ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక అభివృద్ధి దిశ‌గా ఈశాన్య నారీ శ‌క్తి అడుగులుః న‌ల్ల‌మందు, మ‌ద్యం నిషేధం - డిఒఎన్ఇఆర్ మంత్రిత్వ శాఖ‌కి చెందిన ఎన్ఇసి కింద న‌మోదైన సంస్థ ఎన్ఇఆర్‌సిఆర్ సిఆర్ ఎంఎస్ చొర‌వ‌

Posted On: 24 FEB 2022 3:18PM by PIB Hyderabad

సుమారు 120 ఆవాసాల‌తో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తిర‌ప్‌లోని పురాత‌న  తూపీ గ్రామంలో నోక్టే గిరిజ‌నులు నివ‌సిస్తున్నారు. ఈ గ్రామం ఖోన్సా- లాంగ్డింగ్ జిల్లాల‌ను అనుసంధానం చేసే హైవేపై ఈ గ్రామం ఉంది. గ్రామంలోని సంప్ర‌దాయ విశ్వాసాల కార‌ణంగా గ‌తంలో గ్రామ మ‌హిళ‌ల‌ను బ‌హిరంగ స‌భ‌ల‌లో మాట్లాడేందుకు అనుమ‌తించేవారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పంచాయితీల‌లో స్థానాల‌ను మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ చేస్తూ చ‌ట్టాన్ని చేయ‌డంతో, వారు ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం చేశారు, గెలిచారు కానీ రోజువారీ ప‌నిలో భ‌ర్త‌ల నిరంత‌ర మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌వుతుంది. 

 


ఈశాన్య‌ప్రాంత క‌మ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొసైటీ (ఎన్ఇఆర్‌సిఆర్ఎంఎస్‌) 2014లో ఈ గ్రామంలో జోక్యం చేసుకుని, ఎన్ఎఆర్ఎంజి స‌మావేశాల‌లో గ్రామ మ‌హిళ‌లను త‌మ భావ‌న‌ల‌ను, అభిప్రాయాల‌ను వెల్ల‌డించేందుకు ప్రోత్స‌హించారు. గ్రామంలో ఐదు స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను ఏర్పాటు చేసి, భ‌విష్య‌త్ త‌రాల కోసం గ్రామాన్ని ఎలా మెరుగుప‌ర‌చాలో ఆలోచించ‌వ‌ల‌సిందిగా స‌భ్యులంద‌రికీ విజ్ఞ‌ప్తి చేశారు. 
గ‌తంలో గ్రామంలో 80శాతం మ‌ద్య‌పానం, న‌ల్ల‌మందు బానిస‌లు ఉండేవారు. రోజులోని ప్ర‌తి గంట‌కూ గృహ హింస‌, కుటుంబ వివాదాలు స‌ర్వ‌సాధార‌ణం. అయితే, ఎన్ఇఆర్‌సిఆర్ ఎంఎస్ చొర‌వ ఫ‌లితంగా చెప్పుకోద‌గిన మార్పులు సంభ‌వించింది. స్వ‌యం స‌హాయ‌క బృందాల (ఎస్‌హెచ్‌జి) ఏర్పాటు విష‌యాన్ని మ‌హిళ‌ల దృష్టికి తెచ్చారు. ఏర్పాటు చేసిన ఎస్‌హెచ్‌జిలు - మోసోం, రాంగో, బియాంగ్‌, ఖుహాతే మోతే, క‌శిక్‌. ఎస్‌హెచ్‌జిలు అన్ని ఒక బృందంగా ఏర్ప‌డి మ‌ద్యం, న‌ల్ల‌మందు అమ్మ‌కాల‌ను నిషేధించాల‌ని నిర్ణ‌యించారు. ఫ‌లితంగా, మ‌ద్యాన్ని, న‌ల్ల‌మందును కొనేవారు, అమ్మేవారు ఎవ‌రైనా స‌రే రూ. 5000 భారీ జ‌రిమానాను చెల్లించాల్సి ఉంటుందని చ‌ట్టాన్ని చేశారు. రెండున్న‌రేళ్ళ త‌ర్వాత‌, గ్రామం మ‌ద్యం, న‌ల్ల‌మందు ముక్త‌మైంది. గృహ హింస కేసులు గ‌త‌పు విష‌యం అవ‌డ‌మే కాక‌, పురుషులు త‌మ త‌మ ఉద్యోగాల‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు.
ఈ ప‌రివ‌ర్త‌న‌లో మ‌హిళ‌లకు గాంవ్ బురా, విద్యావంతులై, ప్ర‌భుత్వం కోసం ప‌ని చేసిన‌ కొంద‌రు పెద్దలు స‌హాయ‌ప‌డుతున్నారు. మొద‌ట్లో, పురుష జ‌నాభా దీనిని అనుమ‌తించ‌లేదు. ఈ కార‌ణంగా, వాద‌న‌లు, గొడ‌వ‌లు జ‌రిగాయి. అయితే, బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారులు, మంచి మార్గ‌ద‌ర్శ‌కాల మ‌ద్ద‌తు ఉండ‌డం గ్రామ వ్యాప్తంగా సామాజిక అభివృద్ధికి దారి తీసింది.

 

***
 

 


(Release ID: 1800871) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Hindi , Manipuri