సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
యూనియన్ బ్యాంక్ అందిస్తున్న MSME రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించిన కేంద్ర MSME మంత్రి నారాయణ్ రాణే
Posted On:
25 FEB 2022 5:42PM by PIB Hyderabad
సింధుదుర్గ్ / ముంబై | 25 ఫిబ్రవరి 2022
సింధుదుర్గ్ జిల్లాలో జరుగుతున్న రెండు రోజుల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమాలోచన కార్యక్రమంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈరోజు సింధుదుర్గ్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ MSME రూపే క్రెడిట్ కార్డ్ ను ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్డును అందిస్తోంది. ఇది MSMEలకు వారి వ్యాపార సంబంధిత కార్యాచరణ ఖర్చులను తీర్చడానికి సరళీకృత చెల్లింపు విధానాన్ని అందిస్తుంది.
రూపే కార్డ్ నిరంతర తక్షణ డిజిటల్ చెల్లింపులు, వడ్డీ రహిత చెల్లింపు కాలం అందుబాటులో ఉంచే ప్రయోజనాలను అందిస్తుంది. రుణాల కోసం వసూలు చేసే సాధారణ రేటుకు సమానమైన వడ్డీ రేటును కలిగి ఉంటుంది. MSME రుణగ్రహీతలు తమ వ్యాపార ఖర్చులపై 50 రోజుల వరకు వడ్డీ రహిత చెల్లింపు వ్యవధిని ఆస్వాదించగలరు. ఈ కార్డ్ కస్టమర్‌లకు వారి వ్యాపార సంబంధిత కొనుగోళ్లపై EMI సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. MSMEలు ఈ కార్డ్ లో సమర్థవంతమైన వ్యాపార సేవలను పొందుతారు, ఇది చాలా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ లలో తమ వ్యాపారాన్ని చేపట్టడంలో వారికి సహాయపడుతుంది.
RuPay క్రెడిట్ కార్డ్ MSMEల కోసం చెల్లింపు విధానాన్ని సులభతరం చేయడంతోపాటు వేగవంతం చేస్తుంది, అదే సమయంలో బ్యాంకు ఒక్కొక్క లావాదేవీ పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. డిజిటల్ చెల్లింపు సాధన అందుబాటులో ఉన్నందున క్రెడిట్ కార్డ్ వ్యాపారాల ద్వారా నగదు ఉపసంహరణ డిమాండ్‌ను కూడా తగ్గిస్తుంది.
ఇతర ప్రయోజనాలలో ప్రమాద బీమా కవరేజ్, లాంజ్ యాక్సెస్ రూపే కార్డ్ లపై NPCI అందించే ఇతర అనుమతులూ ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కార్డ్ MSMEల కోసం వివిధ రకాల అదనపు ఫీచర్లు మరియు వ్యాపార సేవలూ అందిస్తుంది.
MSME సమావేశం సందర్భంగా మొదటి బ్యాచ్ రూపే కార్డులను ఎంపిక చేసిన MSME వ్యవస్థాపకులకు కేంద్ర మంత్రి అందచేశారు.
****
(Release ID: 1801310)
Visitor Counter : 228