ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టి.ఈ.ఆర్.ఐ. నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన - ప్రారంభోపన్యాసం


"నా 20 సంవత్సరాల పదవీ కాలంలో పర్యావరణం, స్థిరమైన అభివృద్ధి నాకు కీలకమైన ప్రధానాంశాలు గా ఉన్నాయి, మొదట గుజరాత్‌ లోనూ, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ”

"పేదలకు సమానమైన ఇంధన సదుపాయం మా పర్యావరణ విధానానికి మూలస్తంభం"

"భారతదేశం ఒక పెద్ద-వైవిధ్య దేశం; ఈ జీవావరణాన్ని రక్షించడం మా కర్తవ్యం"

"వాతావరణ న్యాయం ద్వారా మాత్రమే పర్యావరణ సుస్థిరత సాధ్యమౌతుంది"

‘‘వచ్చే ఇరవై ఏళ్లలో భారత ప్రజల ఇంధన అవసరాలు దాదాపు రెట్టింపు అవుతాయని అంచనా. ఈ శక్తిని తిరస్కరిస్తే, లక్షలాది మంది జీవితాలను తిరస్కరించినట్లే”

"అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మరియు సాంకేతికత బదిలీపై తమ హామీలను నెరవేర్చాలి"

"సుస్థిరతకు అవసరమైన భౌగోళిక వనరుల కోసం సమన్వయంతో కూడిన చర్య అవసరం"


"ప్రపంచవ్యాప్త గ్రిడ్ నుండి ప్రతి చోటా అన్ని సమయాలలో స్వచ్ఛమైన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి మనం తప్పకుండా కృషి చేయాలి. ఇది ''ప్రపంచం మొత్తం'' అనే భారతదేశ విలువలను సూచించే విధానం''

Posted On: 16 FEB 2022 6:18PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇంధనం మరియు వనరుల సంస్థ (టి.ఈ.ఆర్.ఐ) నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు లో ప్రారంభోపన్యాసం చేశారు.  ఈ కార్యక్రమంలో డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు, శ్రీ లూయిస్ అబినాదర్;  గయానా అధ్యక్షుడు, డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ; ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్, శ్రీమతి అమీనా జె మహమ్మద్; కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తమ 20 ఏళ్ల పాలనలో మొదట గుజరాత్‌లో, ఆతర్వాత ఇప్పుడు జాతీయ స్థాయిలో పర్యావరణం మరియు సుస్థిరమైన అభివృద్ధి అనేవి తనకు కీలకమైన అంశాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  భూ గ్రహం దుర్బలమైనది కాదని, అయితే, భూగోళంపై, ప్రకృతి పట్ల మనం అనుసరిస్తున్న కట్టుబాట్లు పెళుసుగా ఉన్నాయని ఆయన అన్నారు.  1972 స్టాక్‌-హోమ్ సదస్సు జరిగినప్పటి నుండి గత 50 సంవత్సరాలుగా చాలా చర్చలు జరిగినప్పటికీ, జరిగింది మాత్రం చాలా తక్కువేనని, ఆయన ఎత్తి చూపారు.  అయితే, భారతదేశంలో, మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  "పేదలకు సమానమైన ఇంధన సదుపాయం అనేది, మా పర్యావరణ విధానానికి మూలస్తంభం" అని ఆయన అన్నారు.  ఉజ్వల యోజన కింద 90 మిలియన్ల గృహాలకు స్వచ్ఛమైన వంట  ఇంధనాన్ని అందించడం; పి.ఎం-కుసుమ్ పథకం కింద, రైతులు సౌర పలకల ఏర్పాటు చేసుకుని, పునరుత్పాదక విద్యుత్ ను ఉపయోగించుకునే విధంగా ప్రోత్సహించడం; ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌ కు విక్రయించడం వంటి చర్యల ద్వారా సుస్థిరత మరియు సమానత్వాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. 

సంవత్సరానికి 220 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ తో పాటు, 180 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఆదా చేయడంలో, ఏడేళ్లుగా అమలవుతున్న ఎల్.ఈ.డి. బల్బుల పంపిణీ పథకం సహాయపడిందని, ప్రధానమంత్రి వివరించారు.  అదేవిధంగా, హరిత హైడ్రోజన్‌ ను ట్యాప్ చేయాలని, జాతీయ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుందని కూడా ఆయన చెప్పారు.  హరిత హైడ్రోజన్ యొక్క సామర్థ్యాన్ని గ్రహించడానికి ఆచరణాత్మక పరిష్కారాలతో ముందుకు రావాలని, ఆయన, టి.ఈ.ఆర్.ఐ. వంటి విద్యా, పరిశోధనా సంస్థలను ప్రోత్సహించారు. 

ప్రపంచ భూభాగంలో 2.4 శాతంగా ఉన్న భారతదేశం ప్రపంచంలోని జాతులలో దాదాపు 8 శాతం కలిగి ఉంది.  భార‌త‌దేశం భారీ వైవిధ్య‌త‌తో కూడిన దేశ‌మ‌ని, ఈ ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డం మ‌న విధి అని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు. 

రక్షిత ప్రాంత నెట్‌వర్క్‌ ను బలోపేతం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలపై, ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ,   భారతదేశం చేస్తున్న కృషికి, ప్రకృతి పరిరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థ (ఐ.యు.సి.ఎన్) గుర్తింపు వంటి అంతర్జాతీయ గుర్తింపు లభించిన విషయాన్ని తెలియజేశారు.   జీవవైవిధ్యం యొక్క సమర్థవంతమైన పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఒక ఓ.ఈ.సి.ఎం. ప్రాంతంగా హర్యానాలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్‌ను ప్రకటించారు.   మరో రెండు భారతీయ చిత్తడి నేలలను రామ్‌-సర్ సైట్‌ లుగా గుర్తించడంతో భారతదేశంలో ఇప్పుడు 49 రామ్‌-సర్ సైట్‌ లు ఒక మిలియన్ హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్నాయి.

క్షీణించిన భూమిని పునరుద్ధరించడం అనేది ప్రధానంగా దృష్టి పెట్టే అంశాలలో ఒకటి కాగా, 2015 నుంచి ఇప్పటి దాకా, 11.5 మిలియన్ హెక్టార్లకు పైగా క్షీణించిన భూమిని పునరుద్ధరించడం జరిగింది.  "బాన్ ఛాలెంజ్ కింద భూమి క్షీణత తటస్థత యొక్క జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మేము పురోగమిస్తున్నాము.  యు.ఎన్.ఎఫ్. మరియు "ట్రిపుల్-సి"  కింద మేము నిర్ణయించుకున్న లక్ష్యాలను నెరవేర్చ గలమని,  మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.  గ్లాస్గో లో జరిగిన సి.ఓ.పి-26 సందర్భంగా కూడా మేము మా ఆశయాలను ప్రకటించాము.”, అని శ్రీ నరేంద్రమోదీ తెలియజేశారు. 

వాతావరణ న్యాయం ద్వారా మాత్రమే, పర్యావరణ సుస్థిరత సాధించగలమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఇరవై ఏళ్లలో భారత ప్రజల ఇంధన అవసరాలు దాదాపు రెట్టింపు అవుతాయని ఆయన అంచనా వేశారు.   "ఈ శక్తిని తిరస్కరిస్తే, మిలియన్ల మంది జీవితాలను తిరస్కరించినట్లే.   విజయవంతమైన వాతావరణ చర్యలకు తగిన ఆర్థిక సహకారం కూడా అవసరం. ఇందుకోసం, అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మరియు సాంకేతికత బదిలీపై తమ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది." అని ఆయన నొక్కి చెప్పారు.

సుస్థిరతకు అవసరమైన భౌగోళిక వనరుల కోసం సమన్వయంతో కూడిన చర్య అవసరమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. "ఈ విధంగా పరస్పరం ఆధారపడటాన్ని, మా ప్రయత్నాలు గుర్తించాయి.  అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా, మా లక్ష్యం ''ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్''.  ప్రపంచవ్యాప్త గ్రిడ్ నుండి ప్రతి చోటా అన్ని సమయాల్లో స్వచ్ఛమైన ఇంధన లభ్యతను నిర్ధారించే దిశగా మనం పని చేయాలి. ఇది ''ప్రపంచం మొత్తం'' అనే భారతదేశ విలువలను సూచించే విధానం". అని ఆయన వివరించారు. 

విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి (సి.డి.ఆర్.ఐ) మరియు "స్థితిస్థాపక ద్వీప రాష్ట్రాల కోసం మౌలిక సదుపాయాలు"  వంటి కార్యక్రమాల ద్వారా, విపత్తులు సంభవించే ప్రాంతాల ఆందోళనలు పరిష్కరించడం జరుగుతోంది.  ద్వీపం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయనీ, అందువల్ల వాటికి తక్షణ రక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఎల్.ఐ.ఎఫ్.ఈ. - పర్యావరణం కోసం జీవనశైలి మరియు భూగోళానికి అనుకూలమైన ప్రజలు (3-పి.లు)  అనే రెండు కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.  భౌగోళిక వనరులను మెరుగుపరచడానికి మనం చేపడుతున్న పర్యావరణ ప్రయత్నాలకు, ఈ అంతర్జాతీయ సంకీర్ణాలు పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు.

*****

DS


(Release ID: 1798919) Visitor Counter : 270