మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ శ‌క‌టం భారతదేశ విద్యా విధాన‌పు గతం, వర్తమానం, భవిష్యత్తు మధ్య సంబంధాన్ని చ‌క్క‌గా వివ‌రించిందిః శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 04 FEB 2022 4:51PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవ పరేడ్, 2022లో భాగంగా మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా  విద్యా మంత్రిత్వ శాఖ కేంద్ర  అవార్డును గెలుచుకోవడం పట్ల విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మ‌రియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  భారతదేశ‌పు  అద్భుతమైన గతం, వర్తమానం మరియు భారతదేశంలోని విద్య యొక్క స్మార్ట్ భవిష్యత్తు మధ్య సంబంధాన్ని చ‌క్క‌గా తెలియ‌ప‌రుస్తూ “వేదాల నుండి మెటావర్స్ వరకు” అనే థీమ్‌తో జాతీయ విద్యా విధానం 2020ని శ‌క‌టంలో  ప్రదర్శించారని ఆయన అన్నారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు విద్య యొక్క దృక్పథాన్ని మేటి శ‌క‌టం ద్వారా తెలియ‌ప‌ర‌చ‌డంలో మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన‌ కృషిని ఆయన ప్రశంసించారు. రిపబ్లిక్ డే పరేడ్ 2022లో పోటీ ప్రదర్శనలో  ఇతర విజేతలను కూడా ఆయన అభినందించారు.

***



(Release ID: 1795666) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi