వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వచ్చే ఐదేళ్లలో ఎగుమతులను 10 బిలియన్ వేయి కోట్ల అమెరికన్ డాలర్ల విలువకు పెంచాలని సుగంధ ద్రవ్యాల పరిశ్రమకు పిలుపునిచ్చిన శ్రీ పీయూష్ గోయల్.


"ఉన్నత విలువ జోడింపు, కొత్త ఉత్పత్తి అభివృద్ధిపై భారతీయ మసాలా పరిశ్రమ పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యం": శ్రీ పీయూష్ గోయల్ సుగంధ ద్రవ్యాల బోర్డుకు సందేశం"కోవిడ్ సమయంలో, భారతదేశం మందులు, వ్యాక్సిన్‌లతో పాటు, ప్రపంచం మన సుగంధ ద్రవ్యాలు,కషాయాల ప్రాముఖ్యతను అనుభవించింది" అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీని ఉటంకిస్తూ అన్న శ్రీ గోయల్.కొత్త భారతదేశం దృష్టి తాలింపుతో మసాలా దినుసులతో ఉండాలి!... సుగంధ ద్రవ్యాలు లేని ఆహారం రంగులు లేని జీవితం వంటిది!: శ్రీ పీయూష్ గోయల్శ్రీ గోయల్ చే ఏలకుల రైతుల కోసం వినూత్న వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ప్రారంభం

Posted On: 26 FEB 2022 7:38PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,  ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు సుగంధ ద్రవ్యాల పరిశ్రమ ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని పిలుపునిచ్చారు.

స్పైసెస్ బోర్డు 35వ వార్షికోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటూ “... మేము ఇప్పుడు సుగంధ ద్రవ్యాల ఎగుమతి కోసం మా ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాము - USD 10 bn 2030 నాటికి కాకుండా, ముందే మరింత వేగంగా ఉండాలి; వచ్చే ఐదేళ్లలో దాన్ని చేరుకోవాలని ఆకాంక్షించగలమా? మనం చేయగలమని నేను అనుకుంటున్నాను! 2027 నాటికి వచ్చే ఐదేళ్లలో మన ఎగుమతులను 10 బిలియన్ డాలర్లకు రెట్టించి, వచ్చే ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్ల ఎగుమతులను రెట్టింపు చేయాలని ఆకాంక్షిద్దాం” అని శ్రీ గోయల్ అన్నారు..

2014-21 మధ్య కాలంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతులు అమ్మకాల్లో  115%, విలువలో 84% పెరిగి, 2020-21లో 4.2 బిలియన్ డాలర్ల చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవడంపై శ్రీ గోయల్ సంతృప్తి వ్యక్తం చేశారు. "ఇప్పుడు, భారతీయ సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 180 గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి" అని ఆయన చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉటంకిస్తూ, శ్రీ గోయల్ ఇలా అన్నారు, “కోవిడ్ సమయంలో, భారతదేశం మందులు, వ్యాక్సిన్‌లతో పాటు, ప్రపంచం మన సుగంధ ద్రవ్యాలు, కాషాయాల ప్రాముఖ్యతను రుచి చూసింది..”

“హల్దీ దూద్/పసుపుపాలు  వంటి మా అమ్మమ్మ ఇంటి చిట్కాలు దాల్చినచెక్క, తులసి (తులసి ఆకులు) మొదలైన సుగంధ ద్రవ్యాలు ప్రపంచంలో గృహ ప్రధానమైనవి. వాస్తవానికి, పసుపు ఎగుమతుల్లో భారతదేశం గత ఏడాది 42% వృద్ధిని నమోదు చేసింది” అని శ్రీ గోయల్ చెప్పారు.

“ఈ సవాళ్ళతో నిండిన మహమ్మారి కాలంలో, దాల్చిన చెక్క, తులసి, ఎండు అల్లం , మిరియాలు చికిత్సా శక్తులను మిళితం చేసే ఔషధ ఉత్పత్తులలో సుగంధ ద్రవ్యాలు వినియోగించే  ఆయుర్వేదం పురాతనకాల-పరీక్షించిన పద్ధతులను ప్రపంచం గమనించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మిరియాలు, పసుపు మొదలైన వాటిని ఉపయోగించి తయారుచేసిన గోల్డెన్ మిల్క్ చాలా ఎక్కువగా వాడిన వంటకాలు, ”అన్నారాయన.

ప్రపంచం మొత్తం మీద సుగంధ ద్రవ్యాల ఎగుమతులలో భారతదేశం అగ్రగామిగా ఉన్నప్పటికీ, ఈ రంగం కూడా సవాళ్లను ఎదుర్కొంటోందని శ్రీ గోయల్ అన్నారు.

"పూర్తి ముడి రూపంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతి విషయానికి వస్తే, మేము ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో అనేక దేశాలతో వ్యయ ప్రయోజనాన్ని పొందడం లేదు, అంటే విలువ జోడించిన సుగంధ ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి పెట్టాలి. అలాగే, కఠినమైన నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి వ్యవస్థ, తయారీ వ్యవస్థలను సిద్ధం చేయడంలో మనం సవాళ్లను ఎదుర్కొంటున్నాము, ”అని శ్రీ గోయల్ అన్నారు.

“ఆహార భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి కట్టుబడి ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి, అధిక-ముగింపు విలువ జోడింపు కొత్త ఉత్పత్తుల అభివృద్ధిపై అదనపు దృష్టితో భారతీయ మసాలా పరిశ్రమ పోటీతత్వాన్ని స్థిరంగా కొనసాగించడమే లక్ష్యం” అన్నారాయన.

దృఢమైన సమర్థ కార్యక్రమాలు,  ప్రణాలికల ద్వారా దేశం నుండి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని శ్రీ గోయల్ అన్నారు.

“బోర్డు వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలపై వివిధ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో సహకార ప్రయత్నాలను ప్రారంభించింది- (1) WTO, FAO -STDFతో భారతదేశంలో మసాలా విలువ లను బలోపేతం చేయడం, సామర్థ్య నిర్మాణం వినూత్న ప్రయోగాల ద్వారా మార్కెట్ అందుబాటులోకి తెచ్చి మెరుగుపరచడం (2) INDGAP (మంచి వ్యవసాయ పద్ధతులు) సర్టిఫికేషన్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా; (3) IDH మరియు GIZ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు, నేషనల్ సస్టైనబుల్ స్పైస్ ప్రోగ్రామ్‌పై జర్మనీ, (4) UNDP యాక్సిలరేటర్ ల్యాబ్, “డెవలప్‌మెంట్ ఆఫ్ బ్లాక్‌చెయిన్ ఎనేబుల్డ్ ట్రేసబిలిటీ ప్లాట్‌ఫారమ్ ఫర్ స్పైసెస్” మొదలైన వాటి సమన్వయంతో పురోగమనం చెందుతుంది..

కార్యక్రమంలో శ్రీ గోయల్ ఏలకుల రైతుల ప్రయోజనం కోసం స్పైసెస్ బోర్డు, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా సంయుక్త చొరవతో వినూత్న వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పగడపు జూబ్లీని(35) పురస్కరించుకుని పోస్టల్ స్టాంపును ఆయన విడుదల చేశారు. సుగంధ ద్రవ్యాలలో విశ్వ నాయకత్వదిశగా భారతదేశం అడుగుజాడలను విస్తరించడానికి సుగంధ ద్రవ్యాల రంగం కోసం ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని శ్రీ గోయల్ అన్నారు.

“ఎగుమతి అభివృద్ధి  సుగంధ ద్రవ్యాల ప్రచారోన్నతి పథకం ఎగుమతిదారులకు అత్యాధునిక ప్రాసెసింగ్‌ను అనుసరించడానికి మద్దతు ఇస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలలో (కేరళలోని పుత్తడి, TN- శివగంగ, AP-గుంటూరు, రాజస్థాన్‌లో -కోటా జోధ్‌పూర్‌లోని చింద్వారా,గుణ) ఎనిమిది సుగంధ ద్రవ్యాల పార్కుల ద్వారా సుగంధ ద్రవ్యాలలో ప్రాథమిక ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపును బోర్డు ప్రారంభించింది. వ్యవస్థాపకుల ప్రయోజనం కోసం, తద్వారా మెరుగైన ధరల సాకారానికి సహాయం చేస్తుంది, ”అని ఆయన అన్నారు.

భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు క్వాలిటీ టెస్టింగ్ లేబొరేటరీ సేవలను విస్తరించాలని, సేవ నాణ్యత సామర్థ్యానికి పేరు తెచ్చేందుకు అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని శ్రీ గోయల్ బోర్డును కోరారు.

“బోర్డు క్వాలిటీ ఎవాల్యుయేషన్ లాబొరేటరీ నెట్‌వర్క్ భారతదేశంలోని ప్రధాన నౌకాశ్రయాలలో ఎగుమతిదారులు,  ఇతర వాటాదారులకు విశ్లేషణాత్మక సేవలను అందిస్తుంది. ప్రస్తుతం, అత్యాధునిక ల్యాబ్‌లు 8 స్థానాల్లో (కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, TNలోని టుటికోరిన్, చెన్నై, MHలోని ముంబై, గుజరాత్‌లోని ఖండ్లా, ఢిల్లీ సమీపంలోని నరేలా పశ్చిమ బెంగాల్ - కోల్‌కతా) బోర్డ్ కింద పనిచేస్తున్నాయి. " అని వారు చెప్పారు.

సుగంధ ద్రవ్యాల కోసం ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో భారతదేశానికి నాయకత్వం వహించడం గర్వకారణమని శ్రీ గోయల్ అన్నారు.

"2014లో FAO, WHO యొక్క కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ కింద సుగంధ ద్రవ్యాలు, వంట మూలికలపై కోడెక్స్ కమిటీ (CCSCH) ఏర్పాటుకు దారితీసిన ప్రయత్నాలకు భారతదేశం ముందుంది. ఈ కమిటీ భారతదేశం అధ్యక్షతన ఉంది,స్పైసెస్ బోర్డు దాని సెక్రటేరియట్‌గా పనిచేస్తుంది.

CCSCH 8 సుగంధ ద్రవ్యాలు-నలుపు/తెలుపు/ఆకుపచ్చ మిరియాలు, జీలకర్ర, వాము, వెల్లుల్లి, లవంగాలు, మరువం, తులసి అల్లం కోసం ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను విజయవంతంగా అభివృద్ధి చేసింది.

 పారదర్శకతతో సులభంగా వ్యాపారం చేయడం కోసం చిన్న ఏలకులకు క్లౌడ్ ఆధారిత ప్రత్యక్ష ఇ-వేలం సౌకర్యం వంటి అనేక డిజిటల్ ప్రోగ్రామ్‌లను స్పైసెస్ బోర్డు తన క్రెడిట్‌లో కలిగి ఉందని శ్రీ గోయల్ చెప్పారు.

“బోర్డు తన సేవలను చాలా వరకు డిజిటలైజ్ చేసి ఇటీవలే స్పైస్ ఎక్స్‌ఛేంజ్ ఇండియాను ప్రారంభించింది, ఇది సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అంకితమైన మొట్టమొదటి ఆన్‌లైన్ పోర్టల్, ఇది ప్రపంచవ్యాప్తంగా మసాలా ఎగుమతిదారులు, దిగుమతిదారుల మధ్య B2B మ్యాచ్‌మేకింగ్‌ను ప్రారంభించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగిస్తుంది. భారతీయ ఎగుమతిదారులు, ప్రపంచ వ్యాప్త  కొనుగోలుదారులను అనుసంధానించడానికి సాంకేతికత అనుసంధాన ప్లాట్‌ఫారమ్‌ను అందించడంతోపాటు భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాల ఎగుమతి లావాదేవీలను బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు అయినందున పోర్టల్ వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది.

భారతీయ ఆహారం మరియు జీవనశైలిలో సుగంధ ద్రవ్యాలు ఒక భాగం అని శ్రీ గోయల్ అన్నారు.

“ఉదయం అల్లం టీ లేదా ఏలకుల టీ నుండి మొదలుకొని పసుపును ఉపయోగించే సౌందర్య సాధనాల నుండి లవంగాలు,  పుదీనా  ఉపయోగించి దంత ఉత్పత్తుల వరకు మన జీవితంలోని ప్రతి అంశంలో సుగంధ ద్రవ్యాలు కనిపిస్తాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో జరిగే వివాహ ఆచారాలలో, పసుపును వధూవరుల ముఖంపై పూస్తారు, ఒక రకంగా చెప్పాలంటే, సుగంధ ద్రవ్యాలు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. చరిత్ర, సంప్రదాయం వారసత్వం విషయాల్లో ఇవి భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి.  . భారతదేశ కథ మసాలా దినుసుల కథ'' అని అన్నారు.

శ్రీ గోయల్ మాట్లాడుతూ, యుగాల నుండి భారతదేశం ప్రపంచంలోని సుగంధ ద్రవ్యాల గిన్నెగా ఉంది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగదారు. కాశ్మీర్  కుంకుమపువ్వు ప్రపంచ ప్రసిద్ధి చెందింది, కేరళ- నల్ల మిరియాలు, గుజరాత్- అల్లం ఈశాన్య ప్రాంతంలోని నాగా మిరపకాయలు వినుతికెక్కిన వస్తువులు.

"వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే సాహసానికి కారణం సుగంధ ద్రవ్యాలు. 1498లో కేరళ తీరంలో అడుగుపెట్టినప్పుడు అతని విజయం ప్రపంచ చరిత్రను శాశ్వతంగా మార్చింది. మెక్సికన్ సాస్‌లు, ఇంగ్లండులో ప్రసిద్ధి చెందిన కూరలు, కహ్వా (ప్రసిద్ధ అరబిక్ పానీయం) మొదలైన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కొన్ని ఆహార పదార్థాలలో భారతీయ మసాలాలు ఉపయోగిస్తున్నారు" అని శ్రీ గోయల్ అన్నారు.

"భారతదేశం దాని ప్రత్యేక రుచులు, సుగంధ ద్రవ్యాలతో ప్రపంచాన్ని అగ్రగామిగా చేస్తోంది, - కొచ్చి తరచుగా ప్రపంచంలోని స్పైస్ క్యాపిటల్‌గా చెప్పబడుతుంది! గుంటూరును ప్రపంచంలోనే అతిపెద్ద మిరప మార్కెట్‌గా పేర్కొంటారు, J&K ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా (కుంకుమపువ్వు)కు నిలయం, ఢిల్లీలోని ఖరీ బావోలి ఆసియాలో అతిపెద్ద మసాలా మార్కెట్‌గా ఉంది. ఈశాన్య ప్రాంతంలోని నాగా మిరపకాయ ప్రపంచంలోని అత్యంతఘాటు మిరపకాయలలో ఒకటి, ”అన్నారాయన.

శ్రీ గోయల్ సుగంధ ద్రవ్యాల పరిశ్రమ వారి విభిన్న ఉత్పత్తులకు GI ట్యాగ్ పొందాలని పిలుపునిచ్చారు.

"కూర్గ్ గ్రీన్ ఏలకులు, మిజో అల్లం, కన్నియాకుమారి లవంగాలు వంటి 26 భారతీయ మసాలా దినుసులు GIని పొందాయి, సాంప్రదాయ భారతీయ ఉత్పత్తులకు ఇటువంటి మరిన్ని అవకాశాలను మనం సంగ్రహించాలి" అని ఆయన అన్నారు.

శ్రీ గోయల్ మాటల్లో  కొత్త భారతదేశ దృష్టి కషాయం తో మసాలా దినుసులతో కలిపి ఉండాలి! "మిత్రులారా, సుగంధ ద్రవ్యాలు లేని ఆహారం రంగులు లేని జీవితం లాంటిది!"

శ్రీ గోయల్ మాట్లాడుతూ, సంవత్సరాలుగా, సుగంధ ద్రవ్యాలు మసాలా ఉత్పత్తుల మార్గదర్శక నిర్మాత, వినియోగదారు, ఎగుమతిదారుగా, అలాగే సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ విలువ జోడింపులో గ్లోబల్ హబ్‌గా ప్రపంచ సుగంధ ద్రవ్యాల రంగంలో భారతదేశం అత్యున్నత స్థానాన్ని కొనసాగిస్తోంది.

"వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్పైస్ బోర్డ్ చురుకైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిశ్రమలోని అన్ని విభాగాలతో - వివిధ వాటాదారులు, సుగంధ ద్రవ్యాల పెంపకందారులు, ఎగుమతిదారులు, వాణిజ్య ప్రమోషన్, దిగుమతి చేసుకునే దేశాల నియంత్రణ సంస్థలు, అంతర్-ప్రభుత్వ భారతీయ సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించడానికి సంస్థలు మొదలైన వాటితో కలిసి పని చేస్తుంది.

సుగంధ ద్రవ్యాల రంగానికి చెందిన రెండు రత్నాలు, MDH ఫేమ్ మహాశయ్ ధరంపాల్, గత సంవత్సరం మరణించిన ఎవరెస్ట్ స్పైసెస్ వాడిలాల్ షాలకు నివాళులు అర్పిస్తూ, శ్రీ గోయల్ మాట్లాడుతూ, “భారతీయ సుగంధ ద్రవ్యాలు భారతదేశ రుచి, రంగు, సువాసనను ప్రపంచానికి వ్యాపింపజేస్తున్నాయి. MDH మసాలా లేదా లిజ్జత్ పాపడ్ లేదా ఎవరెస్ట్ మొదలైనవి ప్రపంచ రుచిని వైవిధ్యపరిచాయి.

శ్రీ గోయల్ ఈ రంగాన్ని మరింత స్పైసీగా మార్చడానికి సుగంధ ద్రవ్యాల పరిశ్రమ ముందు '4 మసాలా'లను ఉంచారు:

• భారతీయ మసాలా దినుసులు నాణ్యతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలి: "అత్యున్నత నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడానికి సుగంధ ద్రవ్యాల బోర్డు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ల్యాబ్ సేవలనును విస్తరించాలి."

• బ్రాండ్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టాలి: "'జో అచ్చా దిఖ్తా హై, వో ఔర్ భీ బిక్తా హై' కంటికి నదరుగా కనిపించేదే అమ్ముడౌతుంది. ప్యాకేజింగ్ బలమైన మొదటి అభిప్రాయంగా పనిచేస్తుంది. ఇది భారతీయ మసాలా దినుసుల బ్రాండ్ ఈక్విటీని పెంచడానికి సహాయపడుతుంది.

• స్పైస్ టూరిజాన్ని ప్రోత్సహించండి: "భారతదేశం

ప్రపంచంలో భారతీయ మసాలా దినుసుల గురించి అవగాహన కల్పించడానికి పర్యటనలు, రుచి పండుగలు,  ప్రదర్శనలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరించాలి."

• సుగంధ ద్రవ్యాల విభాగంలో యునికార్న్‌ లను సృష్టిద్దాం: “మనకు సుగంధ ద్రవ్యాల రంగంలో చాలా మంది మిలియనీర్లు (గులాటీ, వాడిలాల్ షా కుటుంబం) ఉన్నారు. మనం దానిని ఎందుకు తదుపరి స్థాయికి తీసుకెళ్లలేము? టైర్ II & III నగరాల్లో ఉద్యోగాలను సృష్టించడం ద్వారా సుగంధ ద్రవ్యాల రంగాన్ని తదుపరి యునికార్న్ ఉత్పత్తి రంగంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకోండి.

శ్రీ గోయల్ మాట్లాడుతూ, భారతదేశం @2047 విజన్‌తో భారతదేశం అమృత్ కాల్ వైపు కదులుతున్నందున, భారతదేశపు సుగంధ ద్రవ్యాల రంగం ఈ నూతన భారతదేశ దృష్టికి చాలా అవసరమైన తాలింపును జోడిస్తుంది.

"భారతదేశ ఎగుమతిలో సుగంధ ద్రవ్యాల రంగాన్ని పతాక స్థాయికి చేర్చేందుకు మనం సమష్టిగా కృషి చేయాలి. ప్రపంచం మన రుచికరమైన మసాలా ఉత్పత్తులతో బ్రాండ్ ఇండియాను గుర్తించాలి" అని ఆయన అన్నారు.

శ్రీ గోయల్  మనదేశ మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నాను ఉటంకించారు - "భారతీయ మసాలాలు మన పరిణామాన్ని మాత్రమే కాకుండా భారతదేశ విశ్వాసాలు, సంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తాయి."

***(Release ID: 1801528) Visitor Counter : 233