రైల్వే మంత్రిత్వ శాఖ
సెంట్రల్ రైల్వేకి చెందిన కిసాన్ రైలు వెయ్యవ ట్రిప్‌కు జెండా ఊపి ప్రారంభం
Posted On:
03 FEB 2022 7:00PM by PIB Hyderabad
సెంట్రల్ రైల్వేలోని మహారాష్ట్ర సావ్డా నుంచి ఢిల్లీలోని ఆదర్శ నగర్‌కు 03-02-2022 న వెయ్యవ కిసాన్ రైలు ట్రిప్పును కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్, కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌లు జండా ఊపి ప్రారంభించారు.
మహారాష్ట్రలోని సావ్డానుంచి ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌కు 23 కోచ్‌లలో 453 టన్నుల అరటి పళ్లను దీని ద్వారా రవాణా చేశారు. ఇప్పటివరకు 3.45 లక్షల టన్నుల వ్యవసయా ఉత్పత్తులను సెంట్రల్ రైల్వేనుంచి వెయ్యి కిసాన్ రైళ్లలో రవాణా చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, మనదేశం వ్యవసాయ ఆధారిత మైనదని, ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల బాగుకోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేసినట్టు చెప్పారు.
త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలను దూరప్రాంతంలోని మార్కెట్ కు తక్కువ సమయంలో తక్కువ ధరకు కిసాన్ రైలు ద్వారా రవాణా చేసి వారికి మెరుగైన ధరలభించేట్టు చేసే పథకమే కిసాన్ రైలు పథకమని అన్నారు. సెంట్రల్ రైల్వేలో కిసాన్ రైలు వెయ్యవట్రిప్‌ను జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. మొదటి కిసాన్ రైలు, వందవ కిసాన్‌రైలును ప్రధానమంత్రి జండా ఊపి ప్రారంభించిన కార్యక్రమానికీ తాను హాజరయ్యానని అన్నారు.
కేంద్ర రైల్వేమంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఎప్పుడూ రైతులపై ప్రధాన దృష్టి పెడతారని, రైతుల జీవితాల మెరుగుకోసం పలుచర్యలు ప్రారంభించారని అన్నారు. ఇలాంటి చర్యలలో కిసాన్ రైలు ఒకటని ఆయన అన్నారు. దీనివల్ల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దూరప్రాంతాలలోని మార్కెట్లకు తక్కువ ఖర్చుతో సత్వరం చేరవేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి, జాలగాన్ అరటికి జిఐ-గుర్తింపు లభించడం గర్వకారణమనికూడా చెప్పారు.జలగాన్ రైతులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఇంకా మరింత మెరుగుకు ఏవైనా సలహాలు సూచనలతో ముందుకురావలసిందిగా ఆయన రైతులకు సూచించారు.
రైల్వే,బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ రావ్‌సాహెబ్ దాదారావ్ పాటిల్ దాన్వే, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రక్ష ఖడ్సే లు రైతుల ప్రయోజనం కోసం రైల్వే చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు.
ఎమ్మెల్యేలు శ్రీచంద్రకాంత్ పాటిల్, శ్రీ శిరిష్‌చౌదరిలు సవ్డా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైల్వే బోర్డు ఛైర్మన్, ఛీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ శ్రీ వి.కె. త్రిపాఠి, ఈ కార్యక్రమానికి హాజరైనవారికి స్వాగతం పలికారు. కిసాన్‌రైల్ళు ప్రారంభమైనప్పటి నుంచి అవి ఎలా నడుస్తున్నాయో వివరించారు. అలాగే చిన్న రైతులలో ఇవి ఎంతగా ప్రజాదరణపొందాయో వివరించారు. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనిల్‌కుమార్ లహోటి ముంబాయి నుంచి వందన సమర్పణ చేశారు.
***
(Release ID: 1795665)
Visitor Counter : 158