వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

క్రూడ్ పామ్ ఆయిల్ (సి.పి.ఓ) కోసం 2022 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అమలయ్యే విధంగా వ్యవసాయ-సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన - కేంద్ర ప్రభుత్వం


వ్యవసాయ సుంకం తగ్గింపు తర్వాత, సి.పి.ఓ. మరియు రిఫైండ్ పామాయిల్ మధ్య 8.25 శాతానికి పెరిగిన - దిగుమతి పన్ను వ్యత్యాసం



దేశీయంగా చమురు శుద్ధి పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముడి చమురు దిగుమతి ప్రోత్సాహానికి - నిర్ణయం

Posted On: 14 FEB 2022 5:53PM by PIB Hyderabad

వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో, అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా తినే చమురు పదార్ధాల ధరల పెరుగుదల కారణంగా దేశీయ ఎడిబుల్ ఆయిల్స్ ధరలు మరింత పెరగకుండా ఉండేందుకు, భారత ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్ (సి.పి.ఓ) కోసం వ్యవసాయ-సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.   ఇది 2022 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.  వ్యవసాయ సుంకం తగ్గింపు తర్వాత, సి.పి.ఓ. మరియు శుద్ధి చేసిన పామాయిల్ మధ్య దిగుమతి పన్ను వ్యత్యాసం 8.25 శాతానికి పెరిగింది.  సి.పి.ఓ. మరియు రిఫైన్డ్ పామ్ ఆయిల్ మధ్య అంతరం పెరగడంతో, ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేయడానికి దేశీయ రిఫైనింగ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది.

తినదగిన నూనెల ధరలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా, క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయా బీన్ ఆయిల్, క్రూడ్ సన్‌-ఫ్లవర్ ఆయిల్‌ పై ప్రస్తుతం ఉన్న సున్నా శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రాథమిక రేటును 2022 సెప్టెంబర్, 30వ తేదీ వరకు పొడిగించడం జరుగుతోంది.   శుద్ధి చేసిన పామ్ ఆయిల్ పై 12.5 శాతం, శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, శుద్ధి చేసిన సన్‌-ఫ్లవర్ ఆయిల్‌ పై 17.5 శాతం దిగుమతి సుంకం రేటు, 2022 సెప్టెంబర్, 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.  తక్కువ లభ్యత, ఇతర అంతర్జాతీయ కారకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధోరణిలో కొనసాగే ఎడిబుల్ ఆయిల్‌ ధరలను తగ్గించడంలో ఈ చర్య సహాయపడుతుంది.

ఇప్పుడు తీసుకున్న ఈ చర్యలు,  ప్రభుత్వం గతంలో తీసుకున్న, నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం, 2022 జూన్, 30వ తేదీ వరకు ఎడిబుల్ ఆయిల్స్ మరియు ఆయిల్ సీడ్స్‌ పై స్టాక్ పరిమితి పరిమాణాలను పేర్కొంటూ, 2022 ఫిబ్రవరి 3వ తేదీన  ప్రభుత్వం జారీ చేసిన స్టాక్ లిమిట్ ఆదేశాల వంటి చర్యలకు బలం చేకూరుస్తాయి.  ఈ చర్య మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ మరియు నూనె గింజల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ మొదలైన అన్యాయమైన పద్ధతులను అరికట్టవచ్చని అంచనా వేయబడింది.  వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో తమ వంతు కృషి చేసేందుకు చమురు పరిశ్రమతో రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్టాక్ పరిమితి ఆర్డర్‌ ను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించడం జరిగింది.

*****



(Release ID: 1798559) Visitor Counter : 167