ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

పట్టణ స్థానిక సంస్థల కోసం రాష్ట్రాలకు రూ.1154.90 కోట్లు గ్రాంట్ విడుదల


2021-22లో ఇప్పటివరకు పట్టణ స్థానిక సంస్థలకు మొత్తం రూ.9,172.63 కోట్ల గ్రాంట్ విడుదల

Posted On: 14 FEB 2022 5:45PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు అందించడానికి 4 రాష్ట్రాలకు రూ. 1154.90 కోట్లు  విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ (రూ. 225.60 కోట్లు), బీహార్ (రూ. 769 కోట్లు), గుజరాత్ (రూ. 165.30 కోట్లు), సిక్కిం (రూ. 5 కోట్లు) రాష్ట్రాలకు ఈ  గ్రాంట్లు విడుదల చేసింది. . విడుదల చేసిన గ్రాంట్లు కంటోన్మెంట్ బోర్డ్‌లతో సహా నాన్-మిలియన్ ప్లస్ సిటీస్ (ఎన్ఎంపిసిలు) కోసం ఉద్దేశించబడ్డాయి.

15వ ఆర్థిక సంఘం 2021-22 నుండి 2025-26 వరకు తన నివేదికలో పట్టణ స్థానిక సంస్థలను రెండు వర్గాలుగా విభజించింది: (ఎ) మిలియన్-ప్లస్ పట్టణ సముదాయాలు/నగరాలు (ఢిల్లీ మరియు శ్రీనగర్ మినహా), మరియు (బి) మిగిలిన అన్ని ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న ఇతర నగరాలు మరియు పట్టణాలు (మిలియన్ ప్లస్ కాని నగరాలు). 15వ ఎఫ్‌సి వారికి ప్రత్యేక గ్రాంట్‌లను సిఫార్సు చేసింది. నాన్-మిలియన్ ప్లస్ నగరాల కోసం కమిషన్ సిఫార్సు చేసిన మొత్తం గ్రాంట్‌లలో, 40% ప్రాథమిక (అన్‌టైడ్) గ్రాంట్ మరియు మిగిలిన 60% టైడ్ గ్రాంట్. జీతం చెల్లింపు మరియు ఇతర స్థాపన ఖర్చులు మినహా, ప్రాథమిక గ్రాంట్లు (అన్‌టైడ్) స్థాన నిర్దిష్ట అవసరాల కోసం ఉపయోగిస్తారు

మరోవైపు, ప్రాథమిక సేవల డెలివరీకి మద్దతు ఇవ్వడం మరియు బలోపేతం చేయడం కోసం మిలియన్ ప్లస్ కాని నగరాల కోసం టైడ్ గ్రాంట్‌లు విడుదల చేశారు. మొత్తం టైడ్ గ్రాంట్‌లో, 50% 'శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ అఫైర్స్  అభివృద్ధి చేసిన స్టార్ రేటింగ్‌ల కోసం కేటాయించబడింది. మిగిలిన 50% ‘తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ మరియు నీటి రీసైక్లింగ్‌తో ముడిపడి ఉంది.

వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పారిశుద్ధ్యం, తాగునీటి కోసం కేంద్రం, రాష్ట్రం కేటాయించిన నిధుల కంటే పట్టణ స్థానిక సంస్థలకు అదనపు నిధుల లభ్యతను నిర్ధారించడానికి,పౌరులకు నాణ్యమైన సేవలను అందించడానికి టైడ్ గ్రాంట్లు ఉద్దేశించినవి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు విడుదల చేసిన పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్‌లు రాష్ట్రాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

(రూ. కోట్లలో)

 

 

రాష్ట్రం 

2021-22లో యుఎల్బి కి విడుదల చేసిన నిధులు 

1

ఆంధ్రప్రదేశ్ 

873.00

2

అరుణాచల్ ప్రదేశ్ 

0.00

3

అస్సాం 

0.00

4

బీహార్ 

759.00

5

చత్తిస్గఢ్ 

369.90

6

గోవా 

13.50

7

గుజరాత్ 

660.00

8

హర్యానా 

193.50

9

హిమాచల్ ప్రదేశ్ 

98.55

10

ఝార్ఖండ్ 

187.00

11

కర్ణాటక 

375.00

12

కేరళ 

168.00

13

మధ్యప్రదేశ్ 

499.00

14

మహారాష్ట్ర 

461.00

15

మణిపూర్ 

0.00

16

మేఘాలయ 

0.00

17

మిజోరాం 

17.00

18

నాగాలాండ్ 

0.00

19

ఒడిశా 

411.00

20

పంజాబ్ 

185.00

21

రాజస్థాన్ 

490.50

22

సిక్కిం 

10.00

23

తమిళ నాడు 

741.75

24

తెలంగాణ 

209.43

25

త్రిపుర 

58.00

26

ఉత్తర ప్రదేశ్ 

1592.00

27

ఉత్తరాఖండ్ 

104.50

28

పశ్చిమ బెంగాల్ 

696.00

 

మొత్తం 

9172.63

 

 

****



(Release ID: 1798393) Visitor Counter : 150