ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్రెయిన్ అధ్యక్షుడు గౌరవనీయ వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ప్రధానమంత్రి సంభాషణ
Posted On:
26 FEB 2022 7:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ తెల్లవారుజామున ఉక్రెయిన్ అధ్యక్షుడు గౌరవనీయ వోలోదిమిర్ జెలెన్‌స్కీతో సంభాషించారు.
ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంఘర్షణాత్మక పరిస్థితి గురించి ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఈ సందర్భంగా వివరించారు. ఈ సంఘర్షణల్లో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. హింసకు తక్షణం స్వస్తిపలికి చర్చల వైపు దృష్టి మళ్లించాలన్న తన పిలుపును ఆయన పునరుద్ఘాటించారు. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు ఏ రూపంలోనైనా సహకరించడానికి భారత్ సుముఖంగా ఉందని తెలిపారు.
ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులు, పౌరుల భద్రత-రక్షణపై దేశం తరఫున ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరులను సత్వరం సురక్షితంగా తరలించే ప్రక్రియను వేగిరపరచాలని ఉక్రెయిన్ అధికారులను ఆయన కోరారు.
***
(Release ID: 1801625)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam