ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక, పెట్టుబడుల మార్కెట్ల అధిపతులతో చర్చించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
21 FEB 2022 5:46PM by PIB Hyderabad
ఆర్థిక, పెట్టుబడుల మార్కెట్‌ల (కేపిటల్ మార్కెట్) నాయకులతో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సోమవారం ముంబైలో ముచ్చటించారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషించవలసిందిగా ఆమె పరిశ్రమ నాయకులను ఆమె కోరారు.
మహమ్మారి కాలంలో కూడా విత్త మార్కెట్లు ప్రదర్శించిన బలాన్ని గురించి ఆర్థిక మంత్రి తన తొలి వ్యాఖ్యలలో సంతృప్తిని వ్యక్తం చేశారు.
అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో ఉత్పాదక పెట్టుబడి కోసం వనరులను సరైన రీతిలో పెట్టేందుకు సమర్ధత, పారదర్శకత కోసం మార్కెట్ భాగస్వాములు కృషి చేయాలని శ్రీమతి సీతారామన్ విజ్ఞప్తి చేశారు.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు విత్త మార్కెట్ పై నమ్మకం, విశ్వాసం అవసరమని ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు. విత్తమార్కెట్లను బలోపేతం, పెట్టుబడిదారులకు అనుకూలం చేసేందుకు వ్యవస్థల నిర్మాణ పోషించే ప్రముఖ పాత్రను మార్కెట్ భాగస్వాములకు శ్రీమతి సీతారామన్ పట్టి చూపారు.
పెట్టుబడిదారులలో అవగాహన, కెవైసి నిబంధనలు, మ్యూచ్యువల్ ఫండ్లు చొచ్చుకుపోవడం, కార్పొరేట్ బాండ్లు బలోపేతం, సరుకు సాధకాలు ( కమోడిటీ డెరివేటివ్స్), మార్కెట్ వ్యవస్థ సమర్ధత గురించి వివిధ ఐడియాలను, సూచనలను వివరణాత్మకంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు (స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి అనుబంధంగా లావాదేవీలకు సంబంధించి పని చేసే సంస్థలు), డిపాజిటరీలు, మ్యూచ్యువల్ ఫండ్, పరిశ్రమ, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు, మర్చెంట్ బ్యాంకర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు సంబంధించిన అధికారులు ఉన్నారు.
***
(Release ID: 1800160)
Visitor Counter : 233