ప్రధాన మంత్రి కార్యాలయం
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ బడ్జెట్ అనంతర వెబినార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
మన ఆరోగ్యవ్యవస్థకు సంబంధించి మనం సమగ్ర విధానాన్ని చేపట్టాం. ఇవాళ మన దృష్టి కేవలం ఆరోగ్యం ఒక్కటే కాదని , వెల్ నెస్‌కూడా అని అన్నారు.
1.5 లక్షల ఆరోగ్య వెల్‌నెస్ కేంద్రాలు వేగవంతంగా ముందుకుపోతున్నాయి. ఇప్పటివరకు 85,000కు పైగా కేంద్రాలు సాధారణ చెకప్, వాక్సినేషన్, పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల విషయంలో కోవిన్ వంటి ప్లాట్ ఫారంలు ప్రపంచంలో ఇండియా ప్రతిష్ఠను పెంచాయి.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ , వినియోగదారుకు, ఆరోగ్య సంరక్షకులకు మధ్య సులభతర
సమన్వయానికి వీలుకల్పిస్తుంది. దీనితో దేశంలో చికిత్సపొందడం, చికిత్స అందించడం సులభం అవుతుంది.
మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య సేవలు, టెలిమెడిసిన వంటి వాటి వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అందుబాటులో ఉన్న తేడాను తొలగిస్తుంది.
ఆయుష్ ద్వారా మెరుగైన పరిష్కరాలను మన కోసం, ప్రపంచం కోసం ఎలా సాధించాలన్నది మనపైనే ఉంది
Posted On:
26 FEB 2022 11:10AM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బడ్జెట్ అనంతర వెబినార్ ను ఈరోజు ప్రారంభించారు. బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగించిన వెబినార్లలో ఇది ఐదవది. కేంద్ర మంత్రులు, ఆరోగ్య రంగ ప్రొఫెషనళ్లు, పబ్లిక్, ప్రైవేటు రంగానికి చెందిన వారు, పారామెడిక్స్‌కు సంబంధించిన ప్రొఫెషనళ్లు, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, పరిశోధన రంగానికి చెందిన వారు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధానమంత్రి ఆరోగ్య రంగంలోని వారిని అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధానమంత్రి ఆరోగ్య రంగంలోని వారిని అభినందించారు. ఇది భారతదేశపు ఆరోగ్య రంగ సమర్థతను ,లక్ష్యనిర్దేశిత విధానాన్ని రుజువు చేసిందని ప్రధానమంత్రి కొనియాడారు.
బడ్జెట్ , గత ఏడు సంవత్సరాలలో ఆరోగ్య రంగాన్ని సంస్కరించేందుకు, పరివర్తన తీసుకువచ్చేందుకు జరుపుతున్న కృషికి మద్దతునిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మేం మన ఆరోగ్య రంగానికి సంబంధించి సంపూర్ణ విధానాన్ని అనుసరిస్తున్నాం.ఇవాళ మా దృష్టి కేవలం ఆరోగ్య రంగంపై నే కాదు, వెల్‌నెస్ పై కూడా అని ఆయన నొక్కి చెప్పారు.
ఆరోగ్య రంగాన్ని సమగ్రంగా , సమ్మిళితంగా తీర్చిదిద్దేందుకు సంబంధించి, మూడు ముఖ్యమైన అంశాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.ఇందులో మొదటిది ఆధునిక వైద్య విజ్ఞానానికి సంబంధించి న మౌలిక సదుపాయాలు, మానవ వనరులు కాగా , రెండవది ఆయుష్ వంటి సంప్రదాయ భారతీయ వైద్య వ్యవస్థలలో పరిశోధనను ప్రోత్సహించచడం, ఆరోగ్య సంరక్షణ రంగంలో దానిని క్రియాశీలంగా వినియోగించడం, ఇక మూడవది, దేశంలోని ప్రతి ప్రాంతంలోని వారికి ప్రతి పౌరుడికి ఆధునిక, భవిష్యత్ తరం సాంకేతికతతో చవక గా ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తేవడం. కీలక ఆరోగ్య సదుపాయాలు బ్లాకు స్థాయిలో, గ్రామస్థాయిలో , జిల్లా స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం మన ప్రయత్నం అని ఆయన అన్నారు. ఈ మౌలిక సదుపాయాలను తగిన విధంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వాటిని ఆధునీకరించుకోవాలని అన్నారు. ఇందుకు ప్రైవేటు రంగం, ఇతర రంగాలు మరింత శక్తితో ముందుకు రావాలని ఆయన అన్నారు.
ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ నెట్ వర్క్‌ను బలోపేతం చేసేందుకు 1.5 లక్షల ఆరోగ్య, వెల్‌నెస్‌సెంటర్లకు సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 85 వేల కేంద్రాలు రోజువారీ చెకప్, వాక్సినేషన్, పరీక్షలు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నాయన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రస్తుత సేవలకు తోడు మానసిక ఆరోగ్యసంరక్షణను కూడా ఇందులో చేర్చినట్టు ఆయన తెలిపారు.
వైద్య మానవ వనరులను పెంపొందించడం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఒక వైపు ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్ పెరుగుతుండగా, నైపుణ్యం కలిగిన ఆరోగ్య రంగ ప్రొఫెషనల్స్‌ను తయారు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అందువల్ల ఆరోగ్య విద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన మానవ వనరుల అభివృద్ధి వంటి వాటికి బడ్జెట్ లో గత ఏడాది కంటే నిధులు పెంచినట్టు తెలిపారు.
వైద్య విద్య నాణ్యతను మెరుగుపరచడం , మరింత సమగ్రంగా , దీనిని చవకగా అందుబాటులో ఉండేటట్టు చేయడంపై దృష్టి సారించాలని, సాంకేతికత సహాయంతో ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే విషయమై నిర్ణీత కాలపరిమితితో పని చేయాలని ప్రధాన మంత్రి ఆరోగ్య సంరక్షకులకు పిలుపునిచ్చారు.
వైద్యరంగంలో ఆధునిక, భవిష్యత్ తరం సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కోవిన్ వంటి వేదికల కృషిని అభినందించారు. ఇది డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల విషయంలో భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచిందని ఆయన అన్నారు, అలాగే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ వినియోగదారుకు, ఆరోగ్య సంరక్షణ రంగంలోని వారికి అనుసంధానంగా ఉంటుందన్నారు. దీనితో దేశంలో వైద్యం అందించడం, వైద్యం పొందడం ఎంతో సులభమని అన్నారు. ఆయుష్మాన్
భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ వల్ల ప్రయోజనాలను వివరిస్తూ ప్రధానమంత్రి, అందుబాటు ధరలో వైద్యసేవల ను ఇది ప్రపంచానికి అందుబాటులోకి తెస్తుందని అన్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో మారుమూలు ప్రాంతాలకు ఆరోగ్య సేవలు, టెలిమెడిసిన్ సేవల ప్రాధాన్యతను వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవల అందుబాటులో గల వ్యత్యాసాన్ని తగ్గించడానికి వీలు కలిగిందని చెప్పారు. రానున్న 5 జి నెట్ వర్క్ , ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టు ప్రతి గ్రామానికి రానుండడం గురించి ప్రస్తావిస్తూప్రైవేటు రంగం ముందుకు వచ్చి తమ వంతు భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.వైద్య అవసరాలకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
ఆయుష్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆమోదం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,సంప్రదాయ వైద్యానికి సంబంధించి న తన ఏకైక అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాలో ప్రారంభించనున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పుడు మనం మన కోసం , ప్రపంచంకోసం మెరుగైన ఆయుష్ పరిష్కారాలను సాధించడం మనపై నే ఉందని ప్రధానమంత్రి సూచించారు.
**********
DS
(Release ID: 1801584)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam