భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

వర్చువల్ విధానంలో అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022ని నిర్వహించిన ఈసీఐ


వర్చువల్ విధానంలో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022లో పాల్గొన్న 32 దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు

Posted On: 07 MAR 2022 6:21PM by PIB Hyderabad

కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఈ రోజు అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022ని నిర్వహించింది. దాదాపు 32 దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థలునాలుగు అంతర్జాతీయ సంస్థల కోసం ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించింది. గోవా.మణిపూర్,పంజాబ్,ఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్ లలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై ఆన్ లైన్ లో కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 150 మంది ప్రతినిధులకు వివరించడం జరిగింది. భారతదేశంలో పనిచేస్తున్న తొమ్మిది దేశాలకు చెందిన రాయనారులు/ హై కమిషనర్లుకార్యాలయాలకు చెందిన ఇతర సిబ్బంది వర్చువల్ విధానంలో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022లో పాల్గొన్నారు. 

2012 ఎన్నికల నాటి నుంచి భారతదేశం అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం నిర్వహిస్తోంది. పోలింగ్ కేంద్రాలను స్వయంగా దర్శించిఎన్నికల ప్రక్రియను తెలుసుకునే అవకాశాన్ని విదేశీ ప్రతినిధులకు కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రయాణాలపై ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో కూడా కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో వర్చువల్ విధానంలో భారతదేశం నిర్వహిస్తోంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను వీడియోల ద్వారా ప్రతినిధులకు వివరించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగిందిఎన్నికల ప్రక్రియను ప్రతినిధులకు అధికారులు వివరించారు. కార్యక్రమం ముగింపు సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారిఎన్నికల సంఘం కమిషనర్లు ప్రసంగించారు. 

ముగింపు సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు చైర్‌పర్సన్ ఎ-వెబ్ శ్రీ  సుశీల్ చంద్ర మాట్లాడుతూ కోవిడ్-19 రూపంలో ఎదురైన  సవాళ్ళను అధిగమించి  దేశంలో అయిదు రాష్ట్రాల్లో 690 శాసనసభ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించామన్నారు.  వీటిలో  183.4 మిలియన్ల మంది ఓటర్లు పాల్గొన్నారని వివరించారు. భారతదేశ ఎన్నికల విధానం సమగ్రంగా, సంపూర్ణంగా అందరికి ఆమోదకర విధంగా పనిచేస్తున్నదని అన్నారు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను ఆయన వివరించారు.  స్థానిక ఎన్నికల అధికారులు స్థానికంగా ఎదురైనా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో  11 మిలియన్ కొత్త  ఓటర్ల నమోదు జరిగిందని శ్రీ సుశీల్ చంద్ర వివరించారు. సీనియర్ సిటిజన్లు, అంగవైకల్యం కలిగిన వారికి పోస్టల్ బాలెట్ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని అన్నారు. ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు  వేసే అవకాశాన్ని వారికి కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో ఎక్కువ మంది పాల్గొనేలా చూసేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. పురుషులతో పోల్చి చూస్తే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. దీనికి నిదర్శనంగా ఉత్తరాఖండ్ ఓటింగ్ సరళిని ఆయన ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ లో మొత్తం ఓటర్లలో 67.2% మంది మహిళలు ఓటు వేశారు. ఓటింగ్ లో  62.6% పురుషులు పాల్గొన్నారు.  గోవాలో 80.96% మంది మహిళలు, 78.19% మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కోవిడ్ -29ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దారం పాటించేలా చర్యలు తీసుకున్నామని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తగ్గించామని వివరించారు. అయిదు రాష్ట్రాల్లో 2.15 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని శ్రీ సుశీల్ చంద్ర వివరించారు. 2017 ఎన్నికలతో పోల్చి చూస్తే పోలింగ్ కేంద్రాల సంఖ్య 31,000 పెరిగిందని అన్నారు. ఏ ఒక్క ఓటరును వదిలివేయకూడదుఅనే నినాదంతో  పోలింగ్ సిబ్బంది ఉత్తరాఖండ్‌లోని కఠినమైన భూభాగాలు మరియు మంచుతో కప్పబడిన ప్రాంతాల గుండా ప్రయాణించి  మణిపూర్‌లోని మారుమూల మరియు సున్నితమైన ప్రాంతాలకు చేరుకున్నారని అన్నారు. కొన్ని ప్రాంతాలకు సిబ్బందిని   విమానంలో తరలించామని వివరించారు. కొన్ని ప్రాంతాలకు  కాలినడకన చేరుకున్నారని అన్నారు.   సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కోసం డ్రోన్‌లతో నిఘా పెట్టారు. ఎన్నికల  ప్రక్రియలో ఎటువంటి అనవసరమైన తప్పుడు సమాచారం లేదని నిర్ధారించుకోవడానికి సోషల్ మీడియా పోస్ట్‌లపై నిఘా ఉంచామని వివరించారు. వ్యయ పర్యవేక్షణ బృందాల ప్రయత్నాలు  ప్రలోభాలు  లేని ఎన్నికల నిర్వహణకు తోడ్పడాయని అన్నారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అమలు చేసిన ప్రత్యేక చర్యలను శ్రీ సుశీల్ చంద్ర వివరించారు.  కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా చూసేందుకు పోలింగ్ కేంద్రాల్లో   సురక్షితమైన ప్రదేశంగా మార్చి ఓటర్లకు రక్షణ కల్పించామని అన్నారు.  ఎక్కువ కాలం పాటు వర్చువల్  విధానంలో ఎన్నికల ప్రచారం జరిగేలా చూశామని, ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో 100 శాతం  టీకా కార్యక్రమం అమలు జరిగేలా చూశామని అన్నారు. ఆరోగ్య అధికారులతో క్రమం తప్పకుండా చర్చలు జరిపి  కోవిడ్ సురక్షిత ఎన్నికలను నిర్వహణకు ఎన్నికల సంఘం కృషి చేసిందని పేర్కొన్నారు. 

 ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సురక్షితమైన ఎన్నికలు, అవాంతరాలు లేని సౌకర్యవంతమైన ఓటింగ్ అనుభవం మరియు గరిష్ట ఓటరు భాగస్వామ్యం అనే మూడు విస్తృత లక్ష్యాలతో  కమిషన్ పని చేసిందని  అన్నారు. కోవిడ్ సురక్షిత ఎన్నికలను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం అమలు నచేసిన చర్యలను ఆయన వివరించారు.  ఎన్నికల ప్రచారం నిర్వహణకు  అభ్యర్థులు మరియు పార్టీలకు ఉన్న హక్కును ఎన్నికల సంఘం గుర్తించి, పరిస్థితులకు అనుగుణంగా ప్రచారానికి అనుమతి ఇచ్చిందని అన్నారు.  కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా, ఓటర్లు మరియు పోలింగ్ సిబ్బంది భద్రత కోసం  కోసం కమిషన్ చర్యలు అమలు చేసిందని  ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుత ఎన్నికలలో వివిధ వర్గాలకు సులభంగా ఓటు వేసేందుకు కల్పించిన సౌకర్యాలను శ్రీ రాజీవ్ కుమార్ వివరించారు.  దాదాపు 5.3 లక్షల సర్వీస్ ఓటర్లు13 లక్షల మంది దివ్యాంగుల ఓటర్లు మరియు పెద్ద సంఖ్యలో వంద సంవత్సరాలు నిండిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించేలా సంఘం చర్యలు అమలు చేసిందని  శ్రీ కుమార్ పేర్కొన్నారు. 

ఎన్నికల కమీషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే తన స్వాగత ఉపన్యాసంలో  గత 70 ఏళ్లలో భారత ఎన్నికల సంఘం అమలు చేసిన వినూత్న విధానాలను వివరించారు.  మోడల్ ప్రవర్తనా నియమావళిని ఆమోదించడం, ఎన్నికల పరిశీలకులను నియమించే విధానంఈవీఎం -వివిపాట్,మరియు ఇన్ఫర్మేషన్  కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగం  వంటి ప్రధాన మైలురాళ్లను ఆయన వివరించారు.  ఉచిత, న్యాయమైన, పారదర్శకమైన మరియు నైతిక ఎన్నికలను నిర్వహించడం  కోసం. ఓటరు నమోదును సులభతరం చేయడానికి మరియు మెరుగైన ఎన్నికల భాగస్వామ్యానికి వివిధ వర్గాల ఓటర్లకు సులభతరం చేయడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఓటర్లకు అనువుగా వుండే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం,ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేలా ప్రోత్సహించడం  లాంటి చర్యలను తీసుకున్నామని అన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం  సెక్రటరీ జనరల్ మరియు ఇండియా ఏ-వెబ్  సెంటర్ హెడ్ శ్రీ ఉమేష్ సిన్హా మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సంస్థలతో భారత ఎన్నికల సంఘానికి ఉన్న  అనుబంధాన్ని గుర్తు చేశారు.   అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022   ఆలోచనల మార్పిడికి మరియు అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికను పని చేస్తుందని అన్నారు.  వివిధ దేశాలలో అమలులో ఉన్న ఎన్నికల నిర్వహణ విధానాలు, అమలు జరుగుతున్న  అత్యుత్తమ విధానాలు  మరియు నైపుణ్యాల పై అన్ని దేశాలకు అవగాహన కలుగుతుందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాల నుంచి 150 మంది  ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.  ఆస్ట్రేలియా, బహామాస్, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, క్రొయేషియా, ఇథియోపియా, ఫిజీ, జార్జియా, గినియా, గయానా, కెన్యా, లైబీరియా, మాల్దీవులు, మారిషస్, మోల్డోవా, మంగోలియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, రొమేనియా, సీషెల్స్, సియెర్రా లియోన్, సౌత్ సోలమన్ దీవులు, కొరియా, సురినామ్, టాంజానియా మరియు ఉజ్బెకిస్తాన్ మరియు ఇంటర్నేషనల్ ఐడియా , ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్స్ , అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఏ -వెబ్ ) మరియు కమ్యూనిటీ ఆఫ్ డెమోక్రసీస్‌తో సహా 4 అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ ఎన్నికల సంఘం సెక్రటరీ జనరల్, ఆస్ట్రేలియా, భూటాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిజీ, నేపాల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు స్విట్జర్లాండ్‌లకు చెందిన హైకమిషనర్లు మరియు దౌత్యవేత్తలు శ్రీ జోంగ్‌యున్ చో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1803831)
Read this release in: English , Urdu , Hindi , Manipuri