భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పరిశ్రమ సమగ్ర, నిరంతర అభివృద్ధికి కేంద్రం చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2022 3:18PM by PIB Hyderabad
ప్రభుత్వం, ఒక విధాన నిర్ణేతగా, పరిశ్రమ సమగ్ర ,నిరంతర అభివృద్ధి కోసం చర్యల ప్యాకేజీ ద్వారా ఆర్థిక వ్యవస్థ వేగాన్ని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఆటో సెక్టార్ కు మద్దతు ఇవ్వడానికి ఇటీవల ఈ దిగువ చర్యలు తీసుకున్నారు.
అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల దేశీయ తయారీని పెంచడానికి, ఆటోమోటివ్ తయారీ విలువ గొలుసులో పెట్టుబడులను ఆకర్షించడానికి ఐదు సంవత్సరాల కాలంలో రూ. 25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో భారతదేశంలో ఆటోమొబైల్ ఆటో కాంపోనెంట్స్ పరిశ్రమ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దేశంలో బ్యాటరీ ధరలను తగ్గించడానికి దేశంలో అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) తయారీ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ ఐ) పథకానికి ప్రభుత్వం 2021 మే 12న ఆమోదం తెలిపింది.బ్యాటరీ ధర తగ్గడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చు తగ్గుతుంది. వాటి అమ్మకాలు పెరుగుతాయి.
పాత , పనికి రాని వాహనాలను తొలగించడానికి స్వచ్ఛంద వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ప్రకటన
ఎంఎస్ ఎంఈ అభివృద్ధి చట్టం పరిధిలోకి వాహనాల టోకు, రిటైల్ వాణిజ్యం , మరమ్మతు
2021-22 బడ్జెట్ లో మొత్తం రూ.18,000 కోట్ల వ్యయంతో ప్రజా రవాణా బస్సు సర్వీస్ లను పెంచడానికి మద్దతు ఇచ్చే పథకానికి ఆమోదం
ఇథనాల్, ఫ్లెక్స్ ఇంజిన్, సిఎన్ జి, ఎల్ పిజి, గ్రీన్ హైడ్రోజన్ , ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకుంది:
ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ,కాంపోనెంట్ ల కోసం ఆటోమొబైల్స్ ,ఆటో కాంపోనెంట్ లకు
పిఎల్ ఐ స్కీం కింద ప్రోత్సాహకాలు.
సిఎన్ జి , ఎల్ పిజి పార్టులు ,కాంపోనెంట్ ల కోసం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్ లకు పిఎల్ ఐ స్కీం కింద ప్రోత్సాహకాలు.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ , వాటి కాంపోనెంట్ ల కోసం ఆటోమొబైల్స్ ,ఆటో కాంపోనెంట్ లకు పి ఎల్ ఐ స్కీం కింద ప్రోత్సాహకాలు.
ఇంకా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకుంది:
దేశంలో ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెహికల్స్ (ఎక్స్ ఈవిలు) దత్తత ను ప్రోత్సహించడానికి 2015లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వేగవంతమైన దత్తత ,తయారీ.(ఫేమ్ ఇండియా) పథకం
దేశంలో బ్యాటరీ ధరలను తగ్గించడానికి దేశంలో అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) తయారీ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ ఐ) పథకానికి ప్రభుత్వం 2021 మే 12న ఆమోదం తెలిపింది.
ఆటోమొబైల్ , ఆటో కాంపోనెంట్ల కోసం ఐదు సంవత్సరాల కాలానికి రూ. 25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో సెప్టెంబర్ 15, 2021న ఆమోదం పొందిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ ఐ) స్కీం ను ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింప చేస్తారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్ టి 12% నుంచి 5%కి తగ్గించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లు/ఛార్జింగ్ స్టేషన్లపై జిఎస్ టిని 18% నుంచి 5%కి తగ్గించారు.
బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లు ఇస్తామని, , పర్మిట్ ఆవశ్యకతల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్ టిహెచ్) ప్రకటించింది.
ఈవీలపై రహదారి పన్నును మాఫీ చేయాలని రాష్ట్రాలకు సలహా ఇస్తూ ఎంఓఆర్ టిహెచ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది, ఇది ఈవిల ప్రారంభ ఖర్చును తగ్గించడానికి సహాయపడుతుంది.
భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు.
******
(రిలీజ్ ఐడి: 1796677)
సందర్శకుల సూచీ సంఖ్య : : 149