రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎన్.హెచ్.ఎస్. వెంబడి హోర్డింగుల తొలగింపు
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2022 2:36PM by PIB Hyderabad
అనధికార ప్రకటనలకు చెందిన పరికరాలు / హోర్డింగులు / ప్రకటనల తొలగింపుకు సంబంధించిన ఆదేశాలు (గౌరవనీయమైన భారత ప్రభుత్వ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించిన ఆదేశాలు) ఢిల్లీ పురపాలక సంస్థలకు చెందిన ఢిల్లీ అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ-2017 లో ఉన్నాయి. ఢిల్లీ ఆస్తి పాడు చెయ్యడాన్ని నివారించే (డి.పి.డి.పి) చట్టం-2007 ప్రకారం కూడా చర్య తీసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి, ఢిల్లీ జి.ఎన్.సి.టి. కి చెందిన పట్టణాభివృద్ధి విభాగం ఒక విధానాన్ని రూపొందించి, ప్రకటించింది.
అంతేకాకుండా, మోటారు వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 116 ప్రకారం, భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ (ఎన్.హెచ్.ఏ.ఐ) లేదా కేంద్ర ప్రభుత్వంచే అధికారం పొందిన ఏదైనా ఇతర సంస్థ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి సహాయం కోరవచ్చు. అటువంటి సందర్భాల్లో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సహాయాన్ని అందించాలి. దీని ప్రకారం, జాతీయ రహదారుల వెంబడి హోర్డింగులు / ప్రకటనల తొలగింపు ప్రక్రియను స్థానిక పాలనా యంత్రాంగం నిరంతర సహాయంతో, ఎన్.హెచ్.ఏ.ఐ. చేపడుతుంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(రిలీజ్ ఐడి: 1797038)
సందర్శకుల సూచీ సంఖ్య : : 118