గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం- తెలంగాణాలో సంప్రదాయక ఉత్సాహంతో ప్రారంభమయిన మేడారం జాతర


దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన కోట్లాది మంది భక్తులు, యాత్రికులతో కోలాహలంగా మారిన జాతర

Posted On: 17 FEB 2022 1:15PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు:

పవిత్రమైన మేడారం జాతర మొదటి రోజున భారీగా తరలి వచ్చిన యాత్రికులు

గిరిజన సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం జాతర కార్యక్రమాలకు మద్దతు, ప్రచారం కల్పిస్తున్న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు , వారసత్వాన్ని ప్రోత్సహించడం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యం

తెలంగాణ కోయ తెగ వారు 'మేడారం గద్దె‘ పైకి సారలమ్మ ను తీసుకు రావడంతో 2022 ఫిబ్రవరి 16న మంగళకరమైన , భక్తజనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్వైవార్షిక "మేడారం జాతర" మొదటి రోజు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

కుంభ మేళా తరువాత భారత దేశం లో రెండవ అతిపెద్ద ఉత్సవం తెలంగాణాలో నాలుగు రోజుల పాటు జరిగే మేడారం గిరిజన జాతర. ఇది ఆసియా లోనే అతి పెద్ద గిరిజన జాతర. ఈ జాతర లో ప్రధానంగా వన దేవతలు సమ్మక్క , సారలమ్మ లను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెల మాఘ మాసం లో పౌర్ణమి రోజున ఈ జాతర ను నిర్వహిస్తారు. సారలమ్మ సమ్మక్క కుమార్తె. ఆమె విగ్రహాన్ని, ఆచార ప్రకారం, మేడారం సమీపంలోని కన్నెపల్లి అనే చిన్న గ్రామంలో ఒక ఆలయంలో ప్రతిష్టించారు.

 

తొలి రోజు తెల్లవారు జామున పూజారులు  (అర్చకులు) పవిత్ర పూజలు చేశారు. (సాంప్రదాయ కోయ పూజారులు (కాకా వడ్డెలు) మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మ దేవత చిహ్నాలు  (అదెరాలు / పవిత్ర కుండలు బండారు / పసుపు , కుంకుమ పొడి మిశ్రమం) లను వారి సాంప్రదాయ సంగీత వాద్యాల (డోలి / స్థూపాకార డ్రమ్, అక్కుం / ఇత్తడి ఊదడం వాయిద్యం, తూత కొమ్ము / బైసన్-కొమ్ము వాయిద్యం, తాళాలు మొదలైనవి) మధ్య, పిల్లల కోసం వరం కోరుకునే యాత్రికుల భారీ ఊరేగింపులు / సాష్టాంగ నమస్కారాలతో నృత్యాలతో .తీసుకువచ్చి మేడారంలోని ఆమె గద్దె (వేదిక) మీద ఉంచారు.

అదేవిధంగా, అదే రోజు సాయంత్రం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు - జెండా, అడెరాలు బండారు - లను మహబూబ్ బాద్ జిల్లా కొత్తగూడ మండలం పునుగొండల గ్రామం నుండి పెంకా వడ్డెలు  మేడారం తీసుకు వచ్చారు. అదేవిధంగా, సమ్మక్క బావ గోవిందరాజు , సోదరి నాగులమ్మల చిహ్నాల ను దుబ్బగట్ట వడ్డెలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం మండలం కొండయి నుండి మేడారం తీసుకు వచ్చారు.

వివిధ గ్రామాలకు చెందిన , వివిధ షెడ్యూల్డ్ తెగలకు చెందిన అనేక మంది యాత్రికులు,  కోట్లాది మంది భక్తులు ఈ జాతరలో ఆనందోత్సాహాలతో పాల్గొనేందుకు ములుగు జిల్లా లో ఉన్న మేడారం ను  సందర్శిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కోయలు ఈ జాతరను ద్వైవార్షికంగా జరుపు కుంటున్నారు.

కన్నెపల్లి గ్రామస్తులు 'హారతి' నిర్వహించి సారలమ్మ కు ఘన వీడ్కోలు పలికారు. అనంతరం సారలమ్మ విగ్రహాన్ని 'జంపన్న వాగు' (జంపన్న పేరుతో చిన్న కాలువ) ద్వారా మేడారం గద్దె కు తీసుకు వచ్చారు. 'గద్దే' వద్దకు చేరుకున్న తరువాత సారలమ్మ ను ప్రత్యేక పూజలు , ఇతర ఆచారాలతో పూజించారు. మూడు మిలియన్లకు పైగా భక్తులు సారలమ్మను సందర్శించి, జాతర లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు.

 

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవానికి సంబంధించిన కార్యక్రమాలకు, మద్దతు ఇస్తోంది. ప్రచారం కల్పిస్తోంది. తెలంగాణ షెడ్యూల్డ్ తెగల యొక్క వివిధ చమత్కారకోణాలను సంరక్షించడం మరియు ప్రోత్సహించడం.

 

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలంగాణ గిరిజనుల వివిధ సంప్రదాయ రీతులను సంరక్షించడం తో పాటు మేడారం జాతర కార్యక్రమాలకు పూర్తి మద్దతు, ప్రచారం కల్పిస్తోంది. ఈ జాతర గిరిజన సంస్కృతులు, పండుగలు ,వారసత్వంపై అవగాహన కల్పించడంతోపాటు సందర్శకులు ,తెలంగాణ గిరిజన సంఘాల మధ్య సామరస్యపూర్వకమైన బంధాన్ని కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

*******

NB/UD

 

 

 



(Release ID: 1799148) Visitor Counter : 398