మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

“అక్వాటిక్ యానిమల్ డిసీజెస్ (జలచరాల వ్యాధుల)పై జాతీయ నిఘా కార్యక్రమం కోసం వెబ్‌నార్’’

Posted On: 16 FEB 2022 5:43PM by PIB Hyderabad

కేంద్ర ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, ఫిషరీస్, పశుసంవర్ధక  పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ,   "అజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 15 ఫిబ్రవరి, 2022న భారతదేశంలో జలచరాల వ్యాధుల కోసం జాతీయ నిఘా కార్యక్రమం: భారతదేశంలో వ్యాధి పాలన వ్యవస్థను స్థాపించడానికి ఒక అడుగు" అనే అంశంపై వెబ్‌నార్‌ను నిర్వహించింది.  ఈ కార్యక్రమానికి ఫిషరీస్ శాఖ, ఐకార్ ఇన్‌స్టిట్యూట్‌లు, కేంద్ర ప్రభుత్వ అధికారులు,  వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మత్స్యశాఖ అధికారులు, రాష్ట్ర వ్యవసాయ, వెటర్నరీ  ఫిషరీస్ విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, రైతులు, హేచరీ యజమానులు సహా 150 మందికి పైగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆక్వాకల్చర్ పరిశ్రమ నుండి విద్యార్థులు,  వాటాదారులు వచ్చారు. ఐఏ  సిద్ధిఖీ, ఫిషరీస్ డెవలప్‌మెంట్ కమిషనర్, డీఓఎఫ్, వెబ్‌నార్ థీమ్‌ను పరిచయం చేశారు. వెబినార్లో  ప్రముఖ ప్యానలిస్టులు  సాగర్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ (ఇన్లాండ్ ఫిషరీస్); డాక్టర్ జోయ్‌కృష్ణ జెనా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్ సైన్స్), ఐకార్, న్యూఢిల్లీ; డాక్టర్ ఇద్ద్య కరుణసాగర్, సలహాదారు (పరిశోధన  పేటెంట్లు), నిట్టే విశ్వవిద్యాలయం, మంగళూరు; డాక్టర్ ఏజీ పొన్నయ్య, మాజీ ఎమెరిటస్ సైంటిస్ట్  మాజీ డిసిప్లిన్ లీడర్, వరల్డ్ ఫిష్ సెంటర్, మలేషియా,; డాక్టర్ కె.కె. లాల్, డైరెక్టర్, ఐకార్- నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, లక్నో; డాక్టర్ నీరజ్ సూద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐకార్- నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, లక్నో; .వి. బాలసుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి, భారత రొయ్యల రైతుల సమాఖ్య, బెంగళూరు పాల్గొన్నారు.

 

 సాగర్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ (ఇన్లాండ్ ఫిషరీస్), ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్వాకల్చర్ (చేపల వంటి జలచరాల పెంపకం) ఉత్పత్తి తీవ్రతరం   కావడం, వైవిధ్యీకరణ ద్వారా  జలసంబంధ వ్యాధుల వ్యాప్తికి ప్రమాదకరస్థాయికి పెరిగిందని అన్నారు. ఉద్భవిస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం వాటి నియంత్రణకు కీలకమని ఆయన స్పష్టం చేశారు. జాతీయ నియంత్రణ లేదా నియంత్రణ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఉన్న వ్యాధి గురించిన పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. మెహ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ జలసంబంధ వ్యాధులపై నిఘా, వీటిని  అంతర్జాతీయ ఏజెన్సీలకు నివేదించడంలో ఎన్ఎస్పీఏఏడీ పోషించిన పాత్ర, దేశంలో జలసంబంధ వ్యాధుల నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించారు.

టెక్నికల్ సెషన్‌లో,  ఢిల్లీలోని ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్ సైన్స్) డాక్టర్  జోయ్‌కృష్ణ జెనా వెబ్‌నార్ కోసం అంశాలను నిర్దేశించారు  భారతదేశం   విభిన్న స్థాయి సామర్థ్యాలతో,  మత్స్య ప్రాధాన్యతలతో కూడిన విశాలమైన దేశమని అన్నారు. అందువల్ల వ్యాధులపై నిఘా కార్యక్రమం జాతీయంగానూ  అంతర్జాతీయంగానూ చాలా కీలకమని స్పష్టం చేశారు. వ్యాధుల వ్యాప్తిని పర్యవేక్షించడం,  నియంత్రించడం  సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణకు  అంతిమంగా స్థిరమైన ఆక్వాకల్చర్‌కు ప్రాథమిక అవసరంగా మారిందని జెనా వివరించారు. ఆక్వాకల్చర్ కోసం సమన్వయంతో కూడిన నిఘా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో భారతదేశానికి చెందిన నేషనల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఆక్వాటిక్ యానిమల్ డిసీజెస్ (ఎన్ఎస్పీఏఏడీ) గొప్ప ఉదాహరణగా అని డాక్టర్ జెనా పేర్కొన్నారు.

డాక్టర్ నీరజ్ సూద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐకార్- నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, లక్నో, దేశంలో ప్రాజెక్ట్ స్థితి  ప్రాజెక్ట్  భవిష్యత్తు లక్ష్యాలతో పాటు ఎన్ఎస్పీఏఏడీపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. మంగళూరులోని నిట్టే విశ్వవిద్యాలయ సలహాదారు,  డాక్టర్ ఇద్ద్య కరుణసాగర్ ఈ సెషన్ ద్వారా వ్యాధి నిఘా ఆధారంగా జల జంతువుల ఆరోగ్య నిర్వహణపై వ్యూహరచన చేయడం గురించి చెప్పారు. డాక్టర్ ఎ.జి. పొన్నయ్య, మాజీ ఎమెరిటస్ సైంటిస్ట్  మాజీ డిసిప్లిన్ లీడర్, వరల్డ్ ఫిష్ సెంటర్, మలేషియా మాట్లాడుతూ అన్యదేశ జలసంబంధ వ్యాధులను గుర్తించిన సందర్భంలో అత్యవసర ప్రతిస్పందనపై సమావేశాన్ని నిర్వహించారు. భారత రొయ్యల రైతుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి వి.బాలసుబ్రహ్మణ్యం పారిశ్రామిక విధానం,  రొయ్యల ఆక్వాకల్చర్‌లో వ్యాధి పర్యవేక్షణ కోసం మత్స్య, ఆక్వాకల్చర్ రంగం  ఆవశ్యకత గురించి వివరించారు.

ప్రదర్శన అనంతరం విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, హేచరీల యజమానులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులతో బహిరంగ చర్చా కార్యక్రమం జరిగింది. చర్చానంతరం, డాక్టర్ ఎస్.కె. ద్వివేది, సహాయ కమిషనర్, డిఓఎఫ్ ప్రతిపాదించిన ధన్యవాదాలతో వెబ్‌నార్ ముగిసింది.

***



(Release ID: 1799194) Visitor Counter : 201


Read this release in: Hindi , English , Urdu , Tamil