వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2013-14 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 88% పెరిగాయి.
ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు నాణ్యతతో పాటు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉత్పత్తుల దేశీయ తయారీకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి
Posted On:
28 FEB 2022 2:42PM by PIB Hyderabad
భారతదేశ ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి 2013-14లో యూఎస్‌డీ 6600 మిలియన్ల నుండి 2021-22 నాటికి యూఎస్‌డీ 12,400 మిలియన్లకు అంటే దాదాపు 88% పెరిగింది. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్‌వేర్ (ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు), కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (టీవీ మరియు ఆడియో), పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ మరియు ఆటో ఎలక్ట్రానిక్స్ ఈ రంగంలో కీలక ఎగుమతులుగా ఉన్నాయి.
నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019 (ఎన్‌పీఈ 2019) దేశంలోని ప్రధాన భాగాలను అభివృద్ధి చేయడానికి మరియు పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం)కి గ్లోబల్ హబ్‌గా భారతదేశాన్ని నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పిఎల్ఐ), ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మరియు సెమీకండక్టర్స్ (ఎస్పీఈసీఎస్) తయారీని ప్రోత్సహించే పథకం, సవరించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల కోసం ఐటీపీసీ స్కీమ్ (ఈఎంసీ 2.0) లింక్డ్ ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రోత్సాహాన్ని అందించడానికి మరియు అవసరమైన పర్యావరణ వ్యవస్థను స్థాపించడానికి హార్డ్‌వేర్ ప్రవేశపెట్టబడింది.
ఎగుమతుల్లో భారతదేశం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. భారతదేశ సరుకుల ఎగుమతి జనవరి 2021లో యూఎస్‌డీ 27.54 బిలియన్లు ఉండగా అది జనవరి 2022లో 23.69% పెరిగి యూఎస్‌డీ 34.06 బిలియన్లకు చేరిందని గమనించవచ్చు; జనవరి 2020లో యూఎస్‌డీ 25.85 బిలియన్ల కంటే 31.75% పెరుగుదలను నమోదు చేసింది.
2021-22 (ఏప్రిల్-జనవరి)లో భారతదేశ సరుకుల ఎగుమతి 2020-21 (ఏప్రిల్-జనవరి)లో యూఎస్‌డీ 228.9 బిలియన్ల కంటే 46.53% పెరిగి యూఎస్‌డి 335.44 బిలియన్లకు చేరుకుంది; 2019-20 (ఏప్రిల్-జనవరి)లో యూఎస్‌డి 264.13 బిలియన్ల కంటే 27.0% పెరుగుదలను సూచిస్తుంది.
ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం అనేక చురుకైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో ఎగుమతి రంగం ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవాంతరాలు మరియు అవరోధాలను తొలగించడంలో సహాయపడటానికి ఎక్స్‌పోర్ట్ మానిటరింగ్ డెస్క్ ఏర్పాటు చేయబడింది.
రిడెండెన్సీలు మరియు కాలం చెల్లిన నిబంధనలను తొలగించడానికి వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని వివిధ చట్టాలు సమీక్షించబడుతున్నాయి. అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు గొప్ప శక్తితో కొనసాగిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడిఓపీ) వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వివిధ ఎగుమతిదారుల ఆధారిత పథకాల ద్వారా ఎగుమతిదారులకు మద్దతు కూడా అందించబడుతోంది. హేతుబద్ధీకరణ మరియు డీక్రిమినలైజేషన్ ద్వారా సమ్మతి భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనేక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
ఎగుమతిదారులకు లైసెన్సింగ్ అందించడానికి మరియు వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి ఐటీ ఆధారిత ప్లాట్‌ఫారమ్ పనిలో ఉంది. విశ్వసనీయ సరఫరాదారుగా భారతదేశం యొక్క గ్లోబల్ స్టాండింగ్‌ను మెరుగుపరచడానికి భారత ఎగుమతుల బ్రాండింగ్ విలువను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది మరియు ప్రపంచ విలువ గొలుసుతో దేశాన్ని సమం చేయడానికి చురుకైన చర్యలు చేపట్టడం జరిగింది.
***
(Release ID: 1801928)
Visitor Counter : 205