ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎయిమ్స్ కల్యాణి 2021 ఎంబీబీస్ బ్యాచ్ ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్


' ఆరోగ్య సంరక్షణ రంగానికి ప్రాధాన్యత ఇచ్చే దేశాలకు ఉజ్వల భవిష్యత్తు'

' పశ్చిమ బెంగాల్ ఆరోగ్య రంగంలో ఎయిమ్స్ కళ్యాణి కీలకాంగ్స్ ఉంటుంది '.. డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

' ఎయిమ్స్ కల్యాణి త్వరలో నైపుణ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది'... డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 07 MAR 2022 2:42PM by PIB Hyderabad

ఎయిమ్స్  కల్యాణిలో ఈ రోజు 2021 ఎంబీబీస్ బ్యాచ్ ప్రారంభమయ్యింది. వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి  ప్రవీణ్ పవార్ అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.  ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో మూడవ అకడమిక్ సెషన్ ప్రారంభం కావడం పట్ల డాక్టర్ భారతి  ప్రవీణ్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. 125 మందితో బ్యాచ్ ప్రారంభమయ్యింది. విద్యార్థులుసంస్థ సిబ్బందిని మంత్రి అభినందించారు. 

ప్రజలకు మెరుగైన ఆరోగ్యఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ప్రతి  రాష్ట్రంలో  ఎయిమ్స్ ను నెలకొల్పాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని  డాక్టర్ భారతి  ప్రవీణ్ పవార్ తెలిపారు. ప్రధానమంత్రి తీసుకున్న చొరవతో దేశంలో 22 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు అయ్యాయని మంత్రి వివరించారు. కొత్తగా ప్రారంభించిన ఎయిమ్స్ లో అధునాతన వైద్య సేవలను ప్రజలకు అందుబాలోకి తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదలకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. 

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల భవిషత్ ఉజ్వలంగా ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢంగా విశ్వసిస్తున్నారు. ప్రధానమంత్రి లక్ష్యంలో భాగంగా ఎయిమ్స్ కల్యాణి ఏర్పాటు అయ్యింది. 1,754 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎయిమ్స్ కల్యాణి ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. 179.82 ఎకరాల విస్తీర్ణంలో సంస్థ వస్తుంది. మూడు ప్రధాన లక్ష్యాలతో ఎయిమ్స్ పనిచేస్తుంది. వివిధ వైద్య అంశాలపై విద్యబయో మెడికల్ రంగంలో పరిశోధనఅత్యున్నత స్థాయి వైద్య సేవలను అందించేందుకు ఎయిమ్స్ కృషి చేస్తుంది. పశ్చిమ బెంగాల్ వైద్యఆరోగ్య రంగాలలో ఎయిమ్స్ కల్యాణి ఉన్నత ప్రమాణాలను నెల్కొల్పుతుందని నేను నమ్ముతున్నాను. అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్య సంస్థగా ఎయిమ్స్ కల్యాణి అభివృద్ధి సాధిస్తుందిఅని కేంద్ర మంత్రి అన్నారు. 

2001 నీట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఎయిమ్స్ కల్యాణి లో ఎంబీబీఎస్ లో చేరిన విద్యార్థులను మంత్రి అభినందించారు. తమ పిల్లలను మానవతావాదులుగా మార్చాలన్న లక్ష్యంతో  మానవ సేవా స్ఫూర్తిని నింపిన  భావి భారత వైద్యుల తల్లిదండ్రులను కూడా ఆమె అభినందించారు. ఎయిమ్స్ కల్యాణి సంస్థ లక్ష్యాల మేరకు పనిచేసేలా చూసేందుకు సహకరించాలని ఆమె ప్రతి ఒక్కరిని కోరారు. బెంగాల్ ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ కల్యాణి లక్ష్య సాధనకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఆధునిక వైద్య సౌకర్యాలు అట్టడుగు స్థాయి ప్రజలకు చేరేలా చూడడం రతి ఒక్కరి భాద్యత అని మంత్రి స్పష్టం చేశారు. 

ఢిల్లీలోని ఎయిమ్స్ మాజీ రీసెర్చ్ డీన్ కల్యాణిఎయిమ్స్ అధ్యక్షురాలు  డాక్టర్ చిత్ర సర్కార్ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామ్‌జీ సింగ్,  ఇతర సీనియర్ ప్రొఫెసర్లుఅధికారులువిద్యార్థులువిద్యార్థుల కుటుంబ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1803651) Visitor Counter : 203