పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త‌దేశంలోని ఈశాన్య ప్రాంతంలో రూ. 1300 కోట్ల మొత్తంతో 16 ప్రాజెక్టుల‌ను మంజూరు చేసిన ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖః శ్రీ జి. కిష‌న్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2022 5:45PM by PIB Hyderabad

ప‌ర్యాట‌క స్థ‌లాల‌ను గుర్తించ‌డం, అభివృద్ధి చేయ‌డం అన్న‌ది ప్ర‌ధానంగా సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాలు/  కేంద్ర పాలిత ప్రాంతాల భాధ్య‌త‌. అయితే, దేశంలో ప‌ర్యాట‌క స్థ‌లాల మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌, కేంద్ర పాలిత ప్రాంత ప్ర‌భుత్వాలు/  కేంద్ర ఏజెన్సీలు త‌దిత‌ర సంస్థ‌ల‌కు ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ స్వ‌దేశ్ ద‌ర్శ‌న్ ప‌థ‌కం కింద  నిధుల‌ను అందిస్తుంది. ఈ ప‌థ‌కం కింద భార‌త ఈశాన్య ప్రాంతంలో రూ. 1337.63 కోట్ల మొత్తంతో 16 ప్రాజెక్టుల‌ను ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ స్వ‌దేశ్ ద‌ర్శ‌న్ ప‌థ‌కం కింద అస్సాంలో 02 ప్రాజెక్టుల‌ను మంజూరు చేసింది. 
ఈ స‌మాచారాన్ని ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి లోక్‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ద్వారా వెల్ల‌డించారు.

 


(రిలీజ్ ఐడి: 1796396) సందర్శకుల సూచీ సంఖ్య : : 115
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi