రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల రైడింగ్ లేదా మోటారు సైకిల్‌పై తీసుకెళ్లే విషయమై భద్రతా చర్యల నోటిఫికేషన్ జారీ
Posted On:
16 FEB 2022 2:11PM by PIB Hyderabad
ఫిబ్రవరి 15, 2022 తేదీన రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం
సీఎంవీఆర్, 1989లోని రూల్ 138ని సవరించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల, రైడింగ్ లేదా మోటారు సైకిల్‌పై తీసుకువెళ్లే వారికి సంబంధించి భద్రతా చర్యల నిబంధనలను సూచించింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం ఇది నోటిఫై చేయబడింది, దీని ప్రకారం నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల భద్రత, మోటారు సైకిల్‌పై ప్రయాణించడం లేదా తీసుకువెళుతున్న వారి భద్రత కోసం తగిన చర్యలను చేపట్టాలి. ఇంకా, ఇది భద్రతను మరియు క్రాష్ హెల్మెట్ వాడకాన్ని నిర్దేశిస్తుంది. అలాంటి సవారీలను తీసుకుపోయే మోటార్ సైకిళ్ల వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లకు పరిమితం చేస్తుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (రెండవ సవరణ) రూల్స్, 2022 ప్రచురించిన తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత ఈ నియమాలు అమల్లోకి వస్తాయి.
***
(Release ID: 1798880)
Visitor Counter : 189