శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇన్నోవేషన్ స్టార్టప్‌లను శోధించడం, మార్గదర్శకత్వం చేయడం మరియు అభివృద్ధి చెందడం కోసం పిలుపునిచ్చారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా స్టార్ట్ అప్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై ఉద్ఘాటించారు:


సిఎస్ఐఆర్ నిర్వహించిన జాతీయ స్థాయి సైంటిఫిక్ క్రియేటివిటీ కాంపిటీషన్ “సిఎస్ఐఆర్ జిజ్ఞాస విజ్ఞాన మహోత్సవ్ 2022” విజేతలను మంత్రి ప్రకటించారు

2017 నుంచి అమలవుతున్న సిఎస్ఐఆర్ జిజ్ఞాస కార్యక్రమం దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ది చేకూర్చింది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 26 FEB 2022 11:21AM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఇన్నోవేషన్ స్టార్ట్ అప్‌లను శోధించడం, మార్గదర్శకత్వం చేయడం మరియు నిలబెట్టుకోవడం కోసం పిలుపునిచ్చారు మరియు సైన్స్ మరియు టెక్నాలజీ ఆధారంగా స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై ఉద్ఘాటించారు.

భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకోవడానికి సిఎస్ఐఆర్ నిర్వహించిన జాతీయ స్థాయి సైంటిఫిక్ క్రియేటివిటీ పోటీ "సిఎస్ఐఆర్ జిజ్ఞాస విజ్ఞాన మహోత్సవ్ 2022" విజేతలను ప్రకటించిన తర్వాత మంత్రి మాట్లాడారు.

 

image.png

రోడ్‌మ్యాప్ 2047కి బలమైన పునాదులు వేయడానికి మరియు భారతదేశాన్ని వివిధ సవాళ్లను పరిష్కరించి ప్రపంచ నాయకుడిగా మార్చడంలో సహాయపడటానికి విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించడాన్ని కొనసాగించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సిఎస్ఐఆర్ జిజ్ఞాస బృందాన్ని కోరారు. భవిష్యత్ తరం శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను నిమగ్నం చేయడం మరియు మన దేశంలోని ప్రతి ప్రాంతం నుండి సైన్స్, టెక్నాలజీ & ఆవిష్కరణలను హైలైట్ చేయడం చాలా కీలకమని మంత్రి అన్నారు.

2022 జనవరి 3న ప్రారంభమైన సిఎస్ఐఆర్ జిజ్ఞాస విజ్ఞాన మహోత్సవ్ 2022 దేశవ్యాప్తంగా బూట్‌క్యాంప్‌ల ద్వారా 20,000 మందికి పైగా విద్యార్థులకు చేరువయ్యిందని డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు, నీటి సంరక్షణ, విపత్తుల నివారణ మరియు వ్యవసాయ సాంకేతికత వంటి రంగాలలో భవిష్యత్తు థీమ్‌లతో 7 బూట్‌క్యాంప్‌లు నిర్వహించడం జరిగిందని, సైన్స్ నిపుణులు మనం ఎదుర్కొంటున్న కొన్ని సమకాలీన సమస్యలను విద్యార్థులకు తెలియజేయవచ్చని ఆయన చెప్పారు. వీటికి మరింత అవగాహన మరియు ఎస్&టీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు.

కళాకారులు, యానిమేటర్లు, యాప్ డెవలపర్లు మొదలైన విభాగాలు సీఎస్ఐఆర్‌లో ఉన్నాయి. మరియు కామిక్స్, సైన్స్ ఫిక్షన్స్, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, యాప్ డెవలప్‌మెంట్, యానిమేషన్‌లు మొదలైన వాటిని అభివృద్ధి చేయడంపై బూట్‌క్యాంప్‌లను నిర్వహించిందని మంత్రి చెప్పారు. ఈ బూట్‌క్యాంప్‌లు విద్యార్థులకు శాస్త్రీయ భావనలను అర్థం చేసుకోవడానికి మరియు వారి ఆలోచన మరియు విధానాన్ని ఉత్తేజపరిచే అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన తెలిపారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో సిఎస్‌ఐఆర్ వర్చువల్ ల్యాబ్ తదుపరి తార్కిక దశ అని అలాగే 2020 ఫిబ్రవరి 14న జరిగిన సిఎస్‌ఐఆర్ సొసైటీ మీటింగ్‌లో భారత ప్రధానమంత్రి సైన్స్‌ని దేశంలోని ప్రతి మూలలో అన్ని వర్గాల విద్యార్థులకు మరింతగా తీసుకెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. 22 నవంబర్ 2021న సిఎస్‌ఐఆర్ వర్చువల్ ల్యాబ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ జిజ్ఞాస కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన కొంతమంది పాఠశాల విద్యార్థులతో కూడా సంభాషిస్తూ ఐఐటీ బాంబేతో కలిసి అభివృద్ధి చేసిన సిఎస్‌ఐఆర్ వర్చువల్ ల్యాబ్ ప్లాట్‌ఫారమ్ విద్యార్థులు ఆహ్లాదకరమైన మరియు సృజనాత్మక పద్ధతిలో శాస్త్రీయ భావనలలో పాల్గొనడానికి చాలా ఉపయోగకరంగా ఉందని  మంత్రి అన్నారు.

image.png
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సిఎస్ఐఆర్ జిజ్ఞాస భారతదేశం అంతటా పాఠశాల విద్యార్థులకు పెద్ద అనుసంధానంతో సిఎస్ఐఆర్ యొక్క ఫ్లాగ్‌షిప్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌గా ఉద్భవించిందని అన్నారు. విద్యార్థులు భౌతికంగా సిఎస్ఐఆర్ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థులతో సంభాషించడమే కాకుండా మహమ్మారి సమయంలో కూడా విద్యార్థులు శాస్త్రవేత్తలతో కనెక్ట్ అవ్వవచ్చని మరియు వెబ్‌నార్ల ద్వారా శాస్త్రీయంగా నిమగ్నమవ్వవచ్చని ఆయన అన్నారు. 2017 నుంచి అమలవుతున్న సీఎస్‌ఐఆర్‌ జిజ్ఞాస కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధిపొందడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సైన్స్, సృజనాత్మకత మరియు ఆలోచనల సమ్మేళనం 2047 కోసం మనం ముందుగా ప్లాన్ చేస్తున్నందున దేశ భవిష్యత్తు దృష్టికి ఒక అడుగు అని అన్నారు. శాస్త్రీయ భావనల ఆధారంగా సృజనాత్మక కంటెంట్‌ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై మరియు కొన్ని అంతర్దృష్టులను అందించడంలో సిఎస్ఐఆర్ పాత్రను ఆయన ప్రశంసించారు. విద్యార్థులు అభివృద్ధి చేసిన కంటెంట్‌ను సిఎస్ఐఆర్ జిజ్ఞాస వర్చువల్ ప్లాట్‌ఫారమ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇతర విద్యార్థులను ప్రోత్సహించడానికి కూడా ప్రదర్శిస్తామని మంత్రి తెలిపారు.

22 ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి 28, 2022  వరకూ ఈ వారం ఆజాదీ కా అమృత్ మహొస్తవ్ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్‌గా జరుపుకుంటున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. అన్ని సైన్స్ విభాగాలు ఇందులో చురుకుగా పాల్గొంటున్నాయి. జిజ్ఞాస విజ్ఞాన్ మహోత్సవ్  కూడా ఈ వేడుకలో భాగం.

హిందీ మరియు ఇంగ్లీషు మీడియంలో నిర్వహించిన సిఎస్ఐఆర్ జాతీయ స్థాయి సైంటిఫిక్ క్రియేటివిటీ పోటీల్లో ముగ్గురు విద్యార్థులు మొహమ్మద్ హిసామ్, శ్రుతి నింబాలి మరియు సాంచి బన్సాల్‌లకు డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక్కొక్కరికి లక్ష రూపాయల గ్రాండ్ ప్రైజ్ అందజేశారు. భారతదేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 మంది విజేతలను అవార్డులకు ఎంపిక చేశారు. పిల్లలు వారి సృజనాత్మకత కోసం కఠినంగా అంచనా వేయబడ్డారు; వినూత్న ఆలోచనలు; కథ చెప్పే సామర్థ్యం; సందేశం అందించడం; మొత్తం సామర్థ్యం; అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన; యాప్‌లు/వీడియోలు/యానిమేషన్‌ల విషయంలో వినియోగం వంటివి ఇందులో ఉన్నాయి.

సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డా. శేఖర్ సి. మండే మాట్లాడుతూ సిఎస్ఐఆర్ ల్యాబ్‌లు ఈ ఈవెంట్‌ను నిర్వహించడంతో పాటు ఐఐటీ బాంబే, మై జీఓవి, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఎంహెచ్ఆర్డీ మరియు ఇతరులతో బలమైన భాగస్వామ్యాన్ని, సహకారాన్ని అభివృద్ధి చేశాయని చెప్పారు.


 

*****    


(Release ID: 1801421) Visitor Counter : 159