారం, ఫిట్-నెస్ పై వారిని ప్రేరేపించే ప్రయత్నంలో భాగంగా. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులతో మన టోక్యో హీరోలు సంభాషిస్తున్నారు. ఈ విధంగా గుజరాత్ లో జరిగిన కార్యక్రమంలో నీరజ్ చోప్రా, హర్యానాలో జరిగిన కార్యక్రమంలో బజరంగ్ పునియా పాల్గొన్నారు. అదేవిధంగా తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో పారాలింపిక్స్ పతక విజేత మరియప్పన్ తంగవేలు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఇప్పటివరకు పలువురు ఇతర క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
దేశంలో ఈ విధమైన కార్యక్రమాన్ని తీసుకోవడం వెనుక ప్రాముఖ్యత గురించి, సోమవారం రోజున దేవేంద్ర మాట్లాడుతూ, ఇది, చిన్న పిల్లలు మంచి పోషకాహార అలవాట్లు అనుసరించేందుకు దోహదపడే ఒక పెద్ద కార్యక్రమం అని పేర్కొన్నారు. “రాజస్థాన్ లోని 75 పాఠశాలల్లోని విద్యార్థులను కలవాలన్న మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభ్యర్థనను గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము చాలా విషయాలపై, ముఖ్యంగా ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడాము. వారు చాలా చక్కగా మాట్లాడతారు. వారు చాలా తెలివైన వారు. ఆరోగ్యంగా ఉంచే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనే మక్కువ వారికి ఉన్నందున, నేను దాన్ని ఇష్టపడ్డాను. వారి ప్రతి స్పందన కూడా చాలా బాగుంది." అని దేవేంద్ర సంతృప్తి వ్యక్తం చేశారు.
“మనం చెడు పోషకాహార అలవాట్లకు వ్యతిరేకంగా పోరాడాలని, శారీరక దృఢత్వం అనేది మన జీవనశైలి గా తీసుకోవాలన్న సందేశం ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉంటుంది. మీట్ ది ఛాంపియన్స్ చొరవ ద్వారా నా తోటి ఒలింపియన్లు, పారాలింపియన్లు ఈ పెద్ద లక్ష్యానికి తమ సహకారాన్ని అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది." అని కూడా దేవేంద్ర పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థులతో ఇష్టాగోష్టి అనంతరం, దేవేంద్ర వారితో కలిసి సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడారు. హాజరైన పాఠశాల విద్యార్థులు ఆయన జీవనశైలి, అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలన్నిటికీ దేవేంద్ర ఆనందంగా సమాధానాలు చెప్పారు. “దేవేంద్ర గారి ని ఇలా చాలా దగ్గరగా కలవడం, ఆయన ఆహారపు అలవాట్లు, శరీర ధారుడ్యం గురించి ఆయన అనుసరిస్తున్న రోజువారీ కార్యకలాపాల గురించి, ఎన్నో అద్భుతమైన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం ఎంతో అపురూపంగా అనిపించింది. ఆయన మా అందరికీ మరింత స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ రోజు నేను నా డైరీలో చాలా విషయాలు వ్రాసుకున్నాను.” అని చురూ లోని సర్వహిత్ కరిణి పుత్రి పాఠశాల విద్యార్థి లక్ష్మి ప్రజాపత్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
*****
(రిలీజ్ ఐడి: 1803990)
సందర్శకుల సూచీ సంఖ్య : : 166