పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
09.01.2022 వరకు 86.05 లక్షల మంది ప్రయాణికులు ఆర్సీఎస్- ఉడాన్ విమానాల్లో ప్రయాణించారు
ప్రాంతీయ విమానాశ్రయాలు ఆర్సీఎస్- ఉడాన్ కింద ఎయిర్ ట్రాఫిక్‌లో ఆశించిన వృద్ధిని సాధిస్తున్నాయి
Posted On:
07 FEB 2022 4:24PM by PIB Hyderabad
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత పెంచేందుకు, విమాన ప్రయాణాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి 21-.10.-2016న ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) - ఉడాన్ (ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్)ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఉడాన్ అనేది మార్కెట్ ఆధారితంగా కొనసాగుతున్న పథకం. ఈ పథకం కింద మరిన్ని గమ్యస్థానాలు/స్టేషన్లను, మార్గాలను కవర్ చేయడానికి బిడ్డింగ్ రౌండ్‌లు కాలానుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తిగల విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలను అనుసంధానించే నిర్దిష్ట మార్గాలలో డిమాండ్‌ను అంచనా వేసి బిడ్డింగ్ సమయంలో తమ ప్రతిపాదనలను సమర్పించాయి.
ఉడాన్ పథకం కింద సాధించిన విజయాలు, దేశంలో పౌర విమానయాన రంగాన్ని పెంచే చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:
ఇప్పటి వరకు 65 విమానాశ్రయాలు (8 హెలిపోర్ట్‌లు & 02 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా) నుంచి 948 వ్యాలిడ్ రూట్లు, 403 రూట్లలో ఉడాన్ కింద దేశవ్యాప్తంగా విమానాలను నడపడం జరిగింది.
ఉడాన్ విమానాలు ప్రారంభమైనప్పటి నుండి 09.01.2022 వరకు సుమారు 86.05 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
టైర్-2 టైర్-3 నగరాల్లో ప్రజలు ప్రయాణించే విధానాన్ని ఉడాన్ మార్చింది. జార్సుగూడ, కిషన్‌గఢ్, బెల్గాం, దర్భంగా మొదలైన ప్రాంతీయ విమానాశ్రయాలు విమాన ట్రాఫిక్‌లో విపరీతమైన వృద్ధిని సాధిస్తున్నాయి.
ఈ పథకం సామాన్య వ్యక్తికి సరసమైన ధరలో ప్రయాణించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది, దీని కోసం ప్రభుత్వం ఆర్సీఎస్ పథకం కింద వీజీఎఫ్ని తీసుకొచ్చింది. విమానయాన సంస్థల సీట్లకు విమాన ఛార్జీలను ఇది తక్కువ ధరలకు పరిమితం చేసింది.
ఉడాన్ పథకం వల్ల హెలిపోర్ట్‌ల వినియోగం పెరిగింది. ఫలితంగా కొండ ప్రాంతాలు దీవులలో హెలికాప్టర్ సేవలు గణనీయంగా పెరిగాయి.
పౌర విమానయాన రంగం, ఆర్థిక వృద్ధి మధ్య బంధం ప్రాముఖ్యత అర్థమైంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏ) అధ్యయనం ప్రకారం ఎయిర్ కనెక్టివిటీ ఆర్థిక గుణకం 3.1 ఉపాధి గుణకం 6.1.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో విమాన ప్రయాణికుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)తో సంప్రదించి ఎయిర్‌లైన్ కోసం కొవిడ్ మార్గదర్శకాలు/ప్రోటోకాల్‌లు రూపొందించడం జరిగింది. ఈ–-బోర్డింగ్, వెబ్ చెక్-ఇన్, కాంటాక్ట్‌లెస్ డ్రాపింగ్ బ్యాగేజీ మొదలైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వకంగా ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1796684)
Visitor Counter : 113