ఆర్థిక మంత్రిత్వ శాఖ
పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రగతి
Posted On:
08 FEB 2022 1:34PM by PIB Hyderabad
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా అమలు చేయడానికి , మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖల ఇన్‌పుట్‌ల ఆధారంగా పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కోసం ప్రాజెక్ట్ గుర్తింపు కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఇప్పటి వరకు పీఎం గతి శక్తి ప్రగతి చుస్తే..
ఏ).భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపి) పోర్టల్‌లో సెంట్రల్ మినిస్ట్రీస్/డిపార్ట్‌మెంట్ సమన్వయంతో డిపిఐఐటి డేటా లేయర్‌లను ఏకీకృతం చేస్తోంది. దీనితో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటాయి.
బి) సాధికారత గల గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఈజిఓస్), నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పి జి), టెక్నికల్ సపోర్ట్ యూనిట్ (టి ఎస్ యు) ఏర్పాటు అయి అమలులోకి వచ్చాయి.
పీఎం గతి శక్తి ఎన్ఎంపిపై 17 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లకు శిక్షణ, సామర్థ్యం పెంపుదల పూర్తయింది. ఐదు జోనల్ సమావేశాలు నిర్వహించారు.
వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలు ఈజిఓస్, ఎన్ పి జి అనే రెండు సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా సమ్మిళితం చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. 18 మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈజిఓస్ ద్వారా కలపడం అయింది. ఈజిఓస్ ఒకటవ సమావేశం తర్వాత, నీతి ఆయోగ్, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖలు/విభాగాలు కూడా ఈజిఓస్ లో భాగంగా కో-ఆప్ట్ చేశామని మంత్రి తెలిపారు.
అదనంగా నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పి జి) రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు, రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ; ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ; పౌర విమానయాన మంత్రిత్వ శాఖ; విద్యుత్ మంత్రిత్వ శాఖ; కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ; పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మరియు టెలికమ్యూనికేషన్ శాఖ ను కలిగి ఉంటాయి.
ఈజీవోస్ ద్వారా ప్రాతినిధ్యం వహించే మంత్రిత్వ శాఖలు/విభాగాలు:-
రైల్వే మంత్రిత్వ శాఖ
రోడ్డు, రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ
విద్యుత్ మంత్రిత్వ శాఖ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్
బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల మంత్రిత్వ శాఖ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్స్ & పెట్రో-కెమికల్స్
ఎరువుల శాఖ
ఉక్కు మంత్రిత్వ శాఖ
వ్యయ శాఖ
ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
పర్యాటక మంత్రిత్వ శాఖ
పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ
ఫిషరీస్, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
వాణిజ్య శాఖ
నీతి ఆయోగ్
గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ;
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.
***
(Release ID: 1796682)