ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ర‌క్త విధానం

Posted On: 08 FEB 2022 12:32PM by PIB Hyderabad

జాతీయ ర‌క్త విధానానికి మ‌ద్ద‌తు నిచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం డ్ర‌గ్స్‌, కాస్మొటిక్స్ (ద్వితీయ స‌వ‌ర‌ణ‌) నిబంధ‌న‌ల 2020ని నోటిఫై చేసింది. ఈ నిబంధ‌న‌లు ర‌క్త నిధి ప‌నితీరు, ర‌క్తం ప్రాసెసింగ్‌, సంబంధిత అంశాల‌తో ముడిప‌డిన‌ది. ఈ నిబంధ‌న‌ల కాపీ కింది వెబ్ లింక్ లో అందుబాటులో ఉంది.
https://cdsco.gov.in/opencms/opencms/system/modules/CDSCO.WEB/elements/download_file_division.jsp?num_id=NTc2MQ

రక్తం , రక్త భాగాల ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ)ని డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (డిపిసిఓ) కిందకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల (యుటి ల‌)రాష్ట్ర రక్త మార్పిడి మండలులతో (ఎస్‌బిటిసిల‌తో)  జనవరి 03, 2022న జ‌రిగిన‌ సమావేశంలో, జాతీయ రక్త విధానాన్ని సమీక్షించాలని అవి సిఫార్సు చేశాయి. మ‌రోవైపు  , ఎన్‌బిటిసి, బిటిఎస్  విభాగం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ ఎ సి ఒ)నుండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కి మారుతోంది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో  ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విష‌యం తెలిపారు.

***


(Release ID: 1796705) Visitor Counter : 152


Read this release in: Urdu , English , Bengali , Malayalam