వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

"ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం" పైలట్ పథకం కింద 11 రాష్ట్రాల‌లోని గుర్తించబడిన జిల్లాల్లో బలవర్థకమైన బియ్యం పంపిణీ


పైలట్ పథకం రూ.174.64 కోట్ల వ్య‌యంతో 2019-20 నుంచి 3 సంవత్సరాల కాల‌ప‌రిమితితో కొన‌సాగుతుంది

Posted On: 11 FEB 2022 4:52PM by PIB Hyderabad

 

"బియ్యాన్ని బలవ‌ర్థ‌కం చేయ‌డం మ‌రియు దానిని ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ కింద‌ పంపిణీ చేయ‌డం"  అనే కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  2019-20లో ప్రారంభమై మూడు సంవత్సరాల కాలానికి  పంపిణీ ప‌థ‌కం కొన‌సాగుతుంది. దీనికి  గాను మొత్తం రూ. 174.64 కోట్లు కేటాయించ‌డం జ‌రిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు,  ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన  ప్ర‌శ్న‌కు  మంత్రి లిఖిత పూర్వ‌క సమాధానంగా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. పైలట్ పథకం 15 రాష్ట్రాల్లోని 15 జిల్లాలపై దృష్టి సారిస్తుంది. ప్రాధానంగా ఒక్కో రాష్ట్రానికి 1 జిల్లాను ఇందుకు గుర్తించారు.. పైలట్ స్కీమ్‌కు సమ్మతించిన 15 రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొత్తం పదకొండు (11) రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు పైలట్ పథకం కింద వారి గుర్తించిన జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసినట్లు నివేదించాయి. పైలట్ పథకం కింద ఇప్పటివరకు మొత్తంగా 3.64 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల‌) బలవర్ధక బియ్యం పంపిణీ చేయబడింది. ఫోర్టిఫికేషన్  చేయ‌డానికి కిలోకు 73 పైసల అధ‌న‌పు వ్య‌యం అవుతోంది. ఈ ధరను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మిల్లర్లకు బలవర్థకమైన బియ్యం ఉత్పత్తి కోసం ఏకరీతిగా రీయింబర్స్ చేస్తాయి.  ఈశాన్య-తూర్పు, కొండ ప్రాంతాలలో 90:10 నిష్పత్తిలో కేంద్రం మరియు రాష్ట్రాలు/UTల మధ్య పంచబడతాయి. ద్వీప రాష్ట్రాలు/యూటీల‌ల‌లో మరియు మిగిలిన రాష్ట్రాల విషయంలో ఈ రీయింబర్స్  విధానం 75:25 నిష్పత్తిలో ఉంటుంది.
                                                                     

*******(Release ID: 1797982) Visitor Counter : 117


Read this release in: Marathi , English , Urdu , Tamil