వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బంగ్లాదేశ్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సీఈపీఏ) ముందుకు తీసుకెళ్లాలని భారత్ చూస్తోంది; శ్రీ పీయూష్ గోయల్
భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లు 'ప్రపంచ ఫార్మసీ' గా కావచ్చు: శ్రీ గోయల్
రక్షణ పరికరాల సంయుక్త ఉత్పత్తిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది; శ్రీ గోయల్
"2014 నుండి మనము మన వాణిజ్య మరియు ఆర్థిక వ్యవహారాలను సహకారులుగా పెంచుకున్నాము మరియు పోటీదారులుగా కాదు"
Posted On:
07 MAR 2022 6:41PM by PIB Hyderabad
బంగ్లాదేశ్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సీఈపీఏ) ముందుకు తీసుకెళ్లాలని భారత్ చూస్తోందని వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు తెలిపారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన “ఇండియా-బంగ్లాదేశ్ వాటాదారుల సమావేశం” ప్రారంభ సెషన్‌లో శ్రీ గోయల్ ప్రసంగిస్తూ, ఇరువురు ప్రధానమంత్రులు - శ్రీ నరేంద్ర మోదీ & హెచ్‌ఈ. షేక్ హసీనా ప్రయత్నాల వల్ల భారతదేశం-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని అన్నారు.
"మా స్నేహం కాలపరీక్షకు నిలబడటమే కాకుండా ఇప్పుడు వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత & సాంకేతికతలో లోతైన సహకారంతో బహుముఖ, పరస్పర సుసంపన్నమైన బంధంగా వికసించింది" అని శ్రీ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగంలో అన్నారు.
భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దృష్టి సారించాల్సిన నాలుగు ప్రధాన అంశాలను కూడా శ్రీ గోయల్ ప్రస్తావించారు. అవి:
1. నిరంతర సరఫరా అనేది ఇప్పుడు అత్యవసరం- H.E. షేక్ హసీనా మాట్లాడుతూ, "కనెక్టివిటీ అనేది ఉత్పాదకత"; COVID-19 ఉన్నప్పటికీ, మేము రెండు దేశాల మధ్య నిరంతరాయంగా సరఫరా గొలుసును కొనసాగించాము. మా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడానికి మరియు బంగ్లాదేశ్ మరియు తూర్పు భారతదేశం యొక్క పెట్టుబడి సామర్థ్యాన్ని గ్రహించడానికి ఈ కనెక్టివిటీని మరింత మెరుగుపరచడం చాలా అవసరం.
2. రక్షణ పరికరాల ఉమ్మడి ఉత్పత్తికి మరింత ఊతమివ్వాలి: భారతదేశం USD 500 మిలియన్ల క్రెడిట్‌ను అందించినప్పటికీ, మా రక్షణ సహకారం పురోగతి సాధించలేదు. దీన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది!
3. ఫార్మాస్యూటికల్స్ కోసం APIలు, మెడికల్ ఎక్విప్‌మెంట్, డిజిటల్ హెల్త్ & ఎడ్యుకేషన్ సర్వీసెస్, అగ్రిబిజినెస్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక శక్తి, టెక్స్‌టైల్స్, జనపనార ఉత్పత్తులు, లెదర్ & ఫుట్‌వేర్.. మొదలైన అధిక ప్రభావం మరియు పెట్టుబడులు గల రంగాల పై దృష్టి సారించాలి.
4. భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లు ‘ప్రపంచ ఫార్మసీ’గా మారవచ్చు: కోవిడ్-19 సమయంలో, భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన వ్యాక్సిన్‌లు, - కోవాక్సిన్ & కోవిషీల్డ్ సురక్షితమైన వ్యాక్సిన్‌లుగా తమకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకున్నాయి. టీకాలు మరియు ఇతర ఔషధాల ఉమ్మడి తయారీకి ఇప్పుడు సమయం ఆసన్నమైంది!
దక్షిణాసియాలోనే భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని శ్రీ గోయల్ అన్నారు.
"2014 నుండి మనము మన వాణిజ్య మరియు ఆర్థిక వ్యవహారాలను సహకారులుగా పెంచుకున్నాము మరియు పోటీదారులుగా కాదు" అని శ్రీ గోయల్ అన్నారు. “వ్యాక్సిన్ మైత్రీతో భారతదేశం నుండి కోటికి పైగా వ్యాక్సిన్‌లను సరఫరా చేయడంతో మా మిత్రత (స్నేహాన్ని) మరింత బలపడింది. మేము బంగ్లాదేశ్‌కు $8 బిలియన్లకు మూడు లైన్ల క్రెడిట్‌లను కూడా విస్తరించాము. ఇది ఏ ఒక్క దేశానికైనా భారతదేశం అందించిన అతిపెద్ద రాయితీ క్రెడిట్. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గల ఇండో-బంగ్లాదేశ్ CEO ఫోరమ్ మా స్నేహానికి మరో నిదర్శనం. మేము బంగ్లాదేశ్‌లోని మిర్సరాయ్ మరియు మోంగ్లాలో రెండు భారతీయ ఆర్థిక మండలాలను కూడా అభివృద్ధి చేస్తున్నాము. టెక్స్‌టైల్స్ రంగంలో సహకారాన్ని సులభతరం చేసేందుకు మన మధ్య ఏర్పడిన టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఫోరమ్ కూడా ఫలితాలను ఇస్తోంది. మాకు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో 350కి పైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50 మంది బంగ్లాదేశ్ యువ పారిశ్రామికవేత్తలను భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించారు. ఇది మన దృఢమైన బంధాలను పెంపొందిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ” అని ఆయన అన్నారు.
చరిత్ర, ప్రజాస్వామ్య విలువలు మరియు సంస్కృతి వంటి బలమైన పునాదుల ఆధారంగా భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఏర్పడిన బంధం మరింత బలీయమవుతోందని శ్రీ గోయల్ అన్నారు.
వ్యవస్థాపక పితామహులుగా భావించే బాపు మరియు బంగాబంధు, అత్యంత గౌరవనీయులైన ముజిబర్ రహ్మాన్ రూపొందించిన సూత్రాలకు కట్టుబడి ఉన్న సోదరులం మనం అని ఆయన అన్నారు.
మార్చి 2021లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనను గుర్తుచేసుకుంటూ, సమానత్వం మరియు విశ్వాసం ఆధారంగా మన బలమైన సంబంధాలకు నిదర్శనంగా దానిని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ 6, 21ని మనం ‘మైత్రీ దివస్’గా జరుపుకోవాలని అన్నారు. 50 సంవత్సరాల స్వతంత్ర బంగ్లాదేశ్ మరియు 50 సంవత్సరాల భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య గల సంబంధాలను కూడా పురస్కరించుకొని ఈ వేడుకలను జరుపుకోవాలని అన్నారు.
వాటాదారుల సమావేశం భారతదేశం-బంగ్లాదేశ్ వ్యాపార సంబంధాలకు మాత్రమే కాకుండా ఆగ్నేయాసియా దేశాలతో కూడా ఒక పూరకం అందించగలదని శ్రీ గోయల్ ఆకాంక్షించారు. బంగ్లాదేశ్ ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారు డాక్టర్ మషియుర్ ఎకెఎం రెహమాన్, ఐసిసి ప్రెసిడెంట్ శ్రీ ప్రదీప్ సురేకా మరియు ఇతర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1803821)
Visitor Counter : 235