పర్యటక మంత్రిత్వ శాఖ
భారతదేశంలో గ్రామీణ పర్యాటక అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ వ్యూహం అమలు పధకాన్ని రూపొందించింది- ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక ప్రయత్నం : శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
07 FEB 2022 5:44PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ గ్రామీణ టూరిజపు అపారమైన సామర్థ్యాన్ని గుర్తించింది. పర్యాటక ప్రాంతాల ప్రచారం, వాటి అభివృద్ధిపై చురుకుగా పని చేయాలని నిర్ణయించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ తదనుగుణంగా భారతదేశంలో గ్రామీణ పర్యాటక అభివృద్ధి కోసం జాతీయ వ్యూహం దిశానిర్దేశాన్ని రూపొందించింది- ఆత్మ నిర్భర్ భారత్ వైపు ముందడుగుగా , ఇది సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనలు, పరిశ్రమల భాగస్తోవాములతో పంచుకుంది.
వ్యూహ పత్రం క్రింది కీలక అంశాలపై దృష్టి పెడుతుంది:
i. గ్రామీణ పర్యాటకానికి నమూనా విధానాలు మరియు ఉత్తమ పద్ధతులు
ii. గ్రామీణ పర్యాటకం కోసం డిజిటల్ సాంకేతికతలు, వేదికలు
iii. గ్రామీణ పర్యాటకం కోసం క్లస్టర్లను అభివృద్ధి చేయడం
iv. గ్రామీణ పర్యాటకానికి మార్కెటింగ్ మద్దతు
v. వాటాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడం
vi. పాలన సంస్థాగత విధాన నిర్ణయాలు
పైవి కాకుండా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MORD) పథకం ప్రకారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM) ప్రకారం, క్లస్టర్ అభివృద్ధికి ఇరవై ఒక్క భాగాలు కావాల్సినవిగా సూచించారు అందులో టూరిజం అభివృద్ధి నమూనా ఒకటి.
ఈరోజు లోక్‌సభలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
****
(Release ID: 1797202)