భారత పోటీ ప్రోత్సాహక సంఘం
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సాను మైన్స్ ప్రాంతంలో డంపర్ మరియు డంపర్ ట్రక్ యూనియన్ లైమ్ స్టోన్ (డంపర్ ట్రక్ యూనియన్) తొలగింపు , ఆంక్షల ఉత్తర్వులు జారీ చేసిన సీసీఐ
Posted On:
09 FEB 2022 12:27PM by PIB Hyderabad
కాంపిటీషన్ చట్టం 2002 లోని సెక్షన్ 3('చట్టం') నిబంధనలు ఉల్లంఘించి పనిచేస్తున్న డంపర్ ట్రక్ యూనియన్ పై చట్టం లోని సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకుంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫిబ్రవరి 7, 2022న ఉత్తర్వులు జారీ చేసింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సాను మైన్స్ ప్రాంతంలో పనిచేస్తున్న డంపర్ మరియు డంపర్ ట్రక్ యూనియన్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ఆరోపిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు సీజే లాజిస్టిక్స్ లిమిటెడ్ (సీజేడి లాజిస్టిక్స్) నుంచి ఫిర్యాదు అందింది. సదరు యూనియన్ సరకు రవాణాకు తమ సంస్థ వాహనాలను అనుమతించడం లేదని పైపెచ్చు తమ యూనియన్ లో సభ్యులుగా ఉన్న వారికి చెందిన వాహనాలను డ్రైవర్లతో సహా వినియోగించాలని ఒత్తిడి తెస్తున్నదని సీసీఐ దృష్టికి సీజేడి లాజిస్టిక్స్ తీసుకుని వెళ్ళింది. దీనికోసం ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ సొంత వాహనాలు పని చేయకుండా అడ్డుపడుతున్న సదరు యూనియన్ దాని సభ్యులు బెదిరింపులకు దిగడం తో పాటు పని చేస్తే దాడి చేస్తామని కూడా బెదిరించారని సీసీఐ కి అందించిన సమాచారంలో సీజేడి లాజిస్టిక్స్ ఆరోపించింది.
సీజేడి లాజిస్టిక్స్ నుంచి అందిన సమాచారం, ఫిర్యాదును పరిశీలించి సీసీఐ విచారణ జరిపింది. చట్టంలోని 3(3)(ఎ), సెక్షన్ 3(3)(బి)లను సెక్షన్ 3(1)తో కలిపి చదివితే సదరు యూనియన్ నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిందని విచారణలో వెల్లడయింది. యూనియన్ సభ్యులు కుమ్మకై రవాణా ధరలను తమ ఇష్టం వచ్చినట్టు నిర్ణయించడమే కాకుండా సేవలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని సీసీఐ గుర్తించింది. దీనితో డంపర్ ట్రక్ యూనియన్ అధ్యక్షునిగా వ్యవహరించిన శ్రీ కున్వార్ రాజ్ సింగ్ ( చట్టంలోని సెక్షన్ 48 ప్రకారం బాధ్యత వహించాల్సిన వ్యక్తి) పదవి నుంచి తప్పుకోవాలని, సెక్షన్ 3 నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించరాదని ఆదేశిస్తూ సీసీఐ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కింది లింక్ లో సీసీఐ వెబ్ సైట్ లో కేసు నెంబర్ 31 ఆఫ్ 2019 కి సంబంధించి సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు అందుబాటులో ఉంటాయి.
https://www.cci.gov.in/sites/default/files/31-of-2019.pdf
(Release ID: 1796795)
Visitor Counter : 118