నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అపోహలు V/S వాస్తవాలు


ఏదైనా నిర్దిష్ట డెవలపర్ నుండి పునరుత్పాదక ఇంధనాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రాన్ని బలవంతం చేస్తుందని పేర్కొనడం పూర్తిగా తప్పు

ఆర్ఈకి సంబంధించిన అన్ని సేకరణలు ఎస్ఈసీఐ ద్వారా ఓపెన్ బిడ్‌ల ద్వారా నిర్వహించబడతాయి

రైతుల విద్యుత్ కనెక్షన్లకు మోటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బలవంతం చేస్తుందనేది పూర్తిగా అబద్ధం మరియు అవాస్తవమని కేంద్ర విద్యుత్ మరియు ఎన్ఆర్ఈ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అన్నారు.

తెలంగాణకు జోడించబడుతున్న హైడ్రో కెపాసిటీకి పీఎఫ్‌సీ మరియు ఆర్‌ఈసీ 55,000 కోట్ల రుణాలు అందజేస్తున్నాయి. ఆ రెండూ భారత ప్రభుత్వ సిపిఎస్‌యులే.

రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్‌పిఓ) అనేది శిలాజ ఇంధనాల నుండి శిలాజ రహిత ఇంధన వనరులకు శక్తి పరివర్తనను నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు చేసిన అంతర్జాతీయ నిబద్ధతలో భాగం.

Posted On: 15 FEB 2022 5:57PM by PIB Hyderabad

11.02.2022 నాడు జనగాం జిల్లా ప్రధాన కార్యాలయంలో చేసిన ప్రసంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పాఠాన్ని విద్యుత్ మరియు నవీన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ గమనించింది. ఇది అవాస్తవం  అని విద్యుత్ మరియు ఎంఎన్‌ఆర్‌ఈ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ అన్నారు.

ఏదైనా నిర్దిష్ట డెవలపర్ నుండి పునరుత్పాదక ఇంధనాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాన్ని బలవంతం చేస్తుందని పేర్కొనడం పూర్తిగా తప్పు. రాష్ట్రాలు తమ సొంత బిడ్‌లతో, ఆ బిడ్‌ల ఆధారంగా ఏదైనా డెవలపర్ నుండి రెన్యూవబుల్ ఎనర్జీని కొనుగోలు చేయవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఓపెన్ బిడ్లను నిర్వహిస్తుంది. ఈ బిడ్‌లు చాలా పోటీగా ఉంటాయి; అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి మరియు తక్కువ టారిఫ్‌ను అందించే కంపెనీలు ఓపెన్ బిడ్ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయబడతాయి. ఆ తర్వాత, ఆ బిడ్‌ల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయాలనుకునే రాష్ట్రాలు తమ అవసరాన్ని బట్టి అలా చేస్తాయి. బిడ్‌లలో ఖరారు చేసిన ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్రాల స్వంత నిర్ణయం. వారు తమ సొంత బిడ్‌లను ఎంచుకోవచ్చు. అందుకే ముఖ్యమంత్రి ప్రకటన పూర్తిగా అబద్ధమన్నారు.

రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్‌పిఓ)కి సంబంధించినంత వరకు శిలాజ ఇంధనాల నుండి శిలాజ యేతర ఇంధన వనరులకు శక్తి పరివర్తనను చేపట్టేందుకు దేశాలు చేసిన అంతర్జాతీయ నిబద్ధతలో ఇది ఒక భాగం. ప్రపంచం మొత్తం నేడు క్షీణిస్తున్న పర్యావరణం, పెరుగుతున్న ఉద్గారాలు మరియు గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందుతోంది మరియు ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలు శిలాజ ఇంధనాల నుండి నాన్-ఫాసిల్ ఇంధనానికి మారడానికి మరియు పునరుత్పాదకాలను స్వీకరించడం ద్వారా ఉద్గారాలను తగ్గించడానికి కట్టుబడి ఉన్నాయి. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వేర్వేరు లక్ష్య తేదీలలో నికర సున్నాని సాధించాలని ప్రతిజ్ఞ చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలు 2050 నాటికి నికర సున్నాని సాధించాలని ప్రతిజ్ఞ చేశాయి. 2070 నాటికి నికర సున్నాని సాధిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. శిలాజ రహిత ఇంధనాలకు అంటే పునరుత్పాదక శక్తికి మారడం ఆ నిబద్ధతలో భాగం.

జలవిద్యుత్ గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అయన మాట్లాడుతున్న హైడ్రో పవర్ కెపాసిటీ, పిఎఫ్‌సి మరియు ఆర్‌ఈసీ ఇచ్చిన రుణాల కారణంగా నిర్మించబడింది మరియు నిర్మించబడుతోంది; రెండూ భారత ప్రభుత్వ సంస్థలు. కాళేశ్వరం మరియు పాలమూరు తదితర ప్రాజెక్టుల కోసం పిఎఫ్‌సి మరియు ఆర్‌ఈసీ కలిసి రూ.55,000 కోట్లు రుణంగా అందించాయి;  ఈ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి.

రైతుల విద్యుత్ కనెక్షన్లకు మోటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోందని ముఖ్యమంత్రి మరో ప్రకటన చేశారు. ఈ ప్రకటన పూర్తిగా తప్పు- అబద్ధం.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి తప్పుడు, నిరాధారమైన ప్రకటనలు తగవు.


 

***


(Release ID: 1798630) Visitor Counter : 270