రక్షణ మంత్రిత్వ శాఖ
ముంబైలో పశ్చిమ నావికాదళ కమాండ్‌కు నావల్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ-2022
Posted On:
09 FEB 2022 10:58AM by PIB Hyderabad
పశ్చిమ నావికాదళ కమాండ్ (డబ్ల్యుఎన్‌సి)కు నావల్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ-2022ను 08 ఫిబ్రవరి 22న ముంబైలో జరిగింది.
స్వాతంత్య్ర దినోత్సవం 2020, గణతంత్ర దినోత్సవం 2021న ప్రకటించిన విశిష్ట సేవా పతకాలను, సౌర్య పతకాలను పశ్చిమ నావికాదళ కమాండ్ పివిఎస్ ఎం, ఎవిఎస్ ఎం, విఎస్ఎం, ఎడిసి, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్- చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ అవార్డుగ్రహీతలకు ప్రదానం చేశారు.
వేడుకలో కమాండర్ ధనుష్ మీనన్, హరిదాస్ కుందు ఎంసిఎ (ఎఫ్‌డి) II లకు నావు సేనా మెడల్ ( శౌర్యం)ను ప్రదానం చేయగా, కమాడోర్ అనిల్ మార్యకు నావు సేనా మెడల్ ( విధ పట్ల తత్పరత), ఆర్ డిఎం సందీప్ మెహతా, సర్జ్ ఆర్ఎడిఎం ఆర్తి సరీన్, కమాండొర్ శ్రీకాంత కేస్నూర్, కెప్టెన్ బీరేంద్ర సింగ్ బెయిన్స్, కెప్టెన్ సుమీత్ సింగ్ సోధి, కెప్టెన్ కపిల్ భాటియా, జయ్‌సింగ్, ఎంసిపిఒ 1 (జిడబ్ల్యు)గౌరవనీయ సబ్ లెఫ్టనెంట్‌కు విశిష్ట సేవా పతకాన్ని (విఎస్ఎం) ప్రదానం చేశారు.
గత కొన్ని ఏళ్ళుగా అసాధారణ పనితీరును ప్రదర్శించిన ఐఎన్ఎస్ గోమతి, బేస్ విక్చువల్లింగ్ యార్డ్ (ముంబై)లకు యూనిట్ సైటేషన్‌లను కమాండర్-ఇన్-చీఫ్ అందించారు.
విధులను నిర్వర్తించడంలో సిబ్బందికి అపరిమితమైన మద్దతును అందించిన అవార్డుగ్రహీతల కుటుంబ సభ్యులు చేసిన తోడ్పాటును అడ్మిరల్ గుర్తించారు.
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల కారణంగా అందరు అవార్డుగ్రహీతలకూ కలిపి నిర్వహించవలసిన ఈ ఉత్సవ వేడుకను కమాండ్ పరిధిలో నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని భారతీయ నావికాదళానికి చెందిన అనేకమంది సీనియర్ అధికారులు,, ప్రముఖులు, అవార్డు గ్రహీతల భాగస్వాములు, కుటుంబాలు వీక్షించాయి.
***
(Release ID: 1796845)
Visitor Counter : 179