ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఎంఎస్‌ఎంఈ రంగంలో ఈశాన్య ప్రాంతంలో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు పోటీతత్వాన్ని పెంపొందించడం’ అనే అంశంపై ఏర్పాటైన సదస్సులో ప్రసంగించిన కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


ఎంఎస్‌ఎంఈ రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

ఆత్మనిర్భర్ భారత్ సాధన దిశలో ఎంఎస్‌ఎంఈ రంగం తోడ్పడుతుంది... కేంద్ర మంత్రి

ఈశాన్య ప్రాంతంలో సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు ఈశాన్య ప్రాంతంలోని ఎంఎస్‌ఎంఈ రంగ సామర్థ్యాన్ని పెంపొందించాలి .. శ్రీ జి. కిషన్ రెడ్డి


1,500 కోట్ల రూపాయల అంచనాలతో ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అమలు కానున్న ప్రధానమంత్రి ప్రత్యేక పథకం ఎంఎస్‌ఎంఈ రంగానికి బోనస్‌గా ఉంటుంది : శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 23 FEB 2022 12:58PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

ఎంఎస్‌ఎంఈలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని   ఈశాన్య ప్రాంత అభివృద్ధిపర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ,ఇటీవలి బడ్జెట్‌ ఎంఎస్‌ఎంఈ మధ్య పోటీతత్వాన్ని అలవరస్తుందని మంత్రి పేర్కొన్నారు.

* రానున్న 25 సంవత్సరాల  'అమృత్‌కాల్లో   దేశ ఆర్థిక వృద్ధిలో  ఎంఎస్‌ఎంఈ లు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు.

 * ఎంఎస్‌ఎంఈ రంగానికి  ఈశాన్య ప్రాంతంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  వ్యవసాయంఫుడ్ ప్రాసెసింగ్టూరిజంఖనిజ ఆధారిత పరిశ్రమలుఐటీమౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని శ్రీ జి. కిషన్ రెడ్డి సూచించారు

 * ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలను  సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడానికి సంబంధిత వర్గాలు  సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.                                             

 ‘ఎంఎస్‌ఎంఈ రంగంలో ఈశాన్య ప్రాంతంలో   అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు పోటీతత్వాన్ని పెంపొందించడం అనే అంశంపై   భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సదస్సులో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధిపర్యాటక మరియు సంస్కృతి మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు.

 ఎంఎస్‌ఎంఈ  రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వర్ణించిన కేంద్ర మంత్రి ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలలో ఎంఎస్‌ఎంఈ కీలకంగా వ్యవహరించాలని పిలుపు ఇచ్చారు. రానున్న 25 సంవత్సరాల  'అమృత్‌కాల్లో   దేశ ఆర్థిక వృద్ధిలో  ఎంఎస్‌ఎంఈ లు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈలు అభివృద్ధి సాధించేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని శ్రీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  వ్యవసాయంఆహార ప్రాసెసింగ్పర్యాటకంఖనిజ ఆధారిత పరిశ్రమలుఐటీమౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

 ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఈశాన్య ప్రాంత అభివృద్ధికి సంబంధించి అనేక చర్యలు అమలు చేస్తున్నామని  కేంద్ర మంత్రి తెలిపారు.  1,500 కోట్ల రూపాయల అంచనాలతో ఇటీవల ప్రకటించిన ప్రధానమంత్రి డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ పథకం ఎంఎస్‌ఎంఈ రంగానికి బోనస్‌గా ఉంటుందని ఆయన అన్నారు.

 ఈశాన్య ప్రాంతం అనేక కొత్త అవకాశాలతో అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశిస్తున్నదని శ్రీ కిషన్‌రెడ్డి అన్నారు.  మారుతున్న పరిస్థితులను   సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 సమగ్ర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించి  మెరుగైన భవిష్యత్తు నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని  శ్రీ కిషన్‌రెడ్డి అన్నారు. కలలను సాకారం చేసుకునేందుకు ఎంఎస్‌ఎంఈ లతో సహా సంబంధిత వర్గాలు కృషి చేయాలని ఆయన సూచించారు. 


(Release ID: 1800619) Visitor Counter : 172