నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
“సుస్థిర వృద్ధికి శక్తి” అనే అంశంపై నిర్వహించిన బడ్జెట్ వెబినార్ లో ప్రారంభోపన్యాసం చేసిన - ప్రధాన మంత్రి
'పునరుత్పాదక శక్తి ని పెంపొందించడం' అనే శీర్షికతో సౌర పి.వి. తయారీ మరియు హైడ్రోజన్ మిషన్ పై దృష్టి సారించిన - ఎం.ఎన్.ఆర్.ఈ. సదస్సు
Posted On:
05 MAR 2022 9:04AM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్-2022 ప్రకటనలను సమర్థవంతంగా, త్వరితగతిన అమలు చేయడానికి, భారత ప్రభుత్వం వివిధ కీలక రంగాల్లో వరుసగా వెబినార్లు నిర్వహిస్తోంది. వరుసగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగంగా, 2022 బడ్జెట్‌లో ప్రకటించిన ఇంధనం మరియు వనరుల రంగంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించడం తో పాటు, ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆలోచనలు, సూచనలు పొందడం కోసం, ఏడు మంత్రిత్వ శాఖలకు చెందిన వనరుల సెక్టోరల్ బృందం, “సుస్థిర వృద్ధికి శక్తి” అనే అంశంపై, 2022 మార్చి, 4వ తేదీన, ఒక వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్ లో భాగంగా ఆరు ఇతివృత్తాల పై సదస్సులు జరిగాయి. వీటిలో పారిశ్రామిక రంగానికి చెందిన నాయకులు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
ఈ వెబినార్ ప్రారంభ సమావేశం లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగం చేశారు. వాతావరణ చర్య మరియు శక్తి పరివర్తనకు భారతదేశ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రధానమంత్రి పునరుద్ఘాటిస్తూ, అధిక సామర్థ్యం గల పి.వి. సౌర మాడ్యూల్స్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, కోల్ గ్యాసిఫికేషన్, బ్యాటరీ నిల్వ, శుభ్రమైన వంట మొదలైన వాటి కోసం, పి.ఎల్.ఐ. కి 19,500 కోట్ల రూపాయల కేటాయింపు వంటి కీలక బడ్జెట్ ప్రకటనలపై చర్చ జరగాలని ప్రధానమంత్రి కోరారు. అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సహాయం చేయడానికి నిర్దిష్టమైన, ఆచరణాత్మకమైన సూచనలు ఇవ్వాలని కూడా ప్రధానమంత్రి పారిశ్రామిక రంగానికి చెందిన నాయకులను కోరారు.
'పునరుత్పాదక శక్తి ని పెంపొందించడం' అనే శీర్షికతో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన కీలక సదస్సు సౌర పి.వి. తయారీ మరియు హైడ్రోజన్ మిషన్ తో పాటు గౌరవనీయులైన ప్రధానమంత్రి వివరించిన దార్శనికతపై దృష్టి సారించింది. ఈ సదస్సుకు ఎం.ఎన్.ఆర్.ఈ. కార్యదర్శి, శ్రీ ఇందు శేఖర్ చతుర్వేది సమన్వయ కర్తగా వ్యవహరించగా, ఎన్.టి.పి.సి. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ గురుదీప్ సింగ్; అదానీ ఎనర్జీ వర్టికల్, ఎం.డి. మరియు సి.ఈ.ఓ., శ్రీ అనిల్ సర్దానా; సుజ్లాన్ ఎనర్జీ, సి.ఎం.డి., శ్రీ తులసి తంతి; రెన్యూ పవర్, సి.ఎం.డి., శ్రీ సుమంత్ సిన్హా; ఓహ్మియం. డైరెక్టర్, శ్రీ పశుపతి గోపాలన్ ప్రభృతులు విషయ నిపుణులుగా పాల్గొన్నారు.
సోలార్ మాడ్యూళ్ళ దేశీయ తయారీకి ఉన్న మద్దతును ఉపభాగాలు, ఇతర సామాగ్రితో సహా మొత్తం విలువ ఆధారిత వ్యవస్థకు విస్తరించవచ్చు వంటి అనేక నిర్దిష్ట సూచనలను పారిశ్రామిక రంగానికి చెందిన నాయకులు తెలియజేశారు. ఇది ఎం.ఎస్.ఎం.ఈ రంగంతో సహా అనుబంధ పరిశ్రమల వృద్ధి కి దోహదపడుతుంది. గ్రీన్ హైడ్రోజన్‌కు సంబంధించి, ఇటీవల బ్యాంకింగ్ కేటాయింపులు మరియు గ్రీన్ హైడ్రోజన్ కు ఐ.ఎస్.టి.ఎస్. మినహాయింపుల ప్రకటనను పారిశ్రామిక రంగం స్వాగతించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని మరింత తగ్గించడానికి, ఆర్.ఈ. యొక్క అంతర్-రాష్ట్ర బ్యాంకింగ్ కోసం ఒక యంత్రాంగాన్ని పరిగణించాలని సూచించడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ కోసం, పి.ఎల్.ఐ. యంత్రాంగంతో పాటు, గ్రీన్ హైడ్రోజన్ వినియోగం ద్వారా ఎలక్ట్రోలైజర్ల దేశీయ తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని కూడా సూచించడం జరిగింది. ఎలక్ట్రిక్ మరియు థర్మల్ మార్గాల ద్వారా సోలార్ వంటలను ప్రోత్సహించాలని పారిశ్రామిక వర్గానికి చెందిన నాయకులు సూచించారు. గ్యాస్ మరియు సోలార్ పవర్ రెండింటిలోనూ పని చేసే విధంగా అంకురసంస్థలు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ స్టవ్ లను కూడా ప్రోత్సహించవచ్చు. రూఫ్-టాప్ సోలార్ విధానాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలను కూడా దాని భారీ సామర్థ్యాన్ని బట్టి ప్రోత్సహించవచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు బొగ్గు ధరల విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వం బొగ్గు సేకరణ, వినియోగాన్ని ప్రోత్సహించే అంశాన్ని కూడా పరిగణించవచ్చు. ఈ విషయమై, సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను కూడా ఎం.ఎన్.ఆర్.ఈ. కమిటీలో పరిశీలిస్తోంది. బడ్జెట్ ప్రకటనల అమలు కోసం ఎం.ఎన్.ఆర్.ఈ. సమయానుకూలంగా చర్యలు తీసుకుంటోంది.
సూచనలు, కీలక తీర్మానాల సారాంశాన్ని విద్యుత్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్‌కు అన్ని సదస్సుల సమన్వయ కర్తలు సదస్సు ముగింపులో తెలియజేశారు. ఈ సూచనలను 'భవిష్యత్తు' కోసం చర్యలుగా మంత్రి పేర్కొంటూ, నిర్ణీత కాల వ్యవధిలో, ఈ సూచనలను అనుసరించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.
*****
(Release ID: 1803436)
Visitor Counter : 182