ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో ఫెయిర్-బ్యాంక్ వ్యాధి మరియు అక్రోమెగలీ కేసులు
प्रविष्टि तिथि:
08 FEB 2022 12:40PM by PIB Hyderabad
ఫెయిర్-బ్యాంక్ (ఎముకలలో పెరుగుదల సరిగా లేకపోవడం) వ్యాధి ఉన్న రోగికి సాధారణంగా నొప్పి మరియు ఆర్థోపెడిక్ విధానాల ద్వారా చికిత్స అవసరమవుతుంది. దీని కోసం భారతదేశంలోని టెరిటియరీ సంరక్షణ సంస్థల్లో తగిన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
అక్రోమెగలీ అనేది మరొక అరుదైన రుగ్మత. ఇది ఎముకల పెరుగుదల ను క్రమపరిచే హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల సంభవిస్తుంది. చాలా తరచుగా పిట్యూటరీ గ్రంధి లో ఏర్పడే కణితి నుంచి సంభవిస్తుంది. పొడవైన ఎముకల చివరి భాగాలు కలవడానికి ముందు, బాల్యం లో మరియు కౌమారదశలో ఉన్నవారిలో ఈ రుగ్మత కలిగినప్పుడు ఎత్తు ఎక్కువగా పెరగడానికి కారణమవుతుంది.
ఈ వ్యాధులకు గురైన రోగులు వైద్య కళాశాలలు, ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు వంటి టెరిటియరీ ఆరోగ్య సౌకర్యాలలో చికిత్స పొందుతున్నారు. టెరిటియరీ సంరక్షణ కల్పించే ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ఈ కేంద్రాల్లో వీరికి అవసరమైన చికిత్స ఉచితంగా లేదా రాయితీ ధరలకు అందుబాటులో ఉంటుంది. అక్రోమెగలీ వ్యాధి నివారణకు ఉపయోగించే "సొమాటోస్టాటిన్" అనే మందు, జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2015 ప్రకారం నిర్ధారించిన ఔషధం. అందువల్ల, జాతీయ ఔషధ ధరల సాధికార సంస్థ ఈ మందు గరిష్ట ధరను నిర్ణయించింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ విషయాన్ని పొందుపరిచారు.
*****
(रिलीज़ आईडी: 1796680)
आगंतुक पटल : 199