జల శక్తి మంత్రిత్వ శాఖ
విజయ గాధ : గ్రామీణ స్వచ్ఛ భారత్- రెండో దశ
ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణలో తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం ముందడుగు
Posted On:
10 FEB 2022 12:55PM by PIB Hyderabad
కాలుష్య సమస్య నుంచి ప్రజలను రక్షించి, ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణలో ఆకాంక్షాత్మక జిల్లాల్లో ఒకటైన భద్రాద్రి కొత్తగూడెం పరిపాలనా యంత్రాంగం ప్రజల సహకారంతో అమలు చేస్తున్న ఒడిఎఫ్ ప్లస్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కాలుష్య రహిత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసి ప్రజలందరి సహకారంతో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
గ్రామీణ స్వచ్ఛ భారత్ మొదటి దశలో 88,416 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం 2019లో ఒడిఎఫ్ గుర్తింపు పొందింది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో పరిపాలన యంత్రాంగం కొత్తగా అభివృద్ధి చెందిన గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇంతవరకు 1090 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం తో వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం సహకారంతో కార్యక్రమాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు దీనిలో సౌకర్యాలు కల్పిస్తారు.
ఘన వ్యర్థాల నిర్వహణ
ఘన వ్యర్థాల నిర్వహణ కోసం 22 మండలాల్లో ఉన్న 479 గ్రామ పంచాయతీలు షెడ్లు నిర్మించాయి. వ్యర్థాలను సేకరించేందుకు ట్రాక్టర్లను సమకూర్చు కున్నాయి. వీటిని సక్రమంగా నిర్వహించేలా చూసేందుకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టింగ్ జరుగుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో అయిదు అంచెల వ్యవస్థను అమలు చేస్తున్నారు. వెలువడిన ప్రాంతంలో వ్యర్దాలను వేరు చేయడం, సేకరణ, తరలింపు, శుద్ధి, హాని లేకుండా వ్యర్థాల తొలగింపు కోసం కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
పొడి వ్యర్థాలను విభజించి వాటిని తరలించే ప్రక్రియ సవాళ్లతో కూడుకున్న అంశంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి నుంచి దానికి తగిన సహకారం లభించదు. ఈ సమస్యలను అధిగమించేందుకు వాష్ సంస్థ (వాష్-I) సహాయ సహకారం అందించింది. వ్యర్థాల విభజన లో లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో మరియు జిల్లా, మండల మరియు గ్రామ పంచాయతీ స్థాయి సిబ్బందికి సామర్థ్య-నిర్మాణ సదస్సులు నిర్వహించి వాష్ సంస్థ (వాష్-I) సమస్యను పరిష్కరించింది.
ప్రస్తుతం 168 గ్రామ పంచాయతీలలో వ్యర్థాలను అవి వెలువడుతున్న ప్రాంతాల్లో విభజించడం జరుగుతోంది. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇది 70 శాతం వరకు అమలులో ఉంది. అన్ని గ్రామ పంచాయతీలలో 100 శాతం వ్యర్థాల విభజన జరిగేలా చూసేందుకు వాష్-I కింద వారానికి ఒకసారి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ
5 సెప్టెంబర్ 2019న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సంయుక్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నిషేదించిన యంత్రాంగం గుడ్డతో చేసిన సంచులను ప్రత్యామ్నాయ వస్తువులుగా ప్రవేశ పెట్టింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా కారక్రమాలు అమలు చేయాలని ఆదేశాలు విడుదల అయ్యాయి.
ప్లాస్టిక్ రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తీర్చిదిద్దేందుకు, ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడానికి స్వయం సహాయక బృందాల సభ్యుల సహకారం తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ సంచులను సేకరించడానికి, వేరు చేయడానికి మరియు పార వేసేందుకు ప్రజల సహకారం పొందేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాల్సిన ఆవశ్యకతపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సమావేశాలు, ర్యాలీలు, వర్క్‌షాప్‌లు నిర్వహించి ప్రజలకు గుడ్డ సంచులను సిద్ధం చేసి పంపిణీ చేశారు.
పునర్వినియోగపరచదగిన వ్యర్థాల ప్రోసెసింగ్ విషయానికొస్తే పొడి వ్యర్థాలను సురక్షితంగా తొలగించేందుకు గ్రామ పంచాయతీలు స్థానిక స్క్రాప్ డీలర్‌లతో కలిసి పనిచేస్తున్నాయి. రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ సహకారంతో జిల్లా స్థాయిలో వ్యర్థాల నిర్వహణ సేవలను అందిస్తున్న సంస్థలతో జిల్లా యంత్రాంగం అవగాహన కుదుర్చుకుంది. ఐటీసీ ఇప్పటికే స్థానిక పట్టణ ప్రాంతాల సంస్థలతోకలిసి పనిచేస్తోంది. కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు, పాల్వంచ లలో 4 డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పనిచేస్తున్న ఈ కేంద్రాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థాలను తీసుకుని శుద్ధి చేస్తున్నాయి. తమ సమీపంలో ఉన్న డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లకు తమ వ్యర్థాలను తరలించాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వాష్-I సహకారంతో వ్యర్థాల ప్రామాణీకరణ మరియు వర్గీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల పునర్వినియోగపరచలేని వ్యర్థాల ఫార్వర్డ్ లింకేజీ సాధ్యమవుతాయి. స్థానిక పట్టణ సంస్థల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో డిఆర్‌సిసి లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ద్రవ వ్యర్థాల నిర్వహణ:
ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశానికి గ్రామ పంచాయతీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. గృహ స్థాయిలో వ్యక్తిగత మేజిక్ సోక్ పిట్‌లపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వీటిలో నుంచి రంగు మారిన నీటిని కమ్యూనిటీ సోక్ పిట్‌లకు తరలిస్తారు. ఇక్కడ వ్యర్థ జలాలను సమర్థవంతంగా శుద్ధి చేయడం జరుగుతుంది. దీంతో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి మండలంలో 6 జీపీలు ఎల్‌డబ్ల్యూఎం కార్యకలాపాలతో పనిచేసే మిషన్ మోడల్‌లో సోక్ పిట్‌లు,వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఇప్పటి వరకు 32,79 వ్యక్తిగతమరుగుదొడ్లు , 1,331 సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు.
ఓడిఎఫ్ ప్లస్ విజయాలు: ఇప్పటివరకు జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్ ప్లస్ పంచాయతీలుగా గుర్తింపు పొందాయి. అన్ని గృహాలు మరియు సంస్థలకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడం, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను కల్పించి వాటిని సక్రమంగా నిర్వహించడం లాంటి అంశాలకు దీనిలో ప్రాధాన్యత కల్పిస్తారు. ఓడిఎఫ్ ప్లస్ కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించే అంశంలో జిల్లా చాలా ముందుంది. ఐఈసి కార్యక్రమాల నిర్వహణ, ప్రముఖ ప్రాంతాలలో సందేశాలను ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. b అన్ని GPSలు IE సందేశాలను కలిగి ఉండేలా చూసుకోవడం, ప్రముఖంగా పబ్లిక్ స్పేస్‌లలో ఉంచబడింది. అంతేకాకుండా, 100 శాతం ద్రవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు సౌకర్యాలను కల్పించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఓడిఎఫ్ ప్లస్ గుర్తింపు పొందాలని అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కేవలం గ్రామ పంచాయతీలు మాత్రమే కాకుండా మొత్తం జిల్లా ఓడిఎఫ్ ప్లస్ గుర్తింపు పొందేలా చూసేందుకు మల బురద ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. దీనిలో భాగంగా నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నాలుగు శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవి సెప్టిక్ ట్యాంక్‌లతో కూడిన గ్రామీణ హెచ్‌హెచ్‌ల అవసరాలను తీరుస్తూ మల బురదను సురక్షితంగాతొలగిస్తుంది.
***
(Release ID: 1797297)
Visitor Counter : 197