హోం మంత్రిత్వ శాఖ
4వ భారత్-యుకె హోం వ్యవహారాల చర్చలు
Posted On:
10 FEB 2022 6:12PM by PIB Hyderabad
4వ భారత్-యుకె హోం వ్యవహారాల చర్చలు ఈ రోజు వర్చువల్ విధానంలో జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి కేంద్ర హోం కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా నాయకత్వం వహించగా, యుకె ప్రతినిధి బృందానికి హోం కార్యాలయ శాశ్వత కార్యదర్శి శ్రీ మాథ్యూ రైక్రాఫ్ట్ నాయకత్వం వహించారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఎక్స్‌ట్రాడిషన్ కేసులు, మైగ్రేషన్, మొబిలిటీ మొదలైన అనేక రకాల సమస్యలను ఈ సంభాషణల్లో చర్చకు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న అప్పగింత కేసులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని భారతదేశం ఈ సందర్భంగా నొక్కి చెప్పింది.
యుకే లోని కొన్ని తీవ్రవాదులు మరియు రాడికల్ ఎలిమెంట్స్ చేస్తున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి అంశాల కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన చురుకైన చర్య తీసుకోవాలని యుకే ని కోరింది. ఇరు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించారు.
భద్రతకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించడంతో సమావేశం ముగిసింది.
*****
(Release ID: 1797434)