రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఇండస్ట్రీ కనెక్ట్ 2022": రేపు పరిశ్రమ మరియు అకాడెమియా సినర్జీ సెమినార్‌ను ప్రారంభించనున్న డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవియా

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2022 4:21PM by PIB Hyderabad

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సిపెట్‌) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సహకారంతో భారత ప్రభుత్వ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, కెమికల్స్ & పెట్రోకెమికల్స్ విభాగం “ఇండస్ట్రీ కనెక్ట్ 2022” : పరిశ్రమ మరియు అకాడెమియా సినర్జీ అనే సెమినార్‌ను నిర్వహిస్తోంది.  25 ఫిబ్రవరి 2022న హరి న్యూఢిల్లీలోని ఫిక్కీలో గ‌ల‌ శంకర్ సింఘానియా కమిషన్ గ‌దిలో  ఉద‌యం 1000 గంటల నుండి 1500 గంటల వరకు ఈ సెమినార్ జ‌రుగుతుంది. కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖమంత్రి  డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవియా,  కేంద్ర స‌హాయ మంత్రి (రసాయనాలు & ఎరువులు మరియు నూతన మరియు పునరుద్ధరణ ఇంధన మంత్రిత్వ శాఖ)  శ్రీ భగవంత్ ఖుబా,  ఇత‌ర సీనియర్ అధికారుల సమక్షంలో ఈ సెమినార్‌ను ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం నుండి, పరిశ్రమల సీనియర్ కెప్టెన్లు, ఇత‌ర‌  విద్యావేత్తలు మొదలైనవారు పాల్గొంటారు. సెమినార్ సందర్భంగా “ఇండస్ట్రీ కనెక్ట్ 2022” లో  రెండు సాంకేతిక సెషన్‌లు నిర్వహించబడతాయి. ఈ టెక్నికల్ సెషన్‌లలో సిపెట్‌, టీడీబీ (టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్) మరియు వివిధ పరిశ్రమల సంఘాల అధికారులు ఈ రంగానికి సంబంధించిన కీలక సమస్యలపై చర్చించేందుకు హాజరవుతారు. సెమినార్ యొక్క విస్తృత లక్ష్యాలు ఏమిటంటే, ప‌రిశ్ర‌మ‌ల నిమిత్తం ఆర్ అండ్ డీ   ల్యాబొరేటరీలు, పెట్రో కెమికల్స్  రంగంలో మాన‌వ పెట్టుబ‌డిలో భాగంగా నైపుణ్య‌త అంత‌రాల విశ్లేష‌ణ‌లు , స్వదేశీ టెక్నాలజీని అందించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతు ఇవ్వడం, ఇండస్ట్రీ కనెక్ట్ సహాయంతో టెక్నాలజీ సహాయంతో ఆత్మనిర్భర్ సీపెట్ . టీడీబీ (టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్) రంగానికి పరిశ్రమ మరియు విద్యాసంస్థల మధ్య సమ్మేళనాన్ని స్థాపించేలా ఈ కార్య‌క్ర‌మం ముందుకు సాగుతుంది.
                                                                                                 

*****


(రిలీజ్ ఐడి: 1800867) సందర్శకుల సూచీ సంఖ్య : : 165
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil